Wednesday, 11 March 2015

రవితేజ తన కొడుకుతో కలిసి సెల్ఫీ(ఫొటో)


హైదరాబాద్ :హీరో రవితేజ తన కుటుంబానికి తగిన సమయం కేటాయించి చాలా హ్యాపీగా గడుపుతూంటారు. ఆయన తన కొడుకు మాధవన్ తో కలిసి సర్ఫైజింగ్ గా ఈ ఫొటోని అఫీషియల్ గా తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో షేర్ చేసారు. రవితేజ..చాలా కాలం క్రితం కళ్యాణి ని వివాహం చేసుకున్నారు. ఆయనకు కుమార్తె మోక్షద, కుమారుడు మాధవన్ భూపతి రాజు ఉన్నారు. పాప..తొమ్మిదవ తరగతి చదువుతోంది. కుమారుడు ఐదవ తరగతి చదువుకుంటున్నారు. వీళ్లిద్దరూ రవితేజకు చాలా క్లోజ్ గా ఉంటారు. ఇక్కడ రవితేజ తన కొడుకుతో దిగిన ఫొటో చూడవచ్చు.

ఎన్నారైతో జగపతి బాబు కుమార్తె వివాహం (ఫోటోస్)


హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు పెద్ద కుమార్తె మేఘన అమెరికాకు చెందిన ఎన్నారైని ఆదివారం పెళ్లాడుతోంది. హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్ ఇందుకు వేదిక అయింది. అమెరికాలో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేసిన మేఘన అక్కడే ఓ ఎన్నారైతో ప్రేమలో పడింది. తండ్రి జగపతి బాబుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంగరంగ వైభవంగా ఈ రోజు వివాహం జరుగుతోంది. ఆదివారం రాత్రి జరిగే ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుండి ప్రముఖులు హాజరుకానున్నారు. పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా ఈ వేడుక ప్లాన్ చేసారు. వివాహం అయిన తర్వాత మీడియాకు ఫోటోలు విడదల చేయనున్నారు.

Tuesday, 10 March 2015

గ్రాండ్‌గా మనోజ్-ప్రణతి రెడ్డి ఎంగేజ్మెంట్ (ఫోటోస్)


Akkineni Nagarjuna Niece Anumolu Sahitya Caught in Drunk and Drive Case


"డాన్ ఘంటశాల" గా సంపూర్ణేష్ బాబు


హైదరాబాద్ : రీసెంట్ గా ..బందిపోటు చిత్రంలో అల్లరి నరేష్ తో సమానంగా నవ్వించిన సంపూర్ణేష్ బాబు మరోసారి తన సత్తా చూపించటానికి సిద్దమవుతున్నారు. ఈ సారి "డాన్ ఘంటశాల" గా ఆయన కనిపించనున్నారు. వేర్ ఈజ్ విద్యాబాలన్ అనే చిత్రంలో ఆయన కామెడీ విలన్ పాత్ర పోషిస్తున్నారని సమాచారం. సెకండాఫ్ లో సంపూర్ణేష్ బాబు కనిపించి, నవ్విస్తాడంటున్నారు. ఈ పాత్ర బాగా క్లిక్ అవుతుందని దర్శక,నిర్మాతలు బాగ నమ్మకం పెట్టుకున్నారు.

click on the below link for support us plz

రామ్ చరణ్ సేవ: చిరంజీవి ట్రస్ట్, అపోలో సపోర్టుతో


హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన రీతిలో సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. తాజాగా చిన్న పిల్లల ఆరోగ్యంపై రామ్ చరణ్ దృష్టి సారించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు, అపోలో హాస్పిటల్ సపోర్టుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పిల్లల హెల్త్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించారు. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా మొదలు పెట్టిన సేవా కార్యక్రమాలను రామ్ చరణ్ కొనసాగిస్తున్నారు. రామ్ చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన కామినేని కూడా ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఈ విషయం గురించి రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, అపోలో హాస్పటల్ సంయుక్తంగా చిల్డ్రన్ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 12 డిపరెంట్ లోకేషన్లలో ఈ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఏ చిన్నారికి ఆరోగ్య సమస్య ఉన్నా మేము అక్కడ అంటెండ్ అవుతామని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్ బాధ్యతలను కూడా రామ్ చరణ్ పర్యవేక్షిస్తున్నారు. ఆ మధ్య రామ్ చరణ్ మాట్లాడుతూ...2.65 లక్షల బ్లడ్ శాంపిల్స్ సేకరించాం. దాదాపు 8 లక్షల మందిని కాపాడగలిగామని తెలిపారు.

Manchu monoj shocking behaviour on stage(must watch)