హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్ త్రిష తమిళ బిజినెస్‌మేన్ వరుణ్ ధావన్‌ను పెళ్లబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా ఆ మధ్య చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఎంగేజ్మెంట్ అనంతరం తన క్లోజ్ ఫ్రెండ్స్‌కి పార్టీ కూడా ఇచ్చింది ఈ భామ. అయితే వీరి ఎంగేజ్మెంట్ జరిగి చాలా రోజులు అవుతున్నా...పెళ్లికి సంబంధించిన వార్తలు ఎక్కడా వినిపించక పోవడం చర్చనీయాంశం అయింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పలు అనుమానాలకు తావిస్తోందనే వాదన వినిపిస్తోంది. వరుణ్ తో ఎంగజ్మెంట్ తర్వాత త్రిషకు కలిసొస్తోంది. ఎంగేజ్మెంట్ తర్వాత త్రిష ప్రొఫెషన్ పరంగా చాలా బిజీ అయిపోయింది. ఆమె నటించిన ఓ తమిళ సినిమా కూడా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. కొత్తగా కొన్ని ప్రాజెక్టులకు సైన్ కూడా చేసింది త్రిష. అంతా బాగానే ఉన్నా....ఓ షాకింగ్ వార్త తమిళ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వరుణ్ మణియన్‌కు త్రిష దూరంగా ఉండేందుకు ట్రై చేస్తోందట.
ఈ నిర్ణయం త్రిష ఇటీవల తీసుకుందని అంటున్నారు. ఇటీవల వరుణ్‌కు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన సినిమా ఆఫర్ కూడా ఆమె రిజెక్ట్ చేసినట్లు టాక్. వరుణ్ సంస్థకు సంబంధించిన సినిమా తిరస్కరించి....తన మేనేజర్ గిరి తెచ్చిన ఓ కామెడీ హారర్ ప్రాజెక్టుకు సైన్ చేసిందట. ఇలాంటివి సినిమా ప్రొఫెషన్లో సర్వ సాధారణమే అయినా...... పుకార్లకు కాదేదీ అనర్హం అన్నట్లు ఈ విషయాలను బేస్ చేసుకుని త్రిష, వరుణ్ మణియన్ సంబంధం గురించి రకరాల వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్-త్రిష మ్యారేజ్ డేట్ ఫిక్సయితే తప్ప ఈ వార్తలకు తెరపడే అవకాశం లేదు
Monday, 30 March 2015
కాబోయే భర్తకు దూరంగా ఉంటున్న త్రిష ... ఏమైంది?
హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్ త్రిష తమిళ బిజినెస్‌మేన్ వరుణ్ ధావన్‌ను పెళ్లబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా ఆ మధ్య చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఎంగేజ్మెంట్ అనంతరం తన క్లోజ్ ఫ్రెండ్స్‌కి పార్టీ కూడా ఇచ్చింది ఈ భామ. అయితే వీరి ఎంగేజ్మెంట్ జరిగి చాలా రోజులు అవుతున్నా...పెళ్లికి సంబంధించిన వార్తలు ఎక్కడా వినిపించక పోవడం చర్చనీయాంశం అయింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పలు అనుమానాలకు తావిస్తోందనే వాదన వినిపిస్తోంది. వరుణ్ తో ఎంగజ్మెంట్ తర్వాత త్రిషకు కలిసొస్తోంది. ఎంగేజ్మెంట్ తర్వాత త్రిష ప్రొఫెషన్ పరంగా చాలా బిజీ అయిపోయింది. ఆమె నటించిన ఓ తమిళ సినిమా కూడా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. కొత్తగా కొన్ని ప్రాజెక్టులకు సైన్ కూడా చేసింది త్రిష. అంతా బాగానే ఉన్నా....ఓ షాకింగ్ వార్త తమిళ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వరుణ్ మణియన్‌కు త్రిష దూరంగా ఉండేందుకు ట్రై చేస్తోందట.
ఈ నిర్ణయం త్రిష ఇటీవల తీసుకుందని అంటున్నారు. ఇటీవల వరుణ్‌కు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన సినిమా ఆఫర్ కూడా ఆమె రిజెక్ట్ చేసినట్లు టాక్. వరుణ్ సంస్థకు సంబంధించిన సినిమా తిరస్కరించి....తన మేనేజర్ గిరి తెచ్చిన ఓ కామెడీ హారర్ ప్రాజెక్టుకు సైన్ చేసిందట. ఇలాంటివి సినిమా ప్రొఫెషన్లో సర్వ సాధారణమే అయినా...... పుకార్లకు కాదేదీ అనర్హం అన్నట్లు ఈ విషయాలను బేస్ చేసుకుని త్రిష, వరుణ్ మణియన్ సంబంధం గురించి రకరాల వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్-త్రిష మ్యారేజ్ డేట్ ఫిక్సయితే తప్ప ఈ వార్తలకు తెరపడే అవకాశం లేదు
అయ్యో: రాజశేఖర్ కి రామ్ గోపాల్ వర్మ కోలుకోలేని దెబ్బ?
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ, రాజశేఖర్ కాంబినేషన్ లో చిత్రం అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అది హర్రర్ అనగానే పెద్ద ఆసక్తి చూపటం మానేసారు. పట్టపగలు టైటిల్ రూపొందిన ఈ చిత్రంలో రాజశేఖర్ ...తండ్రి పాత్రలో కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్స్ వదిలారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే చిత్రం ఇప్పటివరకూ రిలీజ్ కాలేదు. ఈ చిత్రానికి రాజశేఖర్ నిర్మాత. దానికి రకరకాల కారణాలు వినపడుతున్నాయి. ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పట్టపగలు చిత్రంలో కొన్ని సన్నివేశాలు...జీవిత,రాజశేఖర్ లకు నచ్చలేదని, ముఖ్యంగా క్లైమాక్స్ మార్చమని వర్మని అడిగారని చెప్పుకుంటున్నారు. అయితే మొదట అలాగే మారుద్దామని మాట ఇచ్చిన వర్మ తర్వాత దాని ప్రసక్తే తేకుండా తను కంటిన్యూగా ప్రాజెక్టులు చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపద్యంలో ఆ సీన్స్ మార్చకుండా రిలీజ్ చెయ్యలేరు. వర్మ వాటిని రీషూట్ చెయ్యటం లేదు. దాంతో ఆ ప్రాజెక్టు మీద పెట్టిన మొత్తం పెట్టుబడి బ్లాక్ అయ్యిపోయినట్లుంది.
నిల్ ( గోపిచంద్ 'జిల్' రివ్యూ)
క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్ కథలు ఎప్పుడూ బాగానే ఉంటాయి. అయితే మారుతున్న కాలంతో పాటు మారిన ప్రేక్షకుడుకి ఆ కథ,కథనం చాలా చాలా కొత్తగా అనిపించేలా డిజైన్ చేయగలగాలి. ముఖ్యంగా మాస్ హీరో తో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ క్రైమ్ తను ఎత్తుకున్న కథలో కరెక్టు గా కలవకపోతే రెండు వేరు వేరు ట్రాక్ లుగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఈ చిత్రానికి అలాంటిదే జరిగిందనిపిస్తుంది. లవ్ ట్రాక్ ఓ ప్రక్క, విలన్ ట్రాక్ ఓ ప్రక్క విడివిడిగా నడుస్తూ ఉంటాయి. హీరో తనకు గానీ తన కుటుంబానికి గానీ సంభంధం లేని సమస్యలో ఇరుక్కుంటాడు.ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆ సమస్య కూడా అతన్ని దూరం నుంచే పలకరిస్తుంది. పలకరించినా వెంటనే దగ్గరకు రాదు...విలన్ కరెక్టు డెషిషన్ తీసుకుని హీరోకు సమస్య పూర్తిగ నెట్టే సరికే పుణ్యంకాలం గడిచే సరికి క్లైమాక్స్ వచ్చేస్తుంది. దాంతో హీరో పాత్ర పూర్తి ప్యాసివ్ గా మారి చూసే వారికి నీరసం వస్తుంది....మనలో జిల్ చచ్చిపోతుంది. అయితే ఈ సినిమా చూసిన వారికి ఒకటి మాత్రం అనిపిస్తుంది. దర్శకుడు సరైన స్క్రిప్టు లేక ఇబ్బంది పడ్డాడు కానీ లేకుంటే పెద్ద హిట్ కొట్టేవాడిని అర్దమవుతుంది. షాట్ మేకింగ్, డైలాగులు, ఆర్టిస్టుల ఫెరఫార్మెన్స్ విషయంలో కొత్త దర్శకుడు ఎక్కడా తడబడకుండా చాలా బాగా డీల్ చేసాడు. కాబట్టి నెక్ట్స్ టైమ్ బెటర్ లక్. సినిమాలో ఏకైక ప్లస్ పాయింట్ రాసిఖన్నా. ఆమెను గ్లామర్ గా చూపించిన విధానం. జై(గోపీచంద్) ఓ సిన్సియర్..ఫైర్ ఆఫీసర్. కుటుంబంతో హ్యాపీగా జీవిస్తున్న అతని జీవితంలోకి సావిత్రి(రాసిఖన్నా) వస్తుంది. ఆమెతో సరదా,సరదాగా గడుస్తున్న సమయంలో కథలో ట్విస్ట్ వస్తుంది. ఊహించని విధంగా అండర్ వరల్డ్ డాన్ ఛోటా నాయక్ (కబీర్) ...జై కోసం వెతకటం మొదలెడతాడు. ఎందుకంటే...ఉద్యోగ భాధ్యతల్లో భాగంగా ఆ డాన్ దగ్గర నుంచి డబ్బు కొట్టేసిన రంగనాధ్ (బ్రహ్మాజి) ని ఓ సారి ఫైర్ యాక్సిడెంట్ లో కాపాడే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ చివరి క్షణాల్లో రంగనాథ్ .. జై కు ఆ డబ్బు వివరాలు చెప్పాడని సందేహంతో. అయితే జై కి ఆ వివరాలు ఏమీ తెలియదు. దాన్ని డాన్ ఎంత చెప్పినా నమ్మడు. అప్పుడేం జరిగింది. డాన్ నుంచి జై ఎలా తప్పించుకున్నాడు. ఆ డబ్బు ఏమైంది వంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మిగతా ఎలిమెంట్స్ అన్నీ వదిలేసి మాస్ యాక్షన్ హీరోతో కేవలం స్టైల్ ని నమ్ముకుని సినిమాలు తీస్తే ఎలా ఉంటుంది. దానికి తోడు గతంలో ఎప్పుడో అరవై,డబ్బై సంవత్సరాల క్రితం హిచ్ కాక్ చేసిన The Man Who Knew Too Much వంటి కథనం ఎత్తుకుంటే ఎలా..అప్పటికీ ఇప్పటికీ సినిమా ప్రేక్షకులు బాగా మారారు. అలాగే...మనకు హీరో,హీరోయిన్, పాటలు, విలన్,కామెడీ వంటి అనేక అంశాలు కలిపి వండాలి అనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే పై మరింత కసరత్తు చేయాల్సింది. ఇక ఈ సినిమాలో విలన్ ... ఎక్కడా తప్పు చేస్తున్నట్లు కనిపించదు...తన పోగొట్టుకున్న డబ్బు కోసం తను హీరో వెనక తిరుగతూంటాడు. అయినా వెయ్యికోట్లు బ్యాంక్ లో ఉందంటే అది వైట్ మనీనే. అలాంటప్పుడు దాన్ని పోగొట్టుకున్నవాడు...దాన్ని రాబట్టుకోవాలనుకోవటంలో తప్పేముంది అనిపిస్తుంది. అలాగే హీరోకు...క్లైమాక్స్ ముందు దాకా...తన దగ్గర ఉన్న క్లూ సంగతి గుర్తుకు రాదు. అలా ఎక్కడిక్కడ ... కథను కన్వీనెంట్ గా చేసుకుంటూ వెళ్లటంతో చాలా ప్రెడిక్టుబుల్ గా మారిపోయింది.
దాసరికి కోల్ షాక్: రూ.2.25 కోట్ల ఆస్తుల జఫ్తు, అప్పుడేమన్నారు?
న్యూఢిల్లీ/హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావుకు పెద్ద షాక్. బొగ్గు కుంభకోణం కేసులో దాసరికి చెందిన రూ.2.25 కోట్ల ఆస్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం నాడు అటాచ్ చేసింది. బ్యాంకులోని ఫిక్స్డ్ డిపాజిట్లు, రెండు వాహనాలు, ఓ ఫ్లాట్, ఇతర ఆస్తులను తాత్కాలికంగా జఫ్తు చేసింది. దాసరి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జిందాల్ కంపెనీ పట్ల పక్షపాతం చూపించారని దాసరి పైన ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతని ఆస్తులను తాత్కాలికంగా జఫ్తు చేసింది. బొగ్గు కుంభకోణం సమయంలో దాసరి సహాయమంత్రిగా ఉన్నారు.
కాగా, దాసరి నారాయణ రావు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ రంగం సిద్ధం చేసినట్లుగా వారం రోజుల క్రితం వార్తలు వచ్చాయి. బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్ర ఉందని సీబీఐ నిర్ధారించింది. దాసరి బొగ్గుగునుల శాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీకి ఆయాచిత లబ్ది చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని, జిందాల్ కంపెనీ నుంచి దాసరికి చెందిన సౌభాగ్య మీడియా కంపెనీకి రూ.2.25 కోట్లు క్విడ్ ప్రోకో రూపంలో అందాయని సీబీఐ నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు దాసరిని ఈడీ, సీబీఐ విచారించింది. సౌభాగ్య మీడియా కంపెనీ ఆస్తులను ఈడీ జప్తు చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. సోమవారం సాయంత్రానికి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించిన ప్రకటనను ఈడీ వెలువరించే అవకాశం ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. 2006-2009 మధ్యకాలంలో బొగ్గు శాఖలో భారీ కుంభకోణం జరిగిందని కాగ్ నివేదిక ద్వారా వెలుగు చూసిన విషయం తెలిసిందే. అప్పుడు దాసరి బొగ్గు శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. గతంలో దాసరిని సీబీఐ హైదరాబాదులో ప్రశ్నించింది. అదే సమయంలో మరో మాజీ మంత్రి సంతోష్ బగ్రోడియాను కూడా ప్రశ్నించింది. హిండాల్కోకు బొగ్గు కేటాయింపుల విషయంలో తన ప్రమేయం లేదని దాసరి నారాయణ రావు సీబీఐకి గతంలో వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి. బొగ్గు కుంభకోణంలో విచారణ జరుపుతున్న సిబిఐ ముందుకు దాసరి తనకు సహాయంగా గతంలో పిఎస్‌గా పని చేసిన అధికారిని కూడా తీసుకువెళ్లారు.
Monday, 23 March 2015
Sunday, 22 March 2015
సమంత,ఎమీ జాక్సన్ హీరోయిన్స్ గా...
చెన్నై : సమంత,ఎమి జాక్సన్ ఇద్దరూ టాప్ హీరోయిన్స్. వీరిద్దరూ ఒకే సినిమాల్లో ఉంటే ఇంక చెప్పేదేముంది..ప్రేక్షకులకు పండుగే. అలాంటిదే ఇప్పుడు జరగబోతోంది. అదీ ఆశామాషీ కాంబినేషన్ లో కాదు. పూర్తి వివరాల్లోకి వెళితే...
'షమితాబ్', 'అనేగన్' (అనేకుడు)చిత్రాలతో భారత సినీ జనాలను ఆకట్టుకుంటున్న నటుడు ధనుష్. అంతకుముందు వేల్రాజ్ దర్శకత్వంలో విడుదలైన 'వేలై ఇల్లా పట్టదారి' (తెలుగులో రఘువరన్ ఎంటెక్) వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పుడు మళ్లీ ఇదే జట్టు మరో చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ఇందులో ఎమీజాక్సన్, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సునంద మృతి కేసు: పాక్ జర్నలిస్ట్ తరర్‌ను ఎలా ప్రశ్నిస్తారు?
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఆమెను ఎలా ప్రశ్నించాలనే విషయమై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమె పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్టు కావడంతో ఆమెకు సమన్లు ఇవ్వడం కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని. మెహర్ తరర్ విచారణ కోసం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధమైతే పెద్ద సమస్య పోతుంది. కానీ ఆమె అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను విచారించేందుకు పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. అయితే, సునంద పుష్కర్ మృతి కేసులో దర్యాఫ్తు బృందానికి తాను సహకరిస్తానని ఆమె చెప్పారు. వారు పాక్‌కు వస్తే విచారించుకోవచ్చునని గతంలో చెప్పారు. ఈ కేసులో ఆమె కీలకమైన సాక్షి. అయినప్పటికీ ఆమె విచారణ కోసం భారత్ వస్తారా లేదా అనేది ఇంకా అనుమానమే.
Subscribe to:
Posts (Atom)
























