Sunday, 8 March 2015

5గురు గర్ల్స్ ఒడిలో పడుకొని విద్యార్థి ఫోటో: వివాదం


బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ విద్యార్థి క్లాసులోని అమ్మాయిల ఒడిలో పడుకొని ఓ పొటో తీయించుకున్నాడు. అది ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వేగంగా పాకిపోవడంతో.. పలువురు దీని పైన మండిపడుతున్నారు. హిందూ సంస్థలు కొన్ని కళాశాల ఎదుట ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో అమ్మాయిల ఒడిలో పడుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేశారు. అతనిని చితకబాది వదిలేశారు. ఆ ఫోటోను తన మిత్రులు సరదాగా తీశారని అతను చెబుతున్నాడు. కాగా, విద్యార్థితో పాటు అతను ఎవరి ఒడిలో పడుకున్నాడో.. ఆ విద్యార్థినీలను కళాశాల సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటో ఓ అమ్మాయి ఫేస్‌బుక్ అకౌంట్ నుండి బయటకు వచ్చింది. దీని పైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదాస్పదమైన ఆ ఫోటోను తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేసి అప్ లోడ్ చేశారని ఆరోపించారు. ఈ ఫోటోను తన క్లాస్‌మేట్ ఒకరు ఫిబ్రవరి 18వ తేదీన తీశారని, అనంతరం ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేశారని చెప్పారు. తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేసి దానిని అప్ లోడ్ చేశారని ఫిర్యాదు చేశారు. సురత్కాల్ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని, కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.

పన్ను కట్టని హీరోయిన్


సినిమా చేయడానికి కోట్లకు కోట్లు రెమ్యున్ రేషన్ అడగటంలో వెనుకాడని హీరోయిన్ నయనతారకు పాపం ఇంటి పన్ను కట్టడానికి డబ్పులు లేవేమో. ఇంటి పన్ను కట్టనందుకు నయనతారకు ఊటీ కార్పోరేషన్ అధికారులు ఇంటివాటర్, డ్రైనేజ్ కనెక్షన్లు కట్ చేస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు. నీలగిరి జిల్లా ఊటీ సమీపంలో లవ్ టెల్ రోడ్డు రాయల్ కాస్టిల్ ప్రాంతంలో నయనతారకు ఇల్లు ఉంది. కాని ఈ అమ్మడు చాలా కాలం నుండి ఇంటి పన్నునే కట్టడం లేదట. దీంతో ఊటీ కార్పోరేషన్ అధికారులు నయనతార ఇంటికి తాళం వేసి జప్తు నోటీసులు అతికించారు.

సోనమ్ కపూర్ కి స్వైన్ ఫ్లూ తగ్గింది


అందాలతార బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కు స్వైన్ ఫ్లూ వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ కపూర్ కి స్వైన్ ఫ్లూ తగ్గి ఆరోగ్యం మెరుగుపడటంతో ఈ రోజు ఆమెను డిస్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్నాను. హోం స్వీట్ హోం అని తానే స్వయంగా ట్విట్టర్ లో తెలిపింది. రాజ్‌కోట్ సమీపంలో సోనమ్ సల్మాన్ ఖాన్ సరసన నటిస్తున్న ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంగా గత శుక్రవారం నాడు ఆమె అస్వస్థతకు గురైంది. దాంతో ఆమెను స్థానికంగా వున్న ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తరువాత ముంబై ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఫ్లూ జ్వరం వచ్చిందని మొదట భావించారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు స్వైన్ ఫ్లూ వచ్చినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏమి మాట్లాడుతాడోఆయనకే తెలియదు: జగన్


పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాలలో తనకంటే ఒకరోజు ముందే పర్యటించబోతున్నారనే సంగతి తెలిసి కంగారుపడిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనపై తన మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు. కానీ తన పర్యటన తరువాతే పవన్ కళ్యాణ్ తుళ్ళూరుకి బయలుదేరుతారని తెలిసి ఆయన చల్లబడ్డారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తుళ్ళూరులో ఒకలాగ, హైదరాబాద్ చేరుకోగానే మరొకలాగా మాట్లాడి అభాసుపాలవడంతో అందరి కంటే ఎక్కువగా వైకాపాయే చాలా సంతోషించి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అదే అభిప్రాయం జగన్ మాటలలో ప్రతిఫలించింది. నిన్న శాసనసభ సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన జగన్, ఒక ప్రశ్నకు బదులిస్తూ, “ఆయన (పవన్ కళ్యాణ్) ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఆయన తుళ్ళూరులో ఏమి మాట్లాడారో, హైదరాబాద్ కి తిరిగి వచ్చి ఏమి మాట్లాడారో అందరూ విన్నారు. మరి రేపు ఏమి మాట్లాడబోతాడో ప్రజలే ఆయనని అడగాలి,” అని సమాధానం ఇచ్చేరు. కానీ తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన భూ కుంభకోణాల గురించి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు మాత్రం నేరుగా సమాధానం చెప్పకుండా, “ఆయన చనిపోయి ఏడేళ్లయింది. చనిపోయిన వ్యక్తి గురించి ఇపుడు కొందరు మాట్లాడుతున్నారు. కానీ ఇపుడు జరుగుతున్న అక్రమాలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అని నేర్పుగా సమాధానం దాటవేసారు. ఏడేళ్ళ క్రితం చనిపోయిన తన తండ్రి పేరు చెప్పుకొని ఇప్పటికీ ఓదార్పు యాత్రలు చేస్తూ, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల గురించి చెప్పుకొంటూ రాజకీయ లబ్ది పొందాలని ఆశిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఆయన హయాంలో జరిగిన అవినీతి గురించి మాత్రం ఎవరూ మాట్లాడకూడదని అంటున్నారు. పైగా తనకు ప్రజలు అవకాశమిస్తే మళ్ళీ రాజన్న రాజ్యం స్థాపిస్తానని గొప్పగా చెప్పుకొంటున్నారు కూడా! నేటికీ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? డిల్లీలో ఉండే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సంస్థ జగన్ కి చెందిన వందల కోట్లు ఆస్తులను ఎందుకు జప్తు చేసుకొంటోంది? అయినా దానిపై జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన మీడియా గానీ ఎప్పుడు ఎందుకు స్పందించవు? అని ప్రశ్నించుకొంటే వచ్చే సమాధానం ఆయన నీతి నిజాయితీల గురించి తెలియజేస్తుంది. నిజమే! పవన్ కళ్యాణ్ బొత్తిగా రాజకీయ అనుభవం లేక తప్పటడుగులు వేస్తూ అభాసుపాలవుతున్నారు. అందుకు ఆయనే నష్టపోతారు. కానీ బొత్తిగా రాజకీయ అనుభవం లేని ఆయన తుళ్ళూరు పర్యటిస్తారనగానే వైకాపా ఎందుకు ఉలికిపడింది? ఎందుకు అంత తీవ్రంగా స్పందించింది? అని ప్రశ్నించుకొంటే ఎవరు ఎంత నీతిమంతులో, ఎవరి పోరాటంలో ఎంత నిజాయితీ ఉందో అందరికీ అర్ధమవుతుంది. ఒకవేళ ఇప్పుడు అక్రమాలు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లయితే, ఆయన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయవచ్చును. ఇంకా అవసరమనుకొంటే కోర్టుకు కూడా వెళ్లి ఆ అక్రమాలను అడ్డుకోవచ్చును. ఆయనను ఎవరూ అడ్డుకోవడం లేదు. కానీ, ఆయన ఈ అంశాలను కూడా తన రాజకీయ లబ్ది కోసమే ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజలకు, రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిపోతోందని ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు కావవి. ఇక కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో విఫలమయినప్పటికీ ఇంకా తెదేపా, బీజేపీతో ఎన్డీయేతో అంటకాగుతూ డ్రామాలు ఆడుతోందని ఆక్షేపించారు. అంటే కేంద్రం నిధులు ఇవ్వకపోతే తక్షణమే తెదేపా బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారన్న మాట. అయితే అలా చేస్తే కేంద్రం నుండి భారీగా నిధులు వచ్చిపడిపోతాయా? లేక రాష్ట్రం ఇంకా నష్టపోతుందా? అని ఆలోచిస్తే నష్టపోయే అవకాశాలే ఎక్కువని ఎటువంటి రాజకీయ జ్ఞానం లేని వారు కూడా చెప్పగలరు. కానీ తనను తాను గొప్ప రాజకీయ మేధావిగా, రాష్ట్రం కోసం, ప్రజల కోసం పరితపించిపోయే గొప్ప వ్యక్తిగా భావించుకొంటున్న జగన్మోహన్ రెడ్డి, కేంద్రంతో తెగతెంపులు చేసుకోమని సలహా ఇస్తున్నారు! దేనికి? అనే ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి లేదా వైకాపా నేతలెవరూ సమాధానం చెప్పకపోవచ్చును. కానీ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మా ఎన్డీయే కూటమిలో చేరాలని కొందరు ఆరాటపడుతున్నట్లు కనబడుతోంది. ఒకవేళ తెదేపా మా కూటమి నుండి బయటకు వచ్చేస్తే వాళ్ళు లోపలకి ప్రవేశించాలని చూస్తున్నట్లుంది. కానీ అది అసంభవం. తెదేపా, బీజేపీల మధ్య మంచి బలమయిన స్నేహ సంబంధాలున్నాయి. రెండూ కలిసి రాష్ట్రాభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి కలిసి పనిచేస్తాయి,” అని చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి నేరుగా కేంద్రాన్ని ప్రశ్నించాలి. కానీ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఎందుకు? అంటే దానికీ వెంకయ్య నాయుడు సమాధానమే వర్తిస్తుంది. తను బీజేపీతో, కేంద్రంతో చాలా జాగ్రత్తగా, లౌక్యంగా కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు వ్యవహరిస్తూనే బీజేపీతో ఎన్డీయే ప్రభుత్వంతో తెదేపా కలిసిపనిచేయడాన్ని ఏదో పెద్ద నేరం అన్నట్లుగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మాటలు వింటుంటే తను చేస్తున్న ఈ రాజకీయాలను ప్రజలు గమనించడం లేదని, గమనించినా వారికి అర్ధం చేసుకొనే శక్తి లేదని భావిస్తున్నట్లుంది. వారికి ఆ శక్తి ఉందో లేదో ఎన్నికలలో చూపారు. ఇంకా గ్రహించలేకపోతే ఎవరు మాత్రం వైకాపాను ఆయన భారి నుండి కాపాడగలరు?

Sunday, 22 June 2014

ఇన్ని సమస్యలుంటాయా అనిపిస్తోంది : నాగార్జున


స్టార్ హోదా నుంచి టీవీ షోలలో స్టార్ లాంటి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తెలుగు వెర్షన్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కు హోస్ట్‌గా కొత్త వేషంలోకి హీరో నాగార్జున సులభంగానే పరకాయ ప్రవేశం చేశారు. ఈ నెల ప్రథమార్ధం నుంచి ‘మా’ టి.వి.లో ప్రసారమవుతున్న ఈ గేమ్ షో తొలివారంలో మంచి టి.ఆర్.పి.లు సాధించింది. సామాన్యులు సైతం సంపన్నులయ్యేందుకు అవకాశమిచ్చే ఈ షో గురించి నాగ్ తో జరిపిన సంభాషణ.  

 బుల్లితెరపై మీ తొలి షో ఇది. ఎలా ఉంది మీ అనుభవం?

 సినిమా ప్రపంచానికి పూర్తి భిన్నమైన వాతావరణాన్ని ఈ షో నాకు పరిచయం చేసింది. నన్ను నేను బెటర్ చేసుకోవడానికి ఈ షో ఉపకరించింది. స్టార్‌డమ్‌కి అతీతమైనది ఇది. ‘అన్నమయ్య’, ‘మనం’ చిత్రాల ఘనవిజయం ఎంత ఆత్మసంతృప్తినిచ్చిందో, ఈ ‘షో’ విజయం కూడా అంతే ఆత్మసంతృప్తినిచ్చింది.

 ఈ షో ద్వారా సామాన్య ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఎలా ఉంది?
 వాళ్ల సొంత మనిషిలా మారిపోయి, సమస్యలను వింటున్నాను. వాళ్ల సమస్యలను నా సమస్యలతో పోల్చుకుంటున్నాను కూడా. ఒక సినిమా పరాజయం పాలైతే తెగ బాధపడిపోతుంటాం. కొంతమందైతే నెలల తరబడి బయటకు రారు. రేపెలా గడుస్తుందోనని ఈ రోజు రాత్రి కంటి మీద కునుకు లేకుండా గడిపేవారి సమస్యల ముందు సినిమా ఫ్లాప్ అనేది చిన్న సమస్య అనిపిస్తోంది.

 పోటీలో పాలుపంచుకునేవారి సమస్యలు విన్న తర్వాత ‘వీళ్లు అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబితే బాగుంటుంది’ అనిపిస్తోందా?
 కొంతమంది జీవితం మొత్తం సమస్యలే. వాళ్లు ఎక్కువ డబ్బు గెల్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. ముఖ్యంగా క్లిష్టమైన ప్రశ్నలు అడిగినప్పుడు, ‘సమాధానం తెలిస్తే బాగుంటుంది’ అనే టెన్షన్ నాకు మొదలవుతుంది. ఇన్నేళ్లూ కష్టాలు పడ్డారు కదా.. కనీసం ఇక్కడైనా వాళ్ల కల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగని, ప్రశ్నలు ముందే లీక్ చేయలేను.. సమాధానాలు కూడా బయటపెట్టలేను. ఒక్కోసారైతే నాకు తెలియకుండా క్లూ ఇచ్చేస్తానేమో అనిపిస్తోంది. కానీ, అది చేయకుండా జాగ్రత్తపడతాను. రకరకాల వయసుల వాళ్ళను కలుసుకోవడం, వారి కష్టనష్టాలు వినడం వల్ల అందరి మనస్తత్వాలూ తెలుసుకునే వీలు కలుగుతోంది. సుబ్బలక్ష్మి గారనే పెద్ద వయసు ఆవిడైతే చాలా బాగా ఆడారు. చక్కగా జోక్‌లేసుకుంటూ సరదాగా సాగిందా ఎపిసోడ్. అందరితోనూ కనెక్ట్ కాగలుతున్నాను.

 ఈ షోలో పాల్గొన్న హెచ్‌ఐవీ పేషెంట్ భవాని జీవితం విన్నప్పుడు మీరు ఫీలైన వైనం స్పష్టంగా బుల్లితెర మీద కనిపించింది?
 భవానీ లైఫ్ విన్నప్పుడు నిజంగానే బాధ అనిపించింది. కానీ, తన ధైర్యం, ఆత్మవిశ్వాసం మాత్రం మెచ్చుకోదగ్గవి. తను 80వేల రూపాయలు గెల్చుకోవాలనే లక్ష్యంతో వచ్చింది. 40వేలు గెల్చుకుంది. కానీ, ఇక్కణ్ణుంచి ఊరు తిరిగి వెళ్లేసరికి తన ఇంటి చుట్టుపక్కలవాళ్లు, ఇంతకొంతమంది స్వచ్ఛందంగా ‘మీ అబ్బాయిలకు ఫీజు కట్టు’ అని డబ్బులిచ్చారట. ఆ డబ్బంతా కలిపితే 20వేలయ్యాయని, భవాని ఫోన్ చేసి చెబితే, చాలా ఆనందం అనిపించింది.

 ఈ షో చేయడం మొదలుపెట్టిన తర్వాత మనలో తెలియకుండా మార్పొస్తుందని అమితాబ్ మీతో అన్నారు కదా.. మరి, ఇప్పటివరకు చిత్రీకరించిన ఎపిసోడ్స్ ద్వారా మీలో ఏమైనా మార్పును గ్రహించారా?

 వెంటనే పూర్తిగా మార్పు రావడం జరగదు కానీ, పాల్గొంటున్నవారి మాటలు విన్నాక నా ఆలోచనా విధానంలో కొంత మార్పు వచ్చింది. ఎదుటి వ్యక్తుల పరిస్థితిని అర్థం చేసుకునే నేర్పు, అందరి సమస్యలూ వినే ఓర్పు వచ్చింది. ఎంతసేపూ మన సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ, ఈ షో ద్వారా ఇతరుల సమస్యలను తెలుసుకోవడం, ఆలోచించడం మొదలైంది. ‘ఇలా కూడా బతికేస్తున్నారా.. ఇన్ని సమస్యలుంటాయా’ అనిపిస్తోంది.

 పేదరికం అనుభవిస్తున్నవారి జీవితాల గురించి విన్న తరువాత అవి మిమ్మల్ని ఇంటివరకూ వెంటాడుతున్నాయా?
 నేను ఇంటికెళ్లేసరికి మా పిల్లలిద్దరూ ఇంట్లో ఉంటే, ‘ఎలా జరిగింది’ అని అడిగి తెలుసుకుంటారు. అమల ఒక్కతే ఉంటే, ఒకవేళ నేను డల్‌గా కనిపిస్తే, ‘ఇవాళ చాలా సమస్యలు విని ఉంటాను’ అని ఫిక్స్ అయిపోతుంది. తను అడిగి తెలుసుకుంటుంది. ఈ షో చేయడం ద్వారా నా కుటుంబంలోనే ఓ మార్పు కనిపిస్తోంది. నాగచైతన్యని, అఖిల్‌ని కూర్చోబెట్టి, ‘వాళ్ల నాన్న జీతం నాలుగు వేలట.. ఆ అబ్బాయి చాలా కష్టపడి చదువుకుంటున్నాడట’ అని చెబుతుంటాను. అదే నేను కావాలని వాళ్లకి ఏవేవో నీతులు చెబితే, ‘లెక్చర్ ఇస్తున్నాడు’ అనుకుంటారు. కానీ, స్వయంగా నేను విన్నవి చెప్పడంతో, వాళ్లు కూడా ‘ఇంతే సంపాదిస్తారా డాడీ... లైఫ్ ఇలా ఉంటుందా’ అంటున్నారు. సో.. ఈ షో మా కుటుంబానికి కూడా ఓ ఆదర్శమే. తల్లిదండ్రులు చెబితే పిల్లలు పెద్దగా వినరు. అదే, ఇలాంటి షోస్ చూస్తే, కొంతైనా స్ఫూర్తి పొందుతారు.

 మీరే కనుక ఈ పోటీలో పాల్గొంటే.. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగేవారా?
 లేదు. చాలా ప్రశ్నలకు నాకు జవాబు తెలియదు. అది అవగాహన లేక. ఉదయం నిద్ర లేచి పేపర్ చదవడం, ఖాళీ దొరికితే టీవీలు చూడటం.. అంతవరకే. బయటి ప్రపంచానికి చాలా దూరంగా ఉండటంవల్లే చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియడం లేదు. ఈ షో చేయడం ద్వారా మన భారతీయ చరిత్ర గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు హిస్టరీలో చదువుకున్నవి మర్చిపోతాం. అవన్నీ రీ కలక్ట్ చేసుకున్నట్లుగా ఉంది.

 ఫస్ట్ సీజన్ తర్వాత రెండోది కూడా కంటిన్యూ చేయాలనే ఆసక్తి ఉందా?
 ఇప్పటికైతే ఆ ఆసక్తి ఉంది. ఈ షో చేసే అవకాశం నాకు కాకుండా, మరో హీరోకు వచ్చి ఉంటే, కచ్చితంగా బాధపడేవాణ్ణి. ఈ ఫస్ట్ సీజన్ 45 ఎపిసోడ్స్‌తో ముగుస్తుంది. ఆ తర్వాత కచ్చితంగా ఏదో మిస్సయిన ఫీలింగ్ కలగక మానదు.

భారత్‌కు స్విస్ ఖాతాదారుల వివరాలు!