ఇది వరకు సినిమా హీరోల సినిమాలు సూపర్ హిట్ అయిన తరువాత వారి అబిమానులు వారిని సూపర్‌స్టార్, యాక్టివ్‌స్టార్, మెగాస్టార్ స్టైలిష్ స్టార్, ఎనర్జిటిక్‌స్టార్, గ్లామర్‌స్టార్ ఇలా రకరకాల పేర్లతో పిలుచుకునేవారు. దీనికోసం గతంలో అయితే సినిమా పత్రికల వాళ్ళచేత ఈ బిరుదులు రాయించేసి ఫ్యాన్స్‌చేత అలా పిలిపించేవారు. ఇప్పటి ట్రెండ్ మారడంతో టీవీ ఛానల్స్ రావడంతో ఆహీరోల పేర్ల ముందు స్క్రోలింగ్ రూపంలో ఏదో ఒక బిరుదు తగిలించేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే బిరుదులు వారికి వచ్చే దాక వారు ఇండస్ట్రీ లో నిలబడగలరో లేదో అన్న భయంతో వారికి వారే బిరుదులు వారి అభిమానుల చేత పిలిపించు కుంటున్నారు.ఇప్పుడు అక్కినేని కుటుంబంలో మరో స్టార్ రాబోతున్నాడు అతడే అక్కినేని అఖిల్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సిసింద్రీ ‘మనం’ సినిమాలో ఉన్నాడని కొందరు లేరని మరి కొందరు ఎవరికీ తోచినట్లు వారు ఉహించు కుంటున్నారు. అయితే అఖిల్ ను మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో పనిచేసే ఉద్యోగులు అంతా జూనియర్ ప్రిన్స్ అని పిలుస్తూ ఉంటారట. ఈపిలుపు వినగానే నాగార్జున, అదేవిధంగా అఖిల్ తెగ ఆనంద పడుతూ ఉంటారని టాక్. ఇప్పటికే టాలీవుడ్ ప్రిన్స్ అంటే మహేష్ బాబు అన్న భావన అందరికి అలవాటు పడిపోయింది ఇక రాబోతున్న రోజులలో జూనియర్ ప్రిన్స్ అంటే అఖిల్ అని అనుకోవాలి.
No comments:
Post a Comment