Monday, 30 September 2013

జగన్ లింకులో అసలు సూత్రదారి అసదుద్దీనే


జగన్ కు సోనియాతో కలిసిన లింకులో అసలు సూత్రదారి ఎంఐఎం నేత అసదుద్దీన్ అన్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అసదుద్దీన్ తో వైఎస్ ఆత్మ కేవిపి రాంచంద్రరావు కలిసి జగన్ – సోనియా లింకును కలిపారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతే కాదు జగన్ జైలు నుంచి వచ్చిన మరుక్షణం తాను ఎంఐఎంతో కలిసిపోతానని, అందుకోసం అసదుద్దీన్ తో కలిసి చర్చించనున్నానని కూడా ప్రకటించారు. దీంతో ఈ వాదనకు బలం చేకూరుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ముందునుంచి సోనియా తీసుకున్న రాష్ట్రవిభజన నిర్ణయం వెనుక అసదుద్దీన్ అసలు పాత్ర పోషించాడన్న వార్తలు వెలుబడ్డ విషయం తెలిసిందే. అంతే కాదు జగన్ కయినా, కాంగ్రెస్ కయినా వారి గెలుపు కోసం ముస్లిం మైనార్టీల ఓట్లే కీలకం. వైఎఎస్ విజయాల వెనుక ముస్లిం ఓటర్ల మద్దతే ప్రధానంగా ఉందని అందరికి తెలుసు. అందుకే జగన్ ఎంఐఎం మద్దతును కోరుకుంటాడు. పైగా అసదుద్దీన్ కూడా కేవలం సిఎం కిరణ్ తోనే విభేదిస్తున్నాడు తప్ప కాంగ్రెస్ తో కాదు. జగన్ కు కూడా ఇప్పుడు సిఎం కిరణే అసలైన శతృవుగా మారనున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కిరణ్ ను తప్పించడాని అసదుద్దీన్ కేవిపితో కలిసి జగన్ – సోనియాల మద్య బంధాన్ని కలిపారంటున్న వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంతే కాదు, ఇప్పుడు కేంద్రస్థాయిలో కూడా జగన్, అసదుద్దీన్ లతో కలసి సోనియా అతి పెద్ద గేమ్ ఆడబోతోందన్న వార్తలు కూడా లేటెస్టుగా వినిపిస్తున్నాయి. ఎంఐఎం తో కలిసి మూడోఫ్రంట్ లో కీలకం అవుతామని జగన్ ప్రకటించాడు. రేపు కేంద్రంలో ఎన్నికలయ్యాక అవసరమైతే ఆ మూడో ఫ్రంట్ ను కూడా చీల్చి కాంగ్రెస్ కు మద్దతిచ్చే అవకాశాలపై ఇప్పటి నుంచి జరుగుతున్న మంత్రాంగం అన్న అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్న వాదన. ఇప్పటికయితే జగన్ వ్యవహారం పక్కా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉందన్నది వాస్తవం, ఇక రాజకీయాలు మున్ముందు ఎలా ఉంటాయి, ఈ వార్తలు నిజమా, కాదా అంటే ఎన్నికలయ్యేంత వరకు ఆగాల్సిందే.

పవన్ అత్తారింటి పై రాజమౌళి సంచలన వ్యాఖ్యానం..


తెలుగు సినిమా జక్కన్న రాజమౌళి పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాను చూసి వెరైటీగా స్పందించారు. నిన్న ఆదివారం తన ‘బాహుబలి’ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరీ అత్తారింటికి వెళ్ళాడట రాజమౌళి. ఈ సినిమా గొప్పతనాన్ని తన ట్విటర్ లో మూడు వాక్యాల్లో రాశాడు రాజమౌళి. ఈసినిమాను చూస్తున్నంతసేపు ప్రతి సీన్ లోను పవన్ త్రివిక్రమ్ ల అద్భుతమైన టేలెంట్ తనకు కనిపించిందనీ తన ట్విటర్ లో ట్విట్ చేసారు రాజమౌళి. ఈ మాటలు ప్రతి వ్యక్తి చెప్పేవె అయినా ఒక అద్భుతం గురించి చెపుతున్నప్పుడు అందరు ఇంచుమించు గా ఒకేలా చెప్పవలసి వస్తుందనీ అంటు పవన్ అత్తారిల్లు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో అనే విషయాలు గురించి ఆలోచించే కంటే, ప్రస్తుతం ఉన్న సంక్లిష్ట పరిస్థుతులలో తెలుగు సినిమాకు దారి చూపిన సినిమాగా పవన్ ‘అత్తారింటికి దారేది’ చరిత్రలో నిలిచి పోతుంది అని వ్యాఖ్యానించడమే కాకుండా ఒక మంచి కుటుంబ సినిమాను ప్రస్తుతు పరిస్తులలో తీసిన ఘనత త్రివిక్రమ్ హీరో పవన్ లకు మాత్రమే వచ్చితీరుతుందని అభిప్రాయ పడ్డాడు రాజమౌళి. టాలీవుడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈసినిమా 60 కోట్లు పైనే వసూలు చేస్తుందని అంటున్నారు ..

ఆ దమ్మున్నది మహేష్, పవన్ కళ్యాణ్ లకే


భారత సినిమా చరిత్రలో ఆ రికార్డును తిరగరాసే దమ్మున్న హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లకే ఉన్నందంటున్నారు సినివిశ్లేషకులు. అందరికి తెలుసు బాక్సాఫీసు వద్ద బద్దలు చేసే కలెక్షన్లు సంపాందించడంలో బాలీవుడ్ ను మించింది లేదు, ఆతర్వాత స్థానం టాలీవుడ్ దే. టాలీవుడ్ లో కూడా బాక్సాఫీస్ బద్దలు చేసే పవర్ కూడా ఉన్న స్టార్లు కూడా పవన్, మహేష్ లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ ఇప్పటికే బాక్సాఫీస్ కలెక్షన్ల రేంజీని 300 కోట్లకు తీసుకెల్లింది. కాని టాలీవుడ్ ఇంకా వంద కోట్లకు కూడా చేరుకోలేదు. ఇప్పటి వరకు మగధీర ద్వారా రాంచరణ్ కొల్లగొట్టిన 89 కోట్లే అధికం ఇక పవన్ గబ్బర్ సింగ్ సాదించింది 65 కోట్లు, మహేష్ బాబు దూకుడు సాదించింది 60 కోట్లే. అయితే రికార్డు రాంచరణ్ మీదే ఉన్నా కూడా తాజాగా పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు లకు వస్తున్న క్రేజి, ఇమేజి చూస్తే వందకోట్లకు తీసుకువెల్ల గల సత్తా, దమ్ము వీరిద్దరికే ఉందంటున్నారు.

భయపెడుతున్న జగన్


జగన్ జైలు నుంచి వచ్చి రావడంతో రాజకీయ ప్రత్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. జైలు నుంచి ఇంటికి చేరుకున్న ఘట్టం తోనే అందిరికి గుండె పోటు తెప్పించిన జగన్ ఆతర్వాత తన స్టాండ్ సమైక్యం అంటూ చెప్పి షాకిచ్చారు. ఇదే సమయంలో ఆయన హఠాత్తుగా తన ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర గవర్నర్ ను కలవనుండడం అందరిలో కలవరం పుట్టిస్తోంది. ఆయన గవర్నర్ ను కలవడం వెనుక ఆంతర్యమేమిటి అంటూ టిడిపి, కాంగ్రెస్ లు తెగ టెన్షన్ పడుతున్నాయి. గవర్నర్ ను ఇప్పటికే విజయమ్మ కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని కోరింది, అంతే కాదు ఏకంగా రాష్ట్రపతిని, ప్రధానిని కూడా కలసి వినతి చేసింది, అప్పుడు లేని టెన్షన్ జగన్ కలిస్తే ఎందుకు అని అనుమానం రావడం సహజమే. ఇప్పుడు పరిస్థితులు వేరు, కిరణ్ ను దించి రాష్ట్రపతి పాలన వారం రోజుల్లోపే విదించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో కీలకమైన రాజకీయ పార్టీ అధ్యక్షుడు తన ఎమ్మెల్యేలందరితో వెల్లి కలవడం నిజంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను కలవరపెట్టేదే. ఇక ఆయన గవర్నర్ ను కలిసి అసెంబ్లీని సమావేశ పరచేలా చూడండి అని కోరడానికి అంటున్నారు, మంత్రివర్గ సమావేశాన్నే పెట్టుకోలేని ముఖ్యమంత్రి ఇక అసెంబ్లీ సమావేశాన్ని ఎలా పెట్టగలడు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా అనుమతి లేనిది ముఖ్యమంత్రి కిరణ్ ఆ పని చేయగలడా... చేయలేడు. కాని సమైక్య తీర్మాణం కోసం ఈ డిమాండ్ చేయడం ద్వారా జగన్ ను సీమాంద్రలో మైలేజి పెరగడం ఖాయం. అది సీమాంద్రలో హీరోలు కావాలనుకుంటున్న సిఎం కిరణ్, ఆయన వర్గానికి, ఇటు చంద్రబాబు ను కూడా భయపెట్టే అంశమే కదా..

Sunday, 29 September 2013

Courier Boy Kalyan Latest Trailer


మళ్లీ మెగా హీరోతో పెట్టుకున్నాడు!


నోరు తెచ్చినన్ని తంటాలు మరేదీ తెచ్చిపెట్టదు మనిషికి. అందుకే దాన్ని కంట్రోల్ చేయాలి. లేదంటే మనల్ని నట్టేట్లో ముంచేస్తుంది. దానికో తాజా ఉదాహరణ పూరీ జగన్నాథ్. పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చిన స్టేట్ మెంట్లిచ్చి బుర్ర బొప్పి కట్టించుకున్నాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేసేవాడు కాస్తా నితిన్, విష్ణు లాంటి వాళ్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా బుద్ధి రాలేదు మనోడికి. ఇప్పుడు మరోసారి టంగ్ స్లిప్పయ్యాడు. అది కూడా మెగా హీరో గురించే! తన పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఓ తెలుగు పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు పూరీ. అప్పుడు ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని తెరకు పరిచయం చేసినందుకు తాను చాలా ఫీలవుతున్నానని అన్నాడు. అలా ఎందుకంటే... ఆ సమయంలో అతడికి సల్మాన్ ఖాన్ 'వాంటెడ్' సినిమాకి దర్శకత్వం వహించే చాన్స్ ఇచ్చాడట. కానీ తాను చిరుత సినిమా కమిట్ అయి ఉండటం వల్ల ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడట. ఆ చాన్స్ మిస్ చేసుకోవడం నా బ్యాడ్ లక్ అంటూ ఇప్పుడు నిట్టూర్చాడు. అంతేనా, తాను ఆ త్యాగం చేసి చిరుతను తీయడం రామ్ చరణ్ అదృష్టం అని అర్థం వచ్చేలా కూడా మాట్లాడాడు. గతంలో కూడా ఇలాగే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు. పవన్ తో పని చేయడం తనకు ఆనందాన్ని ఇవ్వలేదని, ఇంకెప్పుడూ అతడితో కలిసి పని చేయనని చాలా అతి చేశాడు. కట్ చేస్తే ఎక్కడికో పోయి పడ్డాడు. ఇప్పుడు మళ్లీ తన నోటి దూలను ఇలా ప్రదర్శించాడు. ఈసారి ఎక్కకెళ్లి పడతాడో చూడాలి. కాస్త నోరు అదుపు చేసుకో పూరీ. లేదంటే ఇండస్ట్రీలో నీకు త్వరలోనే నూకలు చెల్లిపోయే ప్రమాదం ఉంది!

పవన్ పేరుపై నితిన్ సెటైర్...!


పవనిజం క్రేజ్ తో అత్తారింటికి దారేది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయలను కొల్లగొడుతూ సంచలనం సృష్టిస్తూ ఉంటే, ఈ ఆనందాల మధ్య పవన్ కళ్యాణ్ వీరాభిమాని నితిన్ తన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసుకున్నాడు. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. పవన్ పాటలను, మాటలను వాడుకొనే నితిన్ ఈ సినిమాలో హీరో పాత్రకు ఏకంగా కళ్యాణ్ పేరునే పెట్టేసుకున్నాడు. అయితే ఈ సినిమాలో హీరో స్నేహితులు మాత్రం కళ్యాణ్ పాత్రలో ఉన్న నితిన్ ను ‘PK’ అని పిలుస్తూ ఉంటారట. అయితే దీనిఅర్ధం పవన్ కళ్యాణ్ అని మాత్రం కాదు, ఆ సినిమాలో హీరో కళ్యాణ్ కు ఏ పని పాటా లేకుండా ఉంటాడు కాబట్టి ‘పని లేని కళ్యాణ్’ అని అర్ధం అట. కళ్యాణ్ పేరును పనిలేని కళ్యాణ్ గా పిలిపించుకోవడం సాహసమే అయినా నితిన్ పవన్ కు ఎంత వీరభిమానో పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికీ తెలుసు కాబట్టి ఆ సినిమాలో కళ్యాణ్ ను పనిలేని కళ్యాణ్ గా పిలిచినా పవన అభిమానులకు కోపం రాకపోవచ్చు. బహుశా ఆ ధైర్యం తోనే నితిన్ ఈ సాహసం చేస్తున్నాడు అనుకోవాలి. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమా లో నితిన్ సరసన యామీ గౌతమ్ నటిస్తోందన్న విషయం తెలిసిందే. ‘గుండెజారి గల్లంతైందే’ సూపర్ హిట్ తరువాత నితిన్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నవంబర్ లో విడుదల అవుతుంది అని అంటున్నారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాలను నితిన్ సాధిస్తాడో లేదో చూడాలి.

సీపీఎంకు జగన్ 70 కోట్ల పార్టీ ఫండ్!


దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూపార్టీ ఫండ్ తీసుకోవడం చాల కామన్ అంటూ ఈ మధ్య కమ్యూనిస్టుపార్టీలెప్పుడో క్లాసులిచ్చినట్టు గుర్తు. అయితే ఇప్పుడు వారు వేరే పార్టీ అధినేతల దగ్గర నుంచి కూడా పార్టీ ఫండ్ లు తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నుంచి సీపీఎం 70 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీని లైన్ లో పెట్టుకొనే ప్రయత్నంలో జగన్ రెడ్డి ఈ వల విసిరినట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులూ కమ్యూనిస్టు పార్టీలు చంద్రబాబు వెనుక ఉండేవి. అయితే ఇప్పుడు బాబు బీజేపీ వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టుపార్టీలు కూడా తమ దారి తాము చూసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే జగన్ తో స్నేహానికి వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో జగన్ సీపీఎంకు పార్టీ ఫండ్ ఇచ్చాడన్నాడు అన్న ప్రచారానికి మరింత ఊపువస్తోంది. మొత్తానికి ఒక రాజకీయ పార్టీకి మరో రాజకీయ పార్టీ అధినేత పార్టీ ఫండ్ ఇచ్చాడు అంటే అది కాస్త వింత అయిన విషయమే!