Tuesday, 29 October 2013

హైదరాబాద్ పెద్ద సవాల్: జివోఎంకు హోంశాఖ నోట్


రాష్ట్ర విభనకు అతి పెద్ద సవాల్ హైదరాబాదే అతి పెద్ద ఆటంకంగా గుర్తించిన కేంద్ర హోం శాఖ జీవోఎంకు 85 పేజీల నోట్‌ను అందజేసింది. ఈ నోట్‌కు సంబంధించిన వివరాలను సోమవారం సాయంత్రం తెలుగు టీవీ న్యూస్ చానెళ్లు ప్రసారం చేశాయి. ఐదు కీలకమైన అంశాలను పరిష్కరిస్తే రాష్ట్ర విభజన సులభమవుతుందని హోం శాఖ గుర్తించినట్లు అర్థమవుతోంది. నివేదికలో విభజన సమస్యలుగా ఉన్న నీళ్లు, నిధులు, విద్యుత్, హైదరాబాద్ స్థితి, శాంతి భద్రతలు, ఆర్టికల్ 371 (డి) అంశాలు తదితర వాటిపై పరిశీలించి తగిన సమాచారం ఆధారంగా బిల్లును రూపొందించాలని జీవోఎంకు హోంశాఖ సూచించినట్లు న్యూస్ చానెళ్ల వార్తాకథనాల సారాంశం. అవసరమైతే 371 (డి) ఆర్టికల్‌ను సవరణ చేయవచ్చునని తెలిపింది. సవరణకు సంబంధించిన అంశాలను నివేదికలో హోంశాఖ నోట్‌లో ప్రస్తావించింది. రాష్ట్రంలో జోనల్ వ్యవస్థకు అవకాశం కల్పించే ఆర్టికల్ అది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ ఆ వ్యవస్థను కొనసాగించాలంటే దానికి సవరణ చేయాల్సి ఉంటుంది. లేదంటే, ఉపసంహరించుకోవచ్చు. ఆర్టికల్ 371(డి)ని సవరించే ప్రక్రియను విభజన బిల్లును ప్రతిపాదించడానికి ముందు చేయవచ్చు లేదా విభజన బిల్లులో భాగంగా దాన్ని సవరించవచ్చు. మూడు ప్రాంతాల వారికి హైదరాబాద్‌లోనే విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశపై చూడాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదువుల కోసం, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కే పంపుతున్నారని అంచేత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నివేదిక అందజేయాలని హోంశాఖ జీవోఎంకు సూచించింది. హైదరాబాద్‌లో, దాని చుట్టూ ఉన్న సంస్థలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. రాష్ట్రానికి హైదరాబాద్ నుంచే అధిక రెవెన్యూ వస్తోందని, ఎందుకంటే 40 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, 28 రక్షణ సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రధాన యూనివర్శిటీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని నివేదికలో హోంశాఖ పేర్కొంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌పై తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖ జీవోఎంకు సూచించింది. కాగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్కను ఆంధ్రప్రాంతానికి చెందిన నాయకుడిగా నోట్‌లో పేర్కోన్నట్లు సమాచారం. విభజన సమయంలో డిప్యూటీ స్పీకర్‌గా తెలంగాణ నాయకుడిని నియమించాల్సి ఉంటుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాకు చెందినవారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయం మేరకే బిల్లు రూపొందే అవకాశాలున్నందున ఖమ్మం జిల్లా కూడా తెలంగాణ ప్రాంతంలోకే వస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వెనకబడిన జిల్లాల జాబితాను, నక్సల్స్ ప్రభావిత జిల్లాలను కూడా నోట్‌లో కేంద్ర హోంశాఖ ప్రస్తావించింది. ఈ జిల్లాలకు అందించాల్సిన ప్యాకేజీలకు కూడా సూచనలు చేయాలని సూచించింది. ఇందులో తెలంగాణకు చెందిన జిల్లాలే కాకుండా సీమాంధ్ర జిల్లాలు కూడా ఉన్నాయి. నదీ జలాల పంపిణీకి వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కమల్ హాసన్‌తో కాజల్ లిప్‌లాక్ సీన్!


యూనివర్శల్ హీరో కమల్ హాసన్ హీరోగా రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉత్తమ విలన్'. ఈచిత్రంలో ఇప్పటి వరకు పలువురు హీరోయిన్లను అనుకున్నప్పటికీ....చివరకు హీరోయిన్ కాజల్ ఖరారైనట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో కలిసి లిప్ లాక్ ముద్దు సీన్ చేయడానికి కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ సినిమా అంటే తప్పకుండా లిప్ లాక్ సీన్ ఉండాల్సిందే మరి. వాస్తవానికి ‘ఉత్తమ విలన్' సినిమా స్టోరీ కమల్‌తో ఓకే అయిన వెంటనే.... కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని నుకున్నారు. కానీ అప్పుడు డేట్స్ లేవంటూ కాజల్ తిరస్కరించింది. ఆ తర్వాత ఇతర హీరోయిన్లను తీసుకుందామని అనుకున్నప్పటికీ పలు కారణాల వల్ల ఓకే కాలేదు. ప్రస్తుతం కాజల్ అవకాశాలు లేక ఖాళీగా ఉండటంతో ఆ అవకాశం తిరిగి తిరిగి మళ్లీ ఆమె వద్దకే చేరింది.

ఉత్తమ విలన్ చిత్రానికి క్రేజీ మోహన్ రచయితగా పని చేస్తున్నారు. ప్రముక తమిళ నిర్మాతలు తిరుపతి బ్రదర్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కమలహాసన్ విశ్వరూపం-2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీని తర్వాతే ఉత్తమ విలన్ తెరకెక్కనుంది.

ఉపాసన గిఫ్టును...సినిమాలో యూజ్ చేయనున్న చెర్రీ!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ తన స్నేహితురాలు ఉపాసనను పెళ్లాడిన తర్వాత అత్తారింటి నుంచి చాలా కానుకలు వచ్చాయి. అందులో ఒకటి ఖరీదైన ఆస్టన్ మార్టిన్ కారు. ఈ కారు ఖరీదు రూ. 2.5 కోట్లపైనే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ఏమిటంటే...ఈ కారును తన సినిమాలో వాడబోతున్నాడట రామ్ చరణ్. రామ్ చరణ్, వెంకటేష్ మల్టీ స్టారర్లుగా కృష్ణ వంశీ దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలోని ఓ పాటలో స్పెషల్ లుక్ కోసమే ఈ కారును ఉపయోగించాలని నిర్ణయించారట.

ఇప్పటికే చరణ్ ఈకారుతో పాటు పలు ఫోటో షూట్లలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అత్తారింటి నుంచి పెళ్లి కానుకగా వచ్చిన కారును....ఇలా సినిమా కోసం కమర్షియల్‌గా వాడటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. చెర్రీ నిర్ణయం..... చిత్ర నిర్మాతలకు లాభం చేకూర్చడానికా? లేక తాను లాభం పొందడానికా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. రామ్ చరణ్ సరసన కాజల్, వెంకటేష్ సరసన నయనతారను హీరోయిన్లుగా ఎంపిక చేసారు. కృష్ణ వంశీ మార్కు ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈచిత్రాన్ని తెరరెక్కిస్తున్నారు. వెంకటేష్ ఇప్పటికే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మల్టీ స్టారర్ చిత్రంలో నటించి హిట్ కొట్టారు. మరో వైపు హిందీ మూవీ బోల్ బచ్చన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘మసాలా' చిత్రంలో రామ్‌తో కలిసి నటిస్తున్నాడు. చరణ్‌తో చేయబోయే సినిమా వెంకీ మూడో మల్టీ స్టారర్ చిత్రం.

చిరంజీవిపై రాళ్లువిసిరిన సమైక్యవాదులు


కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి మంగళవారం సమైక్య సెగ తగిలింది. ఆయన తుఫాను బాధితులను పరామర్శించేందుకు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయాలంటూ పలువురు సమైక్యవాదులు ఆయన పైన రాళ్ల దాడి చేశారు. జిల్లాలోని శ్రీకాకుళం జిల్లాలో పలువురు ఆయనను అడ్డుకున్నారు. చిరుకు, కాంగ్రెసుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓ దశలో వాళ్లు రాళ్లతో రువ్వారు. పరిస్థితిని గుర్తించిన పోలీసులు చిరంజీవిని అక్కడి నుండి తప్పించారు. పోలీసుల సాయంతో ఆయన బయటపడ్డారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన చిరంజీవి బాధితులకు పరిహారం అందేలా చూస్తామని చెప్పారు. పత్తి రైతులకు బీమా సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు.

నాగ్ ఎందుకు నో అన్నాడు!


నాగార్జున ఏం చేసినా ఆలోచించే చేస్తాడు అంటారు అతడి గురించి తెలిసినవాళ్లు. అన్ని విషయాల్లోనూ ప్లానింగ్ తో ఉంటాడని, ఆలోచించకుండా అడుగు వేయడని కచ్చితంగా చెబుతారు. కానీ అది అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది తరచి చూస్తే. ఇటీవలి కాలంలో తన సినిమాలకు సంబంధించిన విషయాల్లో నాగ్ అన్నీ తప్పుడు నిర్ణయాలే తీసుకున్నాడు. అనవసరమైన ప్రయోగాలకు పోయి, తనకు తగని పాత్రలు చేశాడు. అందువల్లే అతడి నుంచి సక్సెస్ ఆమడ దూరం పారిపోయింది. అలాగే నాగచైతన్య విషయంలో కూడా రాంగ్ స్టెప్ వేశాడు. చైతూది యాక్షన్ సినిమాలకు పనికొచ్చే ఫేస్ కాదు. కాస్త బాడీ ఉన్నా, అతడి ముఖంలో సున్నితత్వం ఉంటుంది. అది గమనించకుండా యాక్షన్ హీరోగా ఎంటర్ చేశాడు. కాలేజీ బ్యాగ్రవుండ్ కథే అయినా, జోష్ లో యాక్షన్ హీరోగానే కనిపిస్తాడు చైతూ. ఏం మాయ చేశావె తప్ప మిగతా అన్ని సినిమాలూ కూడా అలాంటివే ఎంచుకోవడం వల్ల అతడి కెరీర్ గాడి తప్పింది. ఇప్పుడు అఖిల్ ఎంట్రీ విషయంలో కూడా అలాంటి పొరపాటే చేస్తున్నాడేమో అనిపిస్తోంది. నాగార్జున తొలిసారి నిర్మించి చిన్న చిత్రం... ఉయ్యాల జంపాల. ఈ ట్రయిలర్ ఇటీవలే రిలీజై, అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ఈ కథను దర్శకుడు వాసు, అఖిల్ కోసం రాసినట్టు సమాచారం. కానీ అంత సాఫ్ట్ లవ్ స్టోరీతో ఎంటర్ చేస్తే, అఖిల్ లవర్ బాయ్ గా ముద్రపడిపోతాడని నాగ్ వద్దన్నాడట. దాంతో వేరే వాళ్లను పెట్టి తీశారు. లవర్ బాయ్ గా ముద్ర పడితే వచ్చిన నష్టమేంటో అర్థం కావడం లేదు. ఇప్పటికే ఎన్టీయార్, రామ్ చరణ్, ప్రభాస్, మహేశ్... వీళ్లంతా యాక్షన్ హీరోలుగా ఏలుతున్నారు. ఇక వీళ్ల మధ్యకి వెళ్లి, వాళ్లు తీసేదే తీసి, పోటీని ఎదుర్కోలేక చతికిలపడే బదులు.... ఓ కొత్త ఇమేజ్ తో ఎంటరై తర్వాత కావాలంటే అలాంటివి ట్రై చేయొచ్చు కదా. పైగా అఖిల్ క్యూట్ గా, సాఫ్ట్ గా కనిపిస్తాడు కూడా. నాగ్ ఏం ఆలోచిస్తున్నాడో, చివరికి అఖిల్ ని ఏం చేస్తాడో చూడాలి మరి!

Pawan Kalyan Unseen Pics


ఛాన‌ల్ ఓపెనింగ్‌కు కోటి యాభై ల‌క్షలు తీసుకుంది


ఏదైనా ఈవెంట్స్‌కు అటెండ్ అవ్వాల‌న్నా, రిబ్బన్ క‌టింగ్ చేయాలన్నా ఫిల్మ్ సెల‌బ్రిటీల‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్‌కి అయితే ఆ డిమాండ్ మ‌రింత‌గా ఉంటుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఫిల్మ్ సెల‌బ్రిటి ఓ ఛాన‌ల్ ఓపెనింగ్‌కు సంబంధించిన ఈవెంట్‌కు కోటి యాభై ల‌క్షలు ఛార్జ్ చేసింది. ఇంత అమౌంట్‌ను ఇస్తే త‌న ఎటువంటి ప్రమోష‌న్స్ చూపిస్తానో లిస్ట్ చెప్పింది. త‌నే బాలీవుడ్ బెబో క‌రీనాక‌పూర్‌. క‌రీనాక‌పూర్ వ‌ద్దకు ఓ ఛాన‌ల్ మేనేజ్‌మెంట్ ఒక ప్రపోజ‌ల్‌ను తీసుకువ‌చ్చింది. 'మా కొత్త ఛాన‌ల్ ఓపెనింగ్‌కు మీరు వ‌చ్చి రెండు పాట‌ల‌కు డ్యాన్స్ ఫ‌ర్‌ఫార్మెన్స్ ఇవ్వాల‌ని' కోరారు. ఇంకేముంది బెబో త‌న రేటు ఎంతో చెప్పేసింది. 'మీ ఛాన‌ల్‌కి వ‌చ్చి డ్యాన్స్ ఫ‌ర్‌ఫార్మెన్స్ ఇస్తాను. అలాగే నా అప్ క‌మింగ్ మూవీ ప్రమోష‌న్ కూడ‌ చేసుకుంటాను. మొత్తం క‌లిపి నాకు కోటి యాభై ల‌క్షలు ఇచ్చేయండి' అంటూ రేటు ఫిక్స్ చేసిందంట‌. ఇంత‌కీ త‌ను డ్యాన్స్ చేసే ఆ రెండు సాంగ్స్ ఏంటంటే ద‌బాంగ్‌లోని ఫెవికాల్ సే ఐటెం సాంగ్, మ‌రొక‌టి హీరోయిన్ మూవీలోని హ‌ల్కత్ జ‌వాని సాంగ్‌. ఇంతకీ ఆ ఛాన‌ల్ వివ‌రాలు ఏంటంటారా? అది దుబాయ్ కంట్రికు చెందిన ఛాన‌ల్‌. దాని పేరు 'అర‌భ్' ఛాన‌ల్‌. క‌రీనా ఇచ్చిన రేటును చెల్లించ‌టానికి వారు రెడీగా ఉన్నారు. ఇంకేముంది క‌రీనా ఆ డ్యాన్స్ షోకు సంబంధించిన రిహార్సల్స్‌ను అప్పుడే స్టార్ట్ చేసింది కూడ‌.

Monday, 28 October 2013

హైవే పై అర్ద రాత్రి అల్లు అర్జున్ హంగామా


అల్లు అర్జున్‌ హైవే రోడ్డెక్కాడు. అదీ అర్ధరాత్రి సమయంలో... అసలా సమయంలో ఎక్కడ, ఎందుకు అనుకుంటున్నారా. రామోజీ ఫిల్మ్‌సిటీలోని హెలిప్యాడ్‌ జంక్షన్‌ వద్ద హైవే రోడ్డుపై ఉన్నాడు. అయితే అప్పుడే అటువైపు నుంచి కిక్‌శ్యామ్‌ తన పోలీసు కారులో పెట్రోలింగ్‌ చేస్తూ వెళ్లాడు. అసలు అల్లు అర్జున్‌ ఎందుకు అక్కడ ఉన్నాడనేది తెలియాలంటే మాత్రం 'రేసుగుర్రం' సినిమా చూడాల్సిందే అంటున్నారు సురేందర్‌రెడ్డి. అల్లు అర్జున్‌, కిక్‌ దర్శకుడు సురేందర్‌ రెడ్డి కాంబినేషన్లో ‘రేసు గుర్రం' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి) నిర్మిస్తున్నారు. శ్రుతి హాసన్‌, సలోని హీరోయిన్స్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి (జనవరి 11)రిలీజ్ కానున్నదని తెలుస్తోంది. అదే సంక్రాంతికి...మహేష్ 1 నేనొక్కడినే,బాలకృష్ణ లెజండ్ చిత్రాలు విడుదల అవుతాయి. రేసుగుర్రం చిత్రం గత సంవత్సరం అక్టోబర్లోనే ఈ చిత్రం అఫీషియల్‌గా ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే రకరకాల కారణాల వల్ల లేటయ్యి....ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలోని రోడ్లపై రౌడీల పనిపడుతున్నాడు.

రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో గోవాహౌస్‌ రోడ్లపై ఈ ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇది శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తోన్న 'రేసుగుర్రం' కోసం. ఇందులో సలోని కీలక పాత్రలో నటిస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకుడు. నల్లమలుపు బుజ్జి, డా||వెంకటేశ్వరరావు నిర్మాతలు. మరో రెండు రోజుల పాటు ఇక్కడ చిత్రీకరిస్తారు. ఇప్పటికే లేట్ కావటంతో ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుపుతున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్ సంగీతం అందిస్తున్నారు. తమన్ ఇచ్చిన మ్యూజిక్‌పై తన అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు అల్లు అర్జున్. ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్ స్పందిస్తూ...‘రేస్ గుర్రం చిత్రం కోసం తమన్ ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చాడు. సినిమా ఆడియో విడుదల ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పాటలు సూపర్ హిట్టవడం ఖాయం' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కిక్‌ సినిమాతో హిట్ కొట్టి స్టార్ దర్శకుడిగా మారిన సురేందర్ రెడ్డి, ఆ తర్వాత ఊసరవెల్లితో బోల్తా పడ్డాడు. అయితే ఈచిత్రంతో ఎలాగైనా హిట్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడ. పేరుకు తగ్గట్టు అల్లు అర్జున్‌ పాత్ర తీరు జెట్‌ స్పీడుతో ఉంటుందని చెప్తున్నారు. వినోదం, యాక్షన్‌ల మేళవింపు కథలో కనిపిస్తుందని యూనిట్ చెబుతోంది. ఇటీవలే విదేశాల్లో రెండు పాటల్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.మాటల్లో చెప్పలేనిది చూపించాం అని చెప్తున్నారు. ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ మిగిలివున్నాయి. వాటిని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి వేగంగా పనులను పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రొడక్షన్ టీం ఈ సినిమాకు సంబందించిన ఎటువంటి ప్రకటన చేయలేదు. నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి