తొలినుంచి మనకు సీక్వెల్ చిత్రాలు పెద్దగా వర్కవుట్ అవటం లేదు. పెరిగిన ఎక్సపెక్టేషన్స్, బిజినెస్ పర్పస్ లో సీక్వెల్ కోసం కథలేకపోయినా సాగతీసే కథనం చాలా సార్లు కారణమవుతూంటాయి. ఇప్పుడు అవును 2 కి అదే పరిస్ధితి ఏర్పడింది. దెయ్యమా సాప్టవేర్ ఇంజినీరా అని డౌట్ వచ్చేలా జరిగే ఈ చిత్రం ఆకట్టుకునేటట్లు కనపడటం లేదు. హర్రర్ సినిమా కదా అని భయపడదాం అని ప్రిపేరై వెళ్లినవాళ్ళు...ఇలాంటి సినిమాకు వచ్చేమేంటిరా అని భయపడేలా రవిబాబు తీసారు. దానికి తోడు ఈ హర్రర్ జానర్ చిత్రాలు చూసే ఆసక్తి ఉన్నవాళ్లు ఎక్కువగా హాలీవుడ్ పై ఆధారపడుతూంటారు. కాబట్టి అక్కడ నుంచి కథ,కానీ సీన్స్ కాని ఎత్తుకొస్తే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ విషయం మర్చిపోయాడో ఏమో కానీ రవిబాబు...Paranormal Activity, The Entity , The Haunted చిత్రాలు కలిపి వండేసారు. అవన్నీ హర్రర్ అభిమానులు ఒకటికి నాలుగుసార్లు చూసేవే..కాబట్టి...మరోసారి వాటినే చూద్దామనిపిస్తుంది ఈ సినిమా చూసి బయిటకు వచ్చాక. ఇవన్నీ ప్రక్కన పెడితే హీరోయిన్ పూర్ణ అభిమానులకు ఇది...ఆమె సినిమా..ఆమె భుజాలపై మోసిన సినిమా గా చూడవచ్చు.దర్శకుడు మొదటే చెప్పినట్లు ‘అవును 2′ కథ సరిగ్గా ‘అవును′ సినిమా చివరి షాట్ దగ్గరనుండి మొదలవుతుంది(దానివల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదనుకోండి). ఒక్కసారి ‘అవును' చిత్రం గుర్తు చేసుకుంటే...ఆ మొదటి భాగంలో మోహిని (పూర్ణ)ను కామంతో రగిలిపోయిన కెప్టెన్ రాజు(రవిబాబు) ప్రేతాత్మ ఆమెను అనుభవించాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో తన భర్త హర్ష(హర్షవర్దన్ రాణే)ని పొడిచేస్తుంది.సెకండ్ పార్ట్ కు వస్తే... అక్కడితో తమను వదిలి ఆ ప్రేతాత్మ వెళ్ళిపోయిందని హర్ష, మోహినిల జంట భావించి, మనశ్శాంతి కోసం ఊరి బయటనున్న తమ ఫ్లాట్ నుండి కొత్తగా సిటీకి దగ్గరలోని మరో ఫ్లాట్‌లోకి మారతారు. (అయితే మనుష్యులే కష్టపడి ఇల్లు వెతుక్కుని వెళ్లిపోయినప్పుడు ఆత్మలు వెల్లలేవా... కెప్టెన్ రాజు ప్రేతాత్మ కూడా అక్కడకి ఆమె వెతుక్కుంటూ వెళ్తుంది). దాంతో వెళ్ళిపోయిందనుకున్న ఆత్మ మళ్ళీ తిరిగి రావడం, మోహిని, హర్షలను మళ్ళీ వేధించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత కెప్టేన్ రాజు భారి నుండి ఈ జంట ఎలా తప్పించుకున్నారు? అలాగే కాశీకి వెళ్ళినపుడు అక్కడి అఘోరా ఇచ్చిన యంత్రం వీరిని ఏమన్నా కాపాడకలిగిందా? చివరకు కెప్టెన్ రాజ్ ఏమయ్యాడు? అన్నది మిగతా కథ. వినటానికి ఈ కథ బాగనే ఉందనిపించినా ఫైనల్ గా ఈ చిత్రం తను ఏం చేయాలో క్లారిటీ లేని దెయ్యం లేదా ప్రేతాత్మ కథ గా తయారైంది. ముఖ్యంగా దెయ్యం (కెప్టెన్ రాజు) కు ఎంతసేపూ టెక్నాలిజీ మీదే దృష్టే కానీ...మొదటి పార్ట్ లలోగా మోహని పై ఉన్నట్లు కనిపించదు. అలాగే అసలు ఏం జరుగుతోందా అని డౌట్ వచ్చేలా... శరీరమే లేకుండా..మోహన్ ని మానబంగం చేయటానికి ప్రయత్నించటం, ఇంకొసారి..వేరే వారి శరీరంలో ప్రవేసించటం వంటివి ఆ దెయ్యం చేస్తూంటుంది. అంతేకానీ ఇలా చేద్దాం..అని ఆదెయ్యానికి ఎక్కడా క్లారిటీ ఉన్నట్లు కనపడదు. అలాగని మీరీ ప్లస్ పాయింట్లు లేవు అని కాదు... అవునులో ఆటోమేటిక్ లైటింగ్ సిస్టం ద్వారా భయపెట్టినట్టే, ఇక్కడ ఆటోమేటిక్ మస్కిటో స్ప్రే ద్వారా భయపెట్టే ప్రయత్నం బాగుంది. అలాగే తొలిభాగం చూడనివారికి కూడా ఇది సంపూర్తిగా అర్దమయ్యేలా దర్శకుడు డిజైన్ చేయటం కూడా మంచి ఎలిమెంటే. అంతేకాకుండా హీరోయిన్ పూర్ణ ..ఈ సినిమాకు పెద్ద హైలెట్. ఆమె లేకపోతే ఈ సినిమాని చివరి వరకూ చూడటమే కష్టం. హర్షవర్దన్ రాణే కూడా బాగా చేసాడు. రవివర్మ పాత్ర క్లైమాక్స్ లో మాత్రమే ఏక్టివ్ అయ్యింది





























