హైదరాబాద్ :మహేష్‌బాబు కంటిన్యూగా మూడు నెలలు పాటు అంటే 90 రోజుల పాటు కాల్ షీట్స్ ని శ్రీకాంత్ అడ్డాల చిత్రం కోసం ఎలాట్ చేసినట్లు సమచారం. తూర్పు గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో కథ జరుగుతుందని, అక్కడ కొన్ని సీన్స్ తీస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే... శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' సినిమాలో నటించటానికి కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మే 31న అంటే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజున ప్రారంభం కానుందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. దర్శకుడు ఇప్పటికే స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసి ఓ వెర్షన్ వినిపించి గ్రీన్ సిగ్నల్ పొందాడని తెలుస్తోంది. గతంలో మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్లో ‘బ్రహ్మోత్సవం' రూపొందుతూండటంతో బిజినెస్ కూడా బాగా జరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే పి.వి.పి సంస్థ ఈ సినిమా కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చింది. ఈ చిత్రంలో నటించడానికి 15 నుంచి 50 సంవత్సరాల వయస్సులోపు మేల్, ఫీమేల్ ఆర్టిస్టులు కావాలని ప్రకటించారు. ఆసక్తి కలవారు ఫుల్ సైజ్, క్లోజప్ ఫోటోతో కాంటాక్ట్ చేయాల్సిందిగా ప్రకటించారు. పైన ఫొటోలో ఉన్న మెయిల్ ఐ.డికి ఫోటోలు పంపించవచ్చు. ఈ సినిమా మహేష్ బాబుతోనే అయితే... తనతో తెరపంచుకునే అవకాశం కొత్త వారికి కలుగుతుంది.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం'. పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బ్రహ్మోత్సవం'లో మహేష్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. వాటిని చిత్ర బృందం ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమాలో రావు రమేష్ కీలక పాత్రలో నటించనున్నారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Saturday, 4 April 2015
మహేష్ మూడు నెలలు కంటిన్యూ కాల్ షీట్స్
హైదరాబాద్ :మహేష్‌బాబు కంటిన్యూగా మూడు నెలలు పాటు అంటే 90 రోజుల పాటు కాల్ షీట్స్ ని శ్రీకాంత్ అడ్డాల చిత్రం కోసం ఎలాట్ చేసినట్లు సమచారం. తూర్పు గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో కథ జరుగుతుందని, అక్కడ కొన్ని సీన్స్ తీస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే... శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' సినిమాలో నటించటానికి కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మే 31న అంటే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజున ప్రారంభం కానుందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. దర్శకుడు ఇప్పటికే స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసి ఓ వెర్షన్ వినిపించి గ్రీన్ సిగ్నల్ పొందాడని తెలుస్తోంది. గతంలో మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్లో ‘బ్రహ్మోత్సవం' రూపొందుతూండటంతో బిజినెస్ కూడా బాగా జరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే పి.వి.పి సంస్థ ఈ సినిమా కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చింది. ఈ చిత్రంలో నటించడానికి 15 నుంచి 50 సంవత్సరాల వయస్సులోపు మేల్, ఫీమేల్ ఆర్టిస్టులు కావాలని ప్రకటించారు. ఆసక్తి కలవారు ఫుల్ సైజ్, క్లోజప్ ఫోటోతో కాంటాక్ట్ చేయాల్సిందిగా ప్రకటించారు. పైన ఫొటోలో ఉన్న మెయిల్ ఐ.డికి ఫోటోలు పంపించవచ్చు. ఈ సినిమా మహేష్ బాబుతోనే అయితే... తనతో తెరపంచుకునే అవకాశం కొత్త వారికి కలుగుతుంది.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం'. పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బ్రహ్మోత్సవం'లో మహేష్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. వాటిని చిత్ర బృందం ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమాలో రావు రమేష్ కీలక పాత్రలో నటించనున్నారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
పవన్ కళ్యాణ్.....సరసన అంటూ ఆ ముగ్గరు హీరోయిన్లు!
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2' చిత్రం వస్తుందంటూ గత రెండు మూడేళ్లుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సినిమా మాత్రం ఇప్పటికీ మొదలు కాలేదు. అసలు ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. సంపత్ నంది దర్శకత్వంలో ప్రీప్రొడక్షన్ పనులు మొదలైనా....సినిమా పట్టాలెక్కక ముందే దర్శకుడు మారాడు. ప్రస్తుతం ఈ చిత్రం దర్శకుడు బాబీ చేతిలో ఉంది. అయితే ఈ సినిమా మొదలయ్యే సమయానికి బాబీ ఉంటాడో? మరో దర్శకుడు వస్తాడో? లేక పవన్ కళ్యాణే ఈ చిత్రానికి దర్శకుడి అవతారం ఎత్తుతాడో? తెలియని పరిస్థితి. అయితే సందెట్లో సడేమియాలా....పవన్ కళ్యాణ్ పేరు వాడి పలువురు అప్ కమింగ్ హీరోయిన్లకు ప్రచారం కల్పిస్తున్నారు గాసిప్ రాయుళ్లు. ‘గబ్బర్ సింగ్-2' చిత్రంలో ఇప్పటికే అనిషా ఆంబ్రోస్ హీరోయిన్గా ఎంపికయింది. రెండో హీరోయిన్ కోసం వెతుకులాట సాగుతోందట. ఇం
దుకోసం రెజీజా, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా పేర్లను పరిశీలిస్తున్నారట. అసలు సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనే విషయమై ప్రొడక్షన్ టీం నుండి ఇప్పటి వరకు ఎలాంటి సమచారం లేక పోవడం గమనార్హం. ఇప్పటికే సంపత్ నంది మార్చిన పవన్.... స్క్రిప్టు డెవలప్ మెంటు విషయంలో బాబీ పని తీరును కూడా మెచ్చడం లేదని, అతన్ని కూడా మార్చే అవకాశం ఉందని అంటున్నారు. దర్శకుడు ఫోన్ చేస్తే అసలు సమాధానమే ఇవ్వడం లేదటన పవన్. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు. కనీసం ఆయన కూడా ఈ సినిమాపై ఎలాంటి సమాచారం మీడియాకు ఇవ్వక పోవడం గమనార్హం.
సన్నీ లియోన్ ఆ హోటల్లో..? అనుమానాలు? ఎఫ్ఐఆర్!
హైదరాబాద్: పోర్న్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సన్నీ లియోన్...ఇక్కడ క్రమ క్రమంగా తన రేంజి పెంచుకుంటోంది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది. అశ్లీల చిత్రాల(పోర్న్) ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో ఇండియాలో అడుగు పెట్టిన మొదట్లో ఆమెను అంతా వ్యతిరేకించారు. ఆ విమర్శలను భరించి తనపై పాజిటివ్ ఇమేజ్ వచ్చేలా చేసుకుంది సన్నీ. అయితే ఇప్పటికీ ఆమెపై ఉన్న బ్యాడ్ ఓపీనియన్ జనాల్లో తగ్గలేదని తాజాగా ఓ సంఘటన రుజువు చేసింది. తను నటించిన ‘ఏక్ ఫహెల లీలా' సినిమా ప్రమోషన్ కోసం సన్నీ లియోన్ లాస్ట్ సండే సూరత్ పట్టణానికి వచ్చింది. తన భర్త డేనియల్ వెబర్, బాలీవుడ్ నటుడు జై భానుశాలి, డైరెక్టర్ బాబీ ఖాన్ తో కలిసి ఆమె ప్రమోషన్లో పాల్గొనాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో వేదిక ఫైస్టార్ హోటల్ నుండి మరో చోటికి మార్చారు.
దీంతో స్థానిక వ్యక్తి ఒకరు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆమె వచ్చింది సినిమా ప్రమోషన్ కోసం కాదని, ఇతర కారణాలంటూ తన మనసులో ఉన్న అనుమానాలు వ్యక్తం చేసారు. అయితే సూరత్ పోలీసులు మాత్రం ఆమెపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని స్పష్టం చేసారు. సన్నీ లియోన్ సినిమాల విషయానికొస్తే ‘ప్రస్తుతం ఆమె నటించిన ‘ఏక్ పెహలీ లీలా' చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. దీంతో పాటు మిలప్ జవేరి దర్శకత్వంలో వస్తున్న సెక్స్ కామెడీ చిత్రం ‘మస్తీ జాదే'లో డ్యూయల్ రోల్ చేస్తోంది. దీంతో పాటు దేవాంగ్ ధోలకియా దర్శకత్వంలో ‘కుచ్ కుచ్ లోచా హై' చిత్రంలో కూడా నటిస్తోంది.
కాదు...త్రీ (‘అవును 2′ రివ్యూ)
తొలినుంచి మనకు సీక్వెల్ చిత్రాలు పెద్దగా వర్కవుట్ అవటం లేదు. పెరిగిన ఎక్సపెక్టేషన్స్, బిజినెస్ పర్పస్ లో సీక్వెల్ కోసం కథలేకపోయినా సాగతీసే కథనం చాలా సార్లు కారణమవుతూంటాయి. ఇప్పుడు అవును 2 కి అదే పరిస్ధితి ఏర్పడింది. దెయ్యమా సాప్టవేర్ ఇంజినీరా అని డౌట్ వచ్చేలా జరిగే ఈ చిత్రం ఆకట్టుకునేటట్లు కనపడటం లేదు. హర్రర్ సినిమా కదా అని భయపడదాం అని ప్రిపేరై వెళ్లినవాళ్ళు...ఇలాంటి సినిమాకు వచ్చేమేంటిరా అని భయపడేలా రవిబాబు తీసారు. దానికి తోడు ఈ హర్రర్ జానర్ చిత్రాలు చూసే ఆసక్తి ఉన్నవాళ్లు ఎక్కువగా హాలీవుడ్ పై ఆధారపడుతూంటారు. కాబట్టి అక్కడ నుంచి కథ,కానీ సీన్స్ కాని ఎత్తుకొస్తే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ విషయం మర్చిపోయాడో ఏమో కానీ రవిబాబు...Paranormal Activity, The Entity , The Haunted చిత్రాలు కలిపి వండేసారు. అవన్నీ హర్రర్ అభిమానులు ఒకటికి నాలుగుసార్లు చూసేవే..కాబట్టి...మరోసారి వాటినే చూద్దామనిపిస్తుంది ఈ సినిమా చూసి బయిటకు వచ్చాక. ఇవన్నీ ప్రక్కన పెడితే హీరోయిన్ పూర్ణ అభిమానులకు ఇది...ఆమె సినిమా..ఆమె భుజాలపై మోసిన సినిమా గా చూడవచ్చు.దర్శకుడు మొదటే చెప్పినట్లు ‘అవును 2′ కథ సరిగ్గా ‘అవును′ సినిమా చివరి షాట్ దగ్గరనుండి మొదలవుతుంది(దానివల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదనుకోండి). ఒక్కసారి ‘అవును' చిత్రం గుర్తు చేసుకుంటే...ఆ మొదటి భాగంలో మోహిని (పూర్ణ)ను కామంతో రగిలిపోయిన కెప్టెన్ రాజు(రవిబాబు) ప్రేతాత్మ ఆమెను అనుభవించాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో తన భర్త హర్ష(హర్షవర్దన్ రాణే)ని పొడిచేస్తుంది.సెకండ్ పార్ట్ కు వస్తే... అక్కడితో తమను వదిలి ఆ ప్రేతాత్మ వెళ్ళిపోయిందని హర్ష, మోహినిల జంట భావించి, మనశ్శాంతి కోసం ఊరి బయటనున్న తమ ఫ్లాట్ నుండి కొత్తగా సిటీకి దగ్గరలోని మరో ఫ్లాట్‌లోకి మారతారు. (అయితే మనుష్యులే కష్టపడి ఇల్లు వెతుక్కుని వెళ్లిపోయినప్పుడు ఆత్మలు వెల్లలేవా... కెప్టెన్ రాజు ప్రేతాత్మ కూడా అక్కడకి ఆమె వెతుక్కుంటూ వెళ్తుంది). దాంతో వెళ్ళిపోయిందనుకున్న ఆత్మ మళ్ళీ తిరిగి రావడం, మోహిని, హర్షలను మళ్ళీ వేధించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత కెప్టేన్ రాజు భారి నుండి ఈ జంట ఎలా తప్పించుకున్నారు? అలాగే కాశీకి వెళ్ళినపుడు అక్కడి అఘోరా ఇచ్చిన యంత్రం వీరిని ఏమన్నా కాపాడకలిగిందా? చివరకు కెప్టెన్ రాజ్ ఏమయ్యాడు? అన్నది మిగతా కథ. వినటానికి ఈ కథ బాగనే ఉందనిపించినా ఫైనల్ గా ఈ చిత్రం తను ఏం చేయాలో క్లారిటీ లేని దెయ్యం లేదా ప్రేతాత్మ కథ గా తయారైంది. ముఖ్యంగా దెయ్యం (కెప్టెన్ రాజు) కు ఎంతసేపూ టెక్నాలిజీ మీదే దృష్టే కానీ...మొదటి పార్ట్ లలోగా మోహని పై ఉన్నట్లు కనిపించదు. అలాగే అసలు ఏం జరుగుతోందా అని డౌట్ వచ్చేలా... శరీరమే లేకుండా..మోహన్ ని మానబంగం చేయటానికి ప్రయత్నించటం, ఇంకొసారి..వేరే వారి శరీరంలో ప్రవేసించటం వంటివి ఆ దెయ్యం చేస్తూంటుంది. అంతేకానీ ఇలా చేద్దాం..అని ఆదెయ్యానికి ఎక్కడా క్లారిటీ ఉన్నట్లు కనపడదు. అలాగని మీరీ ప్లస్ పాయింట్లు లేవు అని కాదు... అవునులో ఆటోమేటిక్ లైటింగ్ సిస్టం ద్వారా భయపెట్టినట్టే, ఇక్కడ ఆటోమేటిక్ మస్కిటో స్ప్రే ద్వారా భయపెట్టే ప్రయత్నం బాగుంది. అలాగే తొలిభాగం చూడనివారికి కూడా ఇది సంపూర్తిగా అర్దమయ్యేలా దర్శకుడు డిజైన్ చేయటం కూడా మంచి ఎలిమెంటే. అంతేకాకుండా హీరోయిన్ పూర్ణ ..ఈ సినిమాకు పెద్ద హైలెట్. ఆమె లేకపోతే ఈ సినిమాని చివరి వరకూ చూడటమే కష్టం. హర్షవర్దన్ రాణే కూడా బాగా చేసాడు. రవివర్మ పాత్ర క్లైమాక్స్ లో మాత్రమే ఏక్టివ్ అయ్యింది
Monday, 30 March 2015
కాబోయే భర్తకు దూరంగా ఉంటున్న త్రిష ... ఏమైంది?
హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్ త్రిష తమిళ బిజినెస్‌మేన్ వరుణ్ ధావన్‌ను పెళ్లబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా ఆ మధ్య చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఎంగేజ్మెంట్ అనంతరం తన క్లోజ్ ఫ్రెండ్స్‌కి పార్టీ కూడా ఇచ్చింది ఈ భామ. అయితే వీరి ఎంగేజ్మెంట్ జరిగి చాలా రోజులు అవుతున్నా...పెళ్లికి సంబంధించిన వార్తలు ఎక్కడా వినిపించక పోవడం చర్చనీయాంశం అయింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పలు అనుమానాలకు తావిస్తోందనే వాదన వినిపిస్తోంది. వరుణ్ తో ఎంగజ్మెంట్ తర్వాత త్రిషకు కలిసొస్తోంది. ఎంగేజ్మెంట్ తర్వాత త్రిష ప్రొఫెషన్ పరంగా చాలా బిజీ అయిపోయింది. ఆమె నటించిన ఓ తమిళ సినిమా కూడా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. కొత్తగా కొన్ని ప్రాజెక్టులకు సైన్ కూడా చేసింది త్రిష. అంతా బాగానే ఉన్నా....ఓ షాకింగ్ వార్త తమిళ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వరుణ్ మణియన్‌కు త్రిష దూరంగా ఉండేందుకు ట్రై చేస్తోందట.
ఈ నిర్ణయం త్రిష ఇటీవల తీసుకుందని అంటున్నారు. ఇటీవల వరుణ్‌కు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన సినిమా ఆఫర్ కూడా ఆమె రిజెక్ట్ చేసినట్లు టాక్. వరుణ్ సంస్థకు సంబంధించిన సినిమా తిరస్కరించి....తన మేనేజర్ గిరి తెచ్చిన ఓ కామెడీ హారర్ ప్రాజెక్టుకు సైన్ చేసిందట. ఇలాంటివి సినిమా ప్రొఫెషన్లో సర్వ సాధారణమే అయినా...... పుకార్లకు కాదేదీ అనర్హం అన్నట్లు ఈ విషయాలను బేస్ చేసుకుని త్రిష, వరుణ్ మణియన్ సంబంధం గురించి రకరాల వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్-త్రిష మ్యారేజ్ డేట్ ఫిక్సయితే తప్ప ఈ వార్తలకు తెరపడే అవకాశం లేదు
అయ్యో: రాజశేఖర్ కి రామ్ గోపాల్ వర్మ కోలుకోలేని దెబ్బ?
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ, రాజశేఖర్ కాంబినేషన్ లో చిత్రం అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అది హర్రర్ అనగానే పెద్ద ఆసక్తి చూపటం మానేసారు. పట్టపగలు టైటిల్ రూపొందిన ఈ చిత్రంలో రాజశేఖర్ ...తండ్రి పాత్రలో కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్స్ వదిలారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే చిత్రం ఇప్పటివరకూ రిలీజ్ కాలేదు. ఈ చిత్రానికి రాజశేఖర్ నిర్మాత. దానికి రకరకాల కారణాలు వినపడుతున్నాయి. ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పట్టపగలు చిత్రంలో కొన్ని సన్నివేశాలు...జీవిత,రాజశేఖర్ లకు నచ్చలేదని, ముఖ్యంగా క్లైమాక్స్ మార్చమని వర్మని అడిగారని చెప్పుకుంటున్నారు. అయితే మొదట అలాగే మారుద్దామని మాట ఇచ్చిన వర్మ తర్వాత దాని ప్రసక్తే తేకుండా తను కంటిన్యూగా ప్రాజెక్టులు చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపద్యంలో ఆ సీన్స్ మార్చకుండా రిలీజ్ చెయ్యలేరు. వర్మ వాటిని రీషూట్ చెయ్యటం లేదు. దాంతో ఆ ప్రాజెక్టు మీద పెట్టిన మొత్తం పెట్టుబడి బ్లాక్ అయ్యిపోయినట్లుంది.
నిల్ ( గోపిచంద్ 'జిల్' రివ్యూ)
క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్ కథలు ఎప్పుడూ బాగానే ఉంటాయి. అయితే మారుతున్న కాలంతో పాటు మారిన ప్రేక్షకుడుకి ఆ కథ,కథనం చాలా చాలా కొత్తగా అనిపించేలా డిజైన్ చేయగలగాలి. ముఖ్యంగా మాస్ హీరో తో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ క్రైమ్ తను ఎత్తుకున్న కథలో కరెక్టు గా కలవకపోతే రెండు వేరు వేరు ట్రాక్ లుగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఈ చిత్రానికి అలాంటిదే జరిగిందనిపిస్తుంది. లవ్ ట్రాక్ ఓ ప్రక్క, విలన్ ట్రాక్ ఓ ప్రక్క విడివిడిగా నడుస్తూ ఉంటాయి. హీరో తనకు గానీ తన కుటుంబానికి గానీ సంభంధం లేని సమస్యలో ఇరుక్కుంటాడు.ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆ సమస్య కూడా అతన్ని దూరం నుంచే పలకరిస్తుంది. పలకరించినా వెంటనే దగ్గరకు రాదు...విలన్ కరెక్టు డెషిషన్ తీసుకుని హీరోకు సమస్య పూర్తిగ నెట్టే సరికే పుణ్యంకాలం గడిచే సరికి క్లైమాక్స్ వచ్చేస్తుంది. దాంతో హీరో పాత్ర పూర్తి ప్యాసివ్ గా మారి చూసే వారికి నీరసం వస్తుంది....మనలో జిల్ చచ్చిపోతుంది. అయితే ఈ సినిమా చూసిన వారికి ఒకటి మాత్రం అనిపిస్తుంది. దర్శకుడు సరైన స్క్రిప్టు లేక ఇబ్బంది పడ్డాడు కానీ లేకుంటే పెద్ద హిట్ కొట్టేవాడిని అర్దమవుతుంది. షాట్ మేకింగ్, డైలాగులు, ఆర్టిస్టుల ఫెరఫార్మెన్స్ విషయంలో కొత్త దర్శకుడు ఎక్కడా తడబడకుండా చాలా బాగా డీల్ చేసాడు. కాబట్టి నెక్ట్స్ టైమ్ బెటర్ లక్. సినిమాలో ఏకైక ప్లస్ పాయింట్ రాసిఖన్నా. ఆమెను గ్లామర్ గా చూపించిన విధానం. జై(గోపీచంద్) ఓ సిన్సియర్..ఫైర్ ఆఫీసర్. కుటుంబంతో హ్యాపీగా జీవిస్తున్న అతని జీవితంలోకి సావిత్రి(రాసిఖన్నా) వస్తుంది. ఆమెతో సరదా,సరదాగా గడుస్తున్న సమయంలో కథలో ట్విస్ట్ వస్తుంది. ఊహించని విధంగా అండర్ వరల్డ్ డాన్ ఛోటా నాయక్ (కబీర్) ...జై కోసం వెతకటం మొదలెడతాడు. ఎందుకంటే...ఉద్యోగ భాధ్యతల్లో భాగంగా ఆ డాన్ దగ్గర నుంచి డబ్బు కొట్టేసిన రంగనాధ్ (బ్రహ్మాజి) ని ఓ సారి ఫైర్ యాక్సిడెంట్ లో కాపాడే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ చివరి క్షణాల్లో రంగనాథ్ .. జై కు ఆ డబ్బు వివరాలు చెప్పాడని సందేహంతో. అయితే జై కి ఆ వివరాలు ఏమీ తెలియదు. దాన్ని డాన్ ఎంత చెప్పినా నమ్మడు. అప్పుడేం జరిగింది. డాన్ నుంచి జై ఎలా తప్పించుకున్నాడు. ఆ డబ్బు ఏమైంది వంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మిగతా ఎలిమెంట్స్ అన్నీ వదిలేసి మాస్ యాక్షన్ హీరోతో కేవలం స్టైల్ ని నమ్ముకుని సినిమాలు తీస్తే ఎలా ఉంటుంది. దానికి తోడు గతంలో ఎప్పుడో అరవై,డబ్బై సంవత్సరాల క్రితం హిచ్ కాక్ చేసిన The Man Who Knew Too Much వంటి కథనం ఎత్తుకుంటే ఎలా..అప్పటికీ ఇప్పటికీ సినిమా ప్రేక్షకులు బాగా మారారు. అలాగే...మనకు హీరో,హీరోయిన్, పాటలు, విలన్,కామెడీ వంటి అనేక అంశాలు కలిపి వండాలి అనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే పై మరింత కసరత్తు చేయాల్సింది. ఇక ఈ సినిమాలో విలన్ ... ఎక్కడా తప్పు చేస్తున్నట్లు కనిపించదు...తన పోగొట్టుకున్న డబ్బు కోసం తను హీరో వెనక తిరుగతూంటాడు. అయినా వెయ్యికోట్లు బ్యాంక్ లో ఉందంటే అది వైట్ మనీనే. అలాంటప్పుడు దాన్ని పోగొట్టుకున్నవాడు...దాన్ని రాబట్టుకోవాలనుకోవటంలో తప్పేముంది అనిపిస్తుంది. అలాగే హీరోకు...క్లైమాక్స్ ముందు దాకా...తన దగ్గర ఉన్న క్లూ సంగతి గుర్తుకు రాదు. అలా ఎక్కడిక్కడ ... కథను కన్వీనెంట్ గా చేసుకుంటూ వెళ్లటంతో చాలా ప్రెడిక్టుబుల్ గా మారిపోయింది.
దాసరికి కోల్ షాక్: రూ.2.25 కోట్ల ఆస్తుల జఫ్తు, అప్పుడేమన్నారు?
న్యూఢిల్లీ/హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావుకు పెద్ద షాక్. బొగ్గు కుంభకోణం కేసులో దాసరికి చెందిన రూ.2.25 కోట్ల ఆస్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం నాడు అటాచ్ చేసింది. బ్యాంకులోని ఫిక్స్డ్ డిపాజిట్లు, రెండు వాహనాలు, ఓ ఫ్లాట్, ఇతర ఆస్తులను తాత్కాలికంగా జఫ్తు చేసింది. దాసరి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జిందాల్ కంపెనీ పట్ల పక్షపాతం చూపించారని దాసరి పైన ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతని ఆస్తులను తాత్కాలికంగా జఫ్తు చేసింది. బొగ్గు కుంభకోణం సమయంలో దాసరి సహాయమంత్రిగా ఉన్నారు.
కాగా, దాసరి నారాయణ రావు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ రంగం సిద్ధం చేసినట్లుగా వారం రోజుల క్రితం వార్తలు వచ్చాయి. బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్ర ఉందని సీబీఐ నిర్ధారించింది. దాసరి బొగ్గుగునుల శాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీకి ఆయాచిత లబ్ది చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని, జిందాల్ కంపెనీ నుంచి దాసరికి చెందిన సౌభాగ్య మీడియా కంపెనీకి రూ.2.25 కోట్లు క్విడ్ ప్రోకో రూపంలో అందాయని సీబీఐ నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు దాసరిని ఈడీ, సీబీఐ విచారించింది. సౌభాగ్య మీడియా కంపెనీ ఆస్తులను ఈడీ జప్తు చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. సోమవారం సాయంత్రానికి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించిన ప్రకటనను ఈడీ వెలువరించే అవకాశం ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. 2006-2009 మధ్యకాలంలో బొగ్గు శాఖలో భారీ కుంభకోణం జరిగిందని కాగ్ నివేదిక ద్వారా వెలుగు చూసిన విషయం తెలిసిందే. అప్పుడు దాసరి బొగ్గు శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. గతంలో దాసరిని సీబీఐ హైదరాబాదులో ప్రశ్నించింది. అదే సమయంలో మరో మాజీ మంత్రి సంతోష్ బగ్రోడియాను కూడా ప్రశ్నించింది. హిండాల్కోకు బొగ్గు కేటాయింపుల విషయంలో తన ప్రమేయం లేదని దాసరి నారాయణ రావు సీబీఐకి గతంలో వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి. బొగ్గు కుంభకోణంలో విచారణ జరుపుతున్న సిబిఐ ముందుకు దాసరి తనకు సహాయంగా గతంలో పిఎస్‌గా పని చేసిన అధికారిని కూడా తీసుకువెళ్లారు.
Subscribe to:
Posts (Atom)