Sunday, 29 September 2013
మళ్లీ మెగా హీరోతో పెట్టుకున్నాడు!
నోరు తెచ్చినన్ని తంటాలు మరేదీ తెచ్చిపెట్టదు మనిషికి. అందుకే దాన్ని కంట్రోల్ చేయాలి. లేదంటే మనల్ని నట్టేట్లో ముంచేస్తుంది. దానికో తాజా ఉదాహరణ పూరీ జగన్నాథ్. పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చిన స్టేట్ మెంట్లిచ్చి బుర్ర బొప్పి కట్టించుకున్నాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేసేవాడు కాస్తా నితిన్, విష్ణు లాంటి వాళ్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా బుద్ధి రాలేదు మనోడికి. ఇప్పుడు మరోసారి టంగ్ స్లిప్పయ్యాడు. అది కూడా మెగా హీరో గురించే!
తన పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఓ తెలుగు పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు పూరీ. అప్పుడు ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని తెరకు పరిచయం చేసినందుకు తాను చాలా ఫీలవుతున్నానని అన్నాడు. అలా ఎందుకంటే... ఆ సమయంలో అతడికి సల్మాన్ ఖాన్ 'వాంటెడ్' సినిమాకి దర్శకత్వం వహించే చాన్స్ ఇచ్చాడట. కానీ తాను చిరుత సినిమా కమిట్ అయి ఉండటం వల్ల ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడట. ఆ చాన్స్ మిస్ చేసుకోవడం నా బ్యాడ్ లక్ అంటూ ఇప్పుడు నిట్టూర్చాడు. అంతేనా, తాను ఆ త్యాగం చేసి చిరుతను తీయడం రామ్ చరణ్ అదృష్టం అని అర్థం వచ్చేలా కూడా మాట్లాడాడు.
గతంలో కూడా ఇలాగే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు. పవన్ తో పని చేయడం తనకు ఆనందాన్ని ఇవ్వలేదని, ఇంకెప్పుడూ అతడితో కలిసి పని చేయనని చాలా అతి చేశాడు. కట్ చేస్తే ఎక్కడికో పోయి పడ్డాడు. ఇప్పుడు మళ్లీ తన నోటి దూలను ఇలా ప్రదర్శించాడు. ఈసారి ఎక్కకెళ్లి పడతాడో చూడాలి. కాస్త నోరు అదుపు చేసుకో పూరీ. లేదంటే ఇండస్ట్రీలో నీకు త్వరలోనే నూకలు చెల్లిపోయే ప్రమాదం ఉంది!
పవన్ పేరుపై నితిన్ సెటైర్...!
పవనిజం క్రేజ్ తో అత్తారింటికి దారేది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయలను కొల్లగొడుతూ సంచలనం సృష్టిస్తూ ఉంటే, ఈ ఆనందాల మధ్య పవన్ కళ్యాణ్ వీరాభిమాని నితిన్ తన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసుకున్నాడు. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. పవన్ పాటలను, మాటలను వాడుకొనే నితిన్ ఈ సినిమాలో హీరో పాత్రకు ఏకంగా కళ్యాణ్ పేరునే పెట్టేసుకున్నాడు. అయితే ఈ సినిమాలో హీరో స్నేహితులు మాత్రం కళ్యాణ్ పాత్రలో ఉన్న నితిన్ ను ‘PK’ అని పిలుస్తూ ఉంటారట. అయితే దీనిఅర్ధం పవన్ కళ్యాణ్ అని మాత్రం కాదు, ఆ సినిమాలో హీరో కళ్యాణ్ కు ఏ పని పాటా లేకుండా ఉంటాడు కాబట్టి ‘పని లేని కళ్యాణ్’ అని అర్ధం అట.
కళ్యాణ్ పేరును పనిలేని కళ్యాణ్ గా పిలిపించుకోవడం సాహసమే అయినా నితిన్ పవన్ కు ఎంత వీరభిమానో పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికీ తెలుసు కాబట్టి ఆ సినిమాలో కళ్యాణ్ ను పనిలేని కళ్యాణ్ గా పిలిచినా పవన అభిమానులకు కోపం రాకపోవచ్చు. బహుశా ఆ ధైర్యం తోనే నితిన్ ఈ సాహసం చేస్తున్నాడు అనుకోవాలి. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమా లో నితిన్ సరసన యామీ గౌతమ్ నటిస్తోందన్న విషయం తెలిసిందే. ‘గుండెజారి గల్లంతైందే’ సూపర్ హిట్ తరువాత నితిన్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నవంబర్ లో విడుదల అవుతుంది అని అంటున్నారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాలను నితిన్ సాధిస్తాడో లేదో చూడాలి.
సీపీఎంకు జగన్ 70 కోట్ల పార్టీ ఫండ్!
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూపార్టీ ఫండ్ తీసుకోవడం చాల కామన్ అంటూ ఈ మధ్య కమ్యూనిస్టుపార్టీలెప్పుడో క్లాసులిచ్చినట్టు గుర్తు. అయితే ఇప్పుడు వారు వేరే పార్టీ అధినేతల దగ్గర నుంచి కూడా పార్టీ ఫండ్ లు తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నుంచి సీపీఎం 70 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కమ్యూనిస్టు పార్టీని లైన్ లో పెట్టుకొనే ప్రయత్నంలో జగన్ రెడ్డి ఈ వల విసిరినట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులూ కమ్యూనిస్టు పార్టీలు చంద్రబాబు వెనుక ఉండేవి. అయితే ఇప్పుడు బాబు బీజేపీ వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టుపార్టీలు కూడా తమ దారి తాము చూసుకున్నట్టు తెలుస్తోంది.
అందుకే జగన్ తో స్నేహానికి వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో జగన్ సీపీఎంకు పార్టీ ఫండ్ ఇచ్చాడన్నాడు అన్న ప్రచారానికి మరింత ఊపువస్తోంది. మొత్తానికి ఒక రాజకీయ పార్టీకి మరో రాజకీయ పార్టీ అధినేత పార్టీ ఫండ్ ఇచ్చాడు అంటే అది కాస్త వింత అయిన విషయమే!
Saturday, 28 September 2013
మోసకపోయినందుకు బాధపడుతున్నా
ఒకప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేసిన గోబ్యూ బ్యూటి ఇలియన, తన మనస్సులోంచి వచ్చిన మాటలను లీడింగ్ టాబ్లాయిడ్‌తో పంచుకుంది. తను చెప్పిన ప్రతి మాట తన హృదయంలో నుండి వచ్చింది. ఇంటర్వూలో భాగంగా రిపోర్టర్ ఓ ప్రశ్నను అడిగాడు. మీరు విదేశి యువకుడితో ఎఫైర్ నడుపుతున్నారు కదా. మీరు ఇద్దరు పెళ్ళి చేసుకోబోతున్నారా అని అడిగాడు. దానికి ఇలియాన ఫేస్ టు ఫేస్ సమాధానం చెప్పింది. 'నాకు బాయ్ ప్రెండ్ ఉన్నాడు. అతడితో కొంత కాలం డేటింగ్ కూడ చేశాను. ఎందుకో ఏమయ్యిందో తెలియదు. మేమిద్దరం ఇప్పుడు దూరంగా ఉంటున్నాము. తను ఫారినర్ కాదు. ఇండియన్.
నాతో ఎంతో క్లోజ్‌గా ఉన్నాడు. కొన్ని నెలల తరువాత మేమిద్దరం విడిపోయాం అంత వరకూ నిజమే. ఆ తరువాత నుండి నేను ఎవరితోనూ ఎక్కువుగా క్లోజ్ రిలేషన్ పెట్టుకోవాలనుకోలేదు. అలాగే ఏ సెలబ్రితోనూ డేటింగ్ చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు నేను వేరే హీరోలతో డేటింగ్‌లో ఉన్నానదే నిజం కాదు. డేటింగ్, క్లోజ్ రిలేషన్స్ మీద నాకు నమ్మకం పోయింది. ఏదైనా ఉంటే అది పెళ్లి వరకూ జరుగుతుంది అని అనుకుంటే రిలేషన్‌ను మెయింటెన్ చేయాలి. లేకుంటే వాటి మీదే నమ్మకాలు పెట్టుకోకుడదూ. అంతే' అంటూ ముగించేసింది. ఇలియాన చెప్పిన ఆ మాటలకు చాలా మందిని చలించివేసింది. ఇలియానలో ఇంత బాధ ఉందా అని అందరూ అలోచించుకుంటున్నారు.
బాలీవుడ్‌లోనూ పరిగెడుతున్న పవనిజం
బాలీవుడ్‌లో పవనిజం పరుగులు పెడుతుంది. కేవలం ఈ మూవీ కారంణంగా బాలీవుడ్ బాడా హీరోలకు సౌత్‌లో థియోటర్లు దొరకని పరిస్థితి. బాలీవుడ్ చాక్లెట్ హీరో రణ్‌భీర్ కపూర్‌కు ఈ సిచ్యువేషన్ ఎదరయ్యింది. తన అప్‌కమింగ్ ఫిల్మ్ భేషరమ్ మూవీ కోసం సౌత్‌లో అనుకున్నన్ని థియోటర్లు దొరకలేదు. భేషరమ్ మూవీను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం 4000 థియోటర్లను ఎంచుకున్నారు, ఈ చిత్ర డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. అయితే 3600 థియోటర్లు మాత్రమే రణ్‌భీర్ కపూర్‌కి దక్కింది.
ఇప్పటివరకూ ఇండియన్ మూవీస్‌లో అత్యధిక థియోటర్లలో రిలీజ్ అవుతున్న మొదటి మూవీ ఈ భేషరమ్ మూవీనే. మిగిలిన నాలుగు వందల థియోటర్లు సౌత్‌లో రణ్‌భీర్‌కు దొరకలేదు. పవన్ అత్తారింటికి దారేది మూవీ కోసం రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అడిగినా కూడ థియోటర్లు యజమానులు ఖాళీ లేవు అని చెప్పేశారట. దీంతో రణ్‌భీర్ మూవీ బిగ్గెస్ట్ రిలీజ్‌కు సౌత్ హీరో కారణంగా కొంత మేర గండిపడిందంటుంది బాలీవుడ్. ఒకరకంగా చెప్పాలంటే రణ్‌భీర్ దూకుడుకి పవన్ బ్రేక్‌లు వేశాడనే చెప్పాలి.
లగడపాటి తను చేరే పార్టీ కి అనువైన కథ చెబుతాడా?
లగడపాటి రాజగోపాల్ ఏ విషయంలోనూ సూటిగా స్పందించడం లేదు. డొంకతిరుగుడు వ్యవహారాల్లో ఆయన బాగా అనుభవం సంపాదించాడు. ఉదాహరణకు ఆయన విభజనను అడ్డుకోవడానికి తమ వద్ద బ్రహ్మాస్త్రాలున్నాయని అన్నాడు. అయితే ఆ బ్రహ్మాస్త్రాలేవో చెప్పనూ లేదు.. వాటిని ప్రయోగించనూ లేదు. అయితే తనకు సమైక్యవాదుల నుంచి నిరసన సెగలు వచ్చినప్పుడు మాత్రం ఏదో కబుర్లు చెప్పాడు... అని అంటున్నారు విశ్లేషకులు.
సమైక్యవాదిగా ఈ విధంగా పెయిలయిన లగడపాటి ఇప్పుడు జగన్ బెయిల్ విషయంలో స్పందించిన తీరు కూడా ఆసక్తికరంగా మారింది. జగన్ బెయిల్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి, జగన్ కు మధ్య జరిగిన డీల్ గురించి బయటపెడతానని లగడపాటి అన్నాడు. జగన్ కు ఇప్పటికే బెయిల్ వచ్చింది. ఆ డీల్ ఏదైనా ఉంటే.. ఇప్పటికే కుదిరి ఉంటుంది. మరి ఇప్పుడు లగడపాటి దాన్ని బయటపెట్టాలి కానీ.. త్వరలో బయటపెడతా అని అంటాడేంటి?
ఈ విధంగా మాట్లాడితే జనాలకు ఆసక్తి ఉండటానికి ఈయన ఏమైనా సస్సెన్స్ సినిమా దర్శకుడా? ఏదో ఒక మాట చెప్పాల్సిందిపోయి.. త్వరలో బయటపెడతా.. అంటూ లగడపాటి మరోసారి జనాల దృష్టిలో పలచన అయ్యాడు. సమైక్యవాదం విషయంలో బ్రహ్మస్త్రం అంటూ తర్వాత ఏమీ మాట్లాడని లగడపాటి.. జగన్ బెయిల్ విషయంలో కూడా అంతకు మించిన వైవిధ్యాన్ని ప్రదర్శించే అవకాశాలు లేవని విశ్లేషకులు అంటున్నారు. ఆయన దగ్గర మేటర్ ఏమీ లేదని.. కాంగ్రెస్ వీడాలనే పరిస్థితి వస్తే.. అప్పుడు ఏవో ఒకటి మాట్లాడటానికి ఇలా బెయిలు, డీలు అని మాట్లాడుతున్నాడని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Subscribe to:
Posts (Atom)