Thursday, 31 October 2013
అలీ 369...టీవీషో దర్శనమివ్వనున్న పవన్ కళ్యాణ్?
బుల్లితెర ప్రేక్షకులకు శుభ వార్త. ఇప్పటి వరకు కేవలం సినిమాల్లోనే చూసిన పవన్ కళ్యాణ్‌ను తొలిసారి బుల్లితెర కార్యక్రమాల్లో చూడబోతున్నాం. ఈటీవీలో ప్రముఖ కమెడియన్ అలీ నిర్వహిస్తున్న ప్రముఖ ‘అలీ 369' షోలో పవన్ కళ్యాణ్ దర్శనం ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీపావళి పండగను పురస్కరించుకుని నవంబర్ 3న ప్రసారం అయ్యే షోలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ‘అత్తారింటికి దారేది' చిత్రం ప్రమోషన్లో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ షోలో దర్శనం ఇవ్వబోతున్నట్లు సమాచారం. సినిమాను ఇంత పెద్ద పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుల్లో కమెడియన్ అలీ ఒకరు. పవన్ ప్రతి సినిమాలోనూ అలీకి తప్పకుండా ఓ క్యారెక్టర్ ఉంటుంది. అలీ నిర్వహిస్తున్న టీవీ షో కావడంతో పవన్ కళ్యాణ్ రావడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తొలిసారిగా బుల్లితెరపై కనిపిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్‌కు సినిమా ప్రచార కార్యక్రమాలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనే అలవాటు మొదటి నుండీ లేదు. అయితే ‘అత్తారింటికి దారేది' సినిమా తర్వాత పవన్ తన అలవాట్లను మార్చుకున్నారు. సినిమా పైరసీకి గురి కావడం, అదే సమయంలో భారీ విజయం సాధించడం పవన్‌లో మార్పు తెచ్చినట్లు స్పష్టం అవుతోంది.
న్యూయార్క్ టైమ్స్ టాప్ 10 లో పవన్ కళ్యాణ్ !!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ హిమాలయ శిఖరం లా టాలీవుడ్ లో ఎవరికీ అందనంత స్థాయికి రోజురోజుకూ ఎదిగిపోతోంది అని చెప్పడానికి మరో లేటెస్ట్ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ఇండియన్ సినిమాకు సంబంధించి ’10 మోస్ట్ డిజైరబుల్ యాక్టర్స్ ఇన్ ఇండియా’ అనే అంశం పై జరిపిన ఆన్ లైన్ సర్వేలో పవన్ కళ్యాణ్ భారతదేశానికి సంబంధించిన వివిధ భాషలకు సంబంధించిన నటులలో పవన్ 5వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ తర్వాత మహేష్ బాబు 6వ స్థానం దక్కించుకోవడం విశేషం. పవన్ కళ్యాణ్ కంటే ముందు మొదటి నాలుగు స్థానాల్లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, తర్వాత సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్లు నిలిచారు. తమిళ హీరో విజయ్ 7వ స్థానంలో, అమీర్ ఖాన్ 8వ స్థానంలో, 9వ స్థానంలో రణబీర్ కపూర్, 10వ స్థానాన్ని అజయ్ దేవగన్ దక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ అంతటా పవనిజమ్ హోరులో యువతరం హడావిడి చ చేస్తున్న నేటి ప్రస్తుత పరిస్థుతులలో న్యూయార్క్ టైమ్స్ తాజాగా వెల్లడించిన ఈ ఆన్ లైన్ సర్వే ఫలితాలు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాయి. ఈ టాప్ టెన్ లో రజనీకాంత్, కమలహాసన్ లు లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ వార్త పవర్ స్టార్ పవన్ అభిమానులకు నిజమైన దీపావళి పండుగ.Wednesday, 30 October 2013
నటి కాజోల్ ఇంట్లో దొంగతనం: నిందితుల పట్టివేత
బాలీవుడ్ నటి కాజోల్ నివాసంలో దొంగతనం జరిగింది. కాజోల్కు సంబంధించిన 17 బంగారు గాజులను దొంగిలించిన ఇద్దరు పని మనుషులను ముంబై పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గత మూడు సంవత్సరాల నుంచి కాజోల్ నివాసంలో పనిచేస్తున్న వారు కొన్ని రోజుల క్రితం ఇంట్లోని బంగారు ఆభరణాల దొంగతనానికి పాల్పడ్డారు. జుహు పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని జుహులో ఉన్న భవనంలో కాజోల్, ఆమె భర్త అజయ్ దేవగణ్ నివాసముంటున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నివాసంలో 12మంది పని మనుషులు ఉన్నట్లు తెలిపారు. దీపావళి పండగ సందర్భంగా తమ ఇంటిని శుభ్రం చేసేందుకు మరో ముగ్గురు పని మనుషులను అక్టోబర్ 15న తీసుకున్నారు. కాగా అక్టోబర్ 23న కాజోల్ తనకు సంబంధించిన రూ. 5లక్షల విలువైన బంగారు గాజులు పోయినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎవరైతే కొత్తగా తన నివాసంలో పని మనుషులుగా వచ్చారో వారిపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అక్టోబర్ 23న తన పడకగదిలోని ఒక పెట్టెలో ఆ గాజులను భద్రపర్చినట్లు పోలీసులకు కాజోల్ తెలిపింది. తదుపరి రోజు అందులోనే ఉన్నట్లు గుర్తించానని, అక్టోబర్ 22న అవి అదృశ్యమైనట్లు కనుగొన్నట్లు ఆమె తెలిపింది. తమ విచారణలో కాజోల్ నివాసంలో గతమూడు సంవత్సారాలుగు పని చేస్తున్న సంతోష్ పాండే, గాయత్రి దేవేంద్రన్‌లు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. బంగారు గాజులు, ఇతర ఆభరణాలను దొంగిలించిన నిందితులు సెరిసగం పంచుకున్నారని, కొంతకాలం తర్వాత అమ్మేయాలనుకున్న నిందితులు బంగారు గాజులను మురికి కాలువలో దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితులను మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నిందితులను పోలీసులు కస్టడీకి తరలించారు.
పవర్ స్టార్ దారినే ఎంచుకున్న ఉపేంద్ర !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేలిబ్రేటీగా మారిపోయాక మన తెలుగు హీరోలకే కాదు, దక్షణ భారతదేశ సినిమా రంగం ప్రముఖులకు కూడా ఆరాధ్య దైవంగా మారిపోయాడు. టాలీవుడ్ లో పవన్ కు ఎటువంటి ఇమేజ్ ఉందో కన్నడ సినిమా రంగంలో ఉపేంద్రకు కూడా ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. అనేక వెరైటీ సినిమాలు నటించిన కెరియర్ గ్రాఫ్ ఉపేంద్రది, కన్నడ ప్రేక్షకులు ఇతని నటనను విపరీతంగా ఇష్టపడతారు. ఉపేంద్ర నటించిన చాల సినిమాలు తెలులో కూడా డబ్ అయి విజయవంతం సాధించాయి. గత కొద్దికాలం గా కన్నడ సినిమా రంగంలో సైలెంట్ గా ఉన్న ఉపేంద్ర ఈ మధ్య కన్నడంలో విడుదల అయిన ‘టోపీవాలా’ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపెట్టాడు. నల్ల ధనం కధా వస్తువుతో ఈ సినిమా నిర్మింపబడింది. ఈసినిమాను ప్రస్తుతం తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ ‘టోపీవాలా’ సినిమాకు తెలుగు ప్రేక్షకుల అభిరుచిని బట్టీ ఏ టైటిల్ పెట్టాలి అని దర్శకుడు ఎం.జి. శ్రీనివాస్ ఆలోచిస్తూ ఉంటే కన్నడ హీరో ఉపేంద్ర ఈ మధ్య విడుదలై సంచలనం సృస్టించిన ‘పవన్ అత్తారింటికి దారేది’ టైటిల్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు ‘స్విస్ బ్యాంక్ కు దారేది’ అనే టైటిల్ ను పెడితే తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు అని ఉపేంద్ర ఈ సినిమా నిర్మాతలకు సూచించాడట. ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అవుతుంది అని అంటున్నారు. పవన్ ‘అత్తారిల్లు’ లా ఉపేంద్ర కు స్విస్ బ్యాంక్ కు దారేది ఏ దారికి తీసుకేడుతుందో చూడాలి... Tuesday, 29 October 2013
హైదరాబాద్ పెద్ద సవాల్: జివోఎంకు హోంశాఖ నోట్
రాష్ట్ర విభనకు అతి పెద్ద సవాల్ హైదరాబాదే అతి పెద్ద ఆటంకంగా గుర్తించిన కేంద్ర హోం శాఖ జీవోఎంకు 85 పేజీల నోట్‌ను అందజేసింది. ఈ నోట్‌కు సంబంధించిన వివరాలను సోమవారం సాయంత్రం తెలుగు టీవీ న్యూస్ చానెళ్లు ప్రసారం చేశాయి. ఐదు కీలకమైన అంశాలను పరిష్కరిస్తే రాష్ట్ర విభజన సులభమవుతుందని హోం శాఖ గుర్తించినట్లు అర్థమవుతోంది. నివేదికలో విభజన సమస్యలుగా ఉన్న నీళ్లు, నిధులు, విద్యుత్, హైదరాబాద్ స్థితి, శాంతి భద్రతలు, ఆర్టికల్ 371 (డి) అంశాలు తదితర వాటిపై పరిశీలించి తగిన సమాచారం ఆధారంగా బిల్లును రూపొందించాలని జీవోఎంకు హోంశాఖ సూచించినట్లు న్యూస్ చానెళ్ల వార్తాకథనాల సారాంశం. అవసరమైతే 371 (డి) ఆర్టికల్‌ను సవరణ చేయవచ్చునని తెలిపింది.
సవరణకు సంబంధించిన అంశాలను నివేదికలో హోంశాఖ నోట్లో ప్రస్తావించింది. రాష్ట్రంలో జోనల్ వ్యవస్థకు అవకాశం కల్పించే ఆర్టికల్ అది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ ఆ వ్యవస్థను కొనసాగించాలంటే దానికి సవరణ చేయాల్సి ఉంటుంది. లేదంటే, ఉపసంహరించుకోవచ్చు. ఆర్టికల్ 371(డి)ని సవరించే ప్రక్రియను విభజన బిల్లును ప్రతిపాదించడానికి ముందు చేయవచ్చు లేదా విభజన బిల్లులో భాగంగా దాన్ని సవరించవచ్చు. మూడు ప్రాంతాల వారికి హైదరాబాద్‌లోనే విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశపై చూడాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదువుల కోసం, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కే పంపుతున్నారని అంచేత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నివేదిక అందజేయాలని హోంశాఖ జీవోఎంకు సూచించింది. హైదరాబాద్‌లో, దాని చుట్టూ ఉన్న సంస్థలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది.
రాష్ట్రానికి హైదరాబాద్ నుంచే అధిక రెవెన్యూ వస్తోందని, ఎందుకంటే 40 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, 28 రక్షణ సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రధాన యూనివర్శిటీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని నివేదికలో హోంశాఖ పేర్కొంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌పై తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖ జీవోఎంకు సూచించింది. కాగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్కను ఆంధ్రప్రాంతానికి చెందిన నాయకుడిగా నోట్లో పేర్కోన్నట్లు సమాచారం. విభజన సమయంలో డిప్యూటీ స్పీకర్‌గా తెలంగాణ నాయకుడిని నియమించాల్సి ఉంటుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాకు చెందినవారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయం మేరకే బిల్లు రూపొందే అవకాశాలున్నందున ఖమ్మం జిల్లా కూడా తెలంగాణ ప్రాంతంలోకే వస్తుంది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వెనకబడిన జిల్లాల జాబితాను, నక్సల్స్ ప్రభావిత జిల్లాలను కూడా నోట్లో కేంద్ర హోంశాఖ ప్రస్తావించింది. ఈ జిల్లాలకు అందించాల్సిన ప్యాకేజీలకు కూడా సూచనలు చేయాలని సూచించింది. ఇందులో తెలంగాణకు చెందిన జిల్లాలే కాకుండా సీమాంధ్ర జిల్లాలు కూడా ఉన్నాయి. నదీ జలాల పంపిణీకి వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కమల్ హాసన్‌తో కాజల్ లిప్‌లాక్ సీన్!
యూనివర్శల్ హీరో కమల్ హాసన్ హీరోగా రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉత్తమ విలన్'. ఈచిత్రంలో ఇప్పటి వరకు పలువురు హీరోయిన్లను అనుకున్నప్పటికీ....చివరకు హీరోయిన్ కాజల్ ఖరారైనట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో కలిసి లిప్ లాక్ ముద్దు సీన్ చేయడానికి కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ సినిమా అంటే తప్పకుండా లిప్ లాక్ సీన్ ఉండాల్సిందే మరి. వాస్తవానికి ‘ఉత్తమ విలన్' సినిమా స్టోరీ కమల్‌తో ఓకే అయిన వెంటనే.... కాజల్‌ను హీరోయిన్గా తీసుకోవాలని నుకున్నారు. కానీ అప్పుడు డేట్స్ లేవంటూ కాజల్ తిరస్కరించింది. ఆ తర్వాత ఇతర హీరోయిన్లను తీసుకుందామని అనుకున్నప్పటికీ పలు కారణాల వల్ల ఓకే కాలేదు. ప్రస్తుతం కాజల్ అవకాశాలు లేక ఖాళీగా ఉండటంతో ఆ అవకాశం తిరిగి తిరిగి మళ్లీ ఆమె వద్దకే చేరింది.ఉత్తమ విలన్ చిత్రానికి క్రేజీ మోహన్ రచయితగా పని చేస్తున్నారు. ప్రముక తమిళ నిర్మాతలు తిరుపతి బ్రదర్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కమలహాసన్ విశ్వరూపం-2 చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీని తర్వాతే ఉత్తమ విలన్ తెరకెక్కనుంది.
ఉపాసన గిఫ్టును...సినిమాలో యూజ్ చేయనున్న చెర్రీ!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితురాలు ఉపాసనను పెళ్లాడిన తర్వాత అత్తారింటి నుంచి చాలా కానుకలు వచ్చాయి. అందులో ఒకటి ఖరీదైన ఆస్టన్ మార్టిన్ కారు. ఈ కారు ఖరీదు రూ. 2.5 కోట్లపైనే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ఏమిటంటే...ఈ కారును తన సినిమాలో వాడబోతున్నాడట రామ్ చరణ్. రామ్ చరణ్, వెంకటేష్ మల్టీ స్టారర్లుగా కృష్ణ వంశీ దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలోని ఓ పాటలో స్పెషల్ లుక్ కోసమే ఈ కారును ఉపయోగించాలని నిర్ణయించారట.ఇప్పటికే చరణ్ ఈకారుతో పాటు పలు ఫోటో షూట్లలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అత్తారింటి నుంచి పెళ్లి కానుకగా వచ్చిన కారును....ఇలా సినిమా కోసం కమర్షియల్‌గా వాడటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. చెర్రీ నిర్ణయం..... చిత్ర నిర్మాతలకు లాభం చేకూర్చడానికా? లేక తాను లాభం పొందడానికా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. రామ్ చరణ్ సరసన కాజల్, వెంకటేష్ సరసన నయనతారను హీరోయిన్లుగా ఎంపిక చేసారు. కృష్ణ వంశీ మార్కు ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈచిత్రాన్ని తెరరెక్కిస్తున్నారు. వెంకటేష్ ఇప్పటికే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మల్టీ స్టారర్ చిత్రంలో నటించి హిట్ కొట్టారు. మరో వైపు హిందీ మూవీ బోల్ బచ్చన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘మసాలా' చిత్రంలో రామ్‌తో కలిసి నటిస్తున్నాడు. చరణ్‌తో చేయబోయే సినిమా వెంకీ మూడో మల్టీ స్టారర్ చిత్రం.
Subscribe to:
Posts (Atom)


