Friday, 14 March 2014

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం ఆనందాన్ని ఇచ్చింది ..అభిమానులు


హైదరాబాద్, మార్చి 14: పవన్ కళ్యాణ్ పార్టీ కాసేపట్లో ప్రకటిస్తున్న సందర్భంగా ఆయన అభిమానుల మనోగతాన్ని తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ అభిమానులు రాష్టవ్యాప్తంగా ఈ విధంగా స్పందించారు. వారి స్పందన ఇలా ఉంది క్లుప్తంగా ...పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానమే కాదు ఆయనంటే నమ్మకం కూడా ఆయన సినిమాల్లో ఎలా విజయం సాధించాడో రాజకీయాల్లో కూడా రానిస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య అంటే ఎంతో అభిమానం. అయితే ఎవరి ఆలోచన వారిది. పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తిత్వం ఉన్నా వ్యక్తే కాదు కార్యదీక్షా పరుడు. ఆయన తాను ఏదైతే నమ్ముతాడో దాన్నే ఆచరిస్తారు కూడా పవన్ కళ్యాణ్ పార్టీ ని మేము ముందుకు నడిపిస్తాము. ఆయన తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తను ఒక్కడే ఒన్ మ్యాన్ ఆర్మీ లాగా ముందుకు తీసుకు వెళతాడు. పవన్ కళ్యాణ్ లాంటివాడు మన దేశంలో ఎవరూ లేరు.అంటూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

నా పార్టీ పేరు జనసేన: పవన్ కళ్యాణ్


హైదరాబాద్: గొప్పగా బతకాలని తానెన్నడూ ప్రయత్నం చేయలేదని, సామాన్యుడిలా బతకాలనుకున్నానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. తాను రాజకీయాల నుంచి మాట్లాడతానగానే తనను ఇష్టం వచ్చినట్టు తిట్టారని అందుకే పార్టీ పెట్టానని వెల్లడించారు. తన పార్టీ పేరు 'జనసేన' అని ప్రకటించారు. తన పార్టీ విధివిధానాలు తర్వాత వెల్లడిస్తానని చెప్పారు. తాను పార్టీ పెడుతున్నట్టు తన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ తెలియదన్నారు. పదవుల పట్ల తనకు వ్యామోహం లేదన్నారు. అన్నయ్య చిరంజీవిపై కోపం ఉండదన్నారు. తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యకు ఎదురెళ్లను అన్నారు. ఢిల్లీ వాళ్ల కాళ్లు పట్టుకునే బానిసను కాదన్నారు. పదవులపై తనకు మోజు లేదన్నారు. పదవులు నాకు చాలా తుచ్ఛమైనవి అన్నారు.

Wednesday, 19 February 2014

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన?


హైదరాబాద్ : రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలనపై కేంద్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు రానున్న రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా నియమించే సాహసం కాంగ్రెస్‌ చేస్తుందనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం రాష్ట్రపతి పాలనే. మరీ గవర్నర్‌ ఎలాంటి సిఫార్సు చేస్తారో చూడాలి. రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకుల్ని చూసిన ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారి 1973 జనవరి 11న రాష్ట్రపతి పాలన విధించారు. నాడు విధించిన పాలన డిసెంబర్‌ 10, 1973 వరకు కొనసాగింది. ఆ తర్వాత బహుశా మళ్లీ ఇప్పుడు ఆ పరిస్థితి తలెత్తింది. నాడు పీపీ నరసింహరావు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. మరో వైపు రాష్ట్రపతి పాలన అనివార్యమైతే రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను మార్చే అవకాశం ఉంది. అదే జరిగితే రాష్ట్ర గవర్నర్‌గా హన్స్‌రాజ్‌ భరద్వాజ్‌ లేదా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను నియమించే అవకాశం ఉంది.

Tuesday, 18 February 2014

అందుకే పవన్‌కల్యాణ్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం!


ఇందపరంద ఇంద చాట... కాట్రవల్లీ... లచ్చిమీ లచ్చిమీ... బాగున్నారా బాగున్నారా... అంటూ తెరపై అలీ చేసే చిన్నెలు ఒకటా రెండా! నవ్వించడం కోసమే దేవుడు పుట్టించాడా? అన్నట్టుగా ఉంటుంది అలీ ఫేస్‌కట్. ఊహ తెలిసినప్పట్నుంచీ ఆయన నవ్విస్తూనే ఉన్నారు. సంతోషానికి సూచిక నవ్వు. చిన్నప్పట్నుంచీ ఆ నవ్వుతోనే తన సావాసం. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి. 34 ఏళ్ల సుదీర్ఘ నట ప్రస్థానం.. వెయ్యికి పైగా సినిమాలు.. అందులో యాభై హీరోగా. బహుశా ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న కమెడియన్ ఎవరూ లేరేమో! నటన అలీలోని ఓ కోణం. తండ్రి పేరు మీద స్వచ్చందంగా సేవాకార్యక్రమాలు నిర్వహించడం అలీలోని రెండో కోణం. ఈ నెల 21న ఆయన కథానాయకునిగా నటించిన ‘అలీబాబా ఒక్కడే దొంగ’ సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో విలేకరులతో ముచ్చటించారు అలీ.

ఇదే ప్రదేశంలో...

1994లో ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశంలోనే (అన్నపూర్ణ స్టూడియో) ‘యమలీల’ ఓపెనింగ్ జరిగింది. ఆ ముహూర్తం వేళా విశేషమో ఏమో... యాభై సినిమాల్లో హీరోగా చేశాను. మళ్లీ అదే ప్రదేశంలో నా 50వ సినిమా ‘అలీబాబా ఒక్కడే దొంగ’ చిత్రీకరణ పూర్తయింది. సెంటిమెంట్ ప్రకారం తప్పకుండా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం.



ఆ క్వాలిటీనే పవన్‌కి నచ్చి ఉంటుంది...

 చిరంజీవిగారి ‘ముగ్గురుమొనగాళ్లు సినిమా సమయంలో నాకు పవన్‌కల్యాణ్ పరిచయమయ్యారు. అప్పుడు నేను మద్రాస్‌లో ఉండేవాణ్ణి. ఆయన తొలి, మలి సినిమాలు ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’, ‘గోకులంలో సీత’ల్లో నేను లేను. ‘సుస్వాగతం’ మేం కలిసి నటించిన తొలి సినిమా. ‘తొలిప్రేమ’లో మా ఇద్దరిపై సన్నివేశాలెక్కువ. అలా మా స్నేహం బలపడింది. ఇక అప్పట్నుంచి పవన్ చేసిన ప్రతి సినిమాలో నేనున్నా. మా ఇద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని చాలామంది అంటుంటారు. బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మనిషి పవన్‌కల్యాణ్. అమ్మ, నాన్న. అన్న... ఇలా ప్రతి బంధాన్నీ ప్రేమిస్తాడు. దాదాపు నేనూ అంతే. నా కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తా. నాలోని ఆ క్వాలిటీనే పవన్‌కి నచ్చి ఉంటుంది. అందుకే మేమిద్దరం మిత్రులమయ్యాం.

23ని.ల్లో..: మూజువాణితో తెలంగాణకు ఆమోదం


న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)కు లోకసభ మంగళవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. సీమాంధ్ర ప్రాంత నేతల ఆందోళన మధ్యనే బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపింది. అంతకుముందు బిజెపి తీరుపై సస్పెన్స్ కొనసాగినా బిల్లుకు మద్దతు పలికింది. తాము అధికారంలోకి వచ్చాక సీమాంధ్రకు న్యాయం చేస్తామని ప్రకటించింది. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, లోకసభ ప్రతిపక్ష సభ్యురాలు సుష్మా స్వరాజ్, తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిలు మాట్లాడారు. లోకసభలో సవరణల వారీగా ఓటింగ్ కూడా జరుగుతోందని సమాచారం. కాగా, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును చర్చకు ప్రవేశపెట్టిన నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుకు తాము సంపూర్ణంగా మద్దతిస్తామని బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బిఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి అన్నారు. మంగళవారం పార్లమెంట్ వాయిదా అనంతరం ఆమె లోక్‌సభ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు న్యాయపూరితమైనదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోని బడుగు బలహీన వర్గాలు అత్యంత వెనుకపడ్డాయని ఆమె అన్నారు. ఉత్తర ప్రదేశ్‌ను కూడా నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి డిమాండ్ చేశారు. తాము చిన్న రాష్ట్రాలకు ఎప్పుడు అనుకూలమని, కేంద్రం యూపిని కూడా విభజిస్తే పరిపాలన సుగమం అవుతుందని ఆమె అభివర్ణించారు. మహారాష్ట్రలో కూడా విదర్భా రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్లు ఉన్నాయని ఆమె అన్నారు.

Saturday, 15 February 2014

earn money from home by just clicking it


Use the link below to generate traffic and earn money 10$ for every unique visitor that clicks your link and visit it. Good places to start posting your link are social websites like Facebook, Twitter, Google+, Youtube, forums, chat rooms, blogs, etc. We Recommends you to Make your referral link Short first before start it promoting

,http://EarnActivity.com/index.php?share=430

Wednesday, 5 February 2014

బెజవాడ నుంచి నాగార్జున భార్య అమల పోటీ?


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌పై బిజెపి నాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలహీనపడుతున్న నేపథ్యంలో బిజెపి బలం పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడి సాధ్యమైనంత మందిని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి, కేంద్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బిజెపి కీలకంగా భావిస్తోంది. ఓ వైపు ఇప్పటికే కృష్ణంరాజు బిజెపికి గూటికి చేరారు. తాజాగా, నాగార్జున సతీమణి అమలను పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడ లోకసభ స్థానం నుంచి నాగార్జున భార్య అమలను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విజయవాడ పార్లమెంటు సీటు నుంచి కాంగ్రెసు పార్టీ తిరిగి లగడపాటి రాజగోపాల్‌ను బరిలోకి దింపుతుందా, లేదా అనేది అనుమానంగానే ఉంది. అయితే, లగడపాటి ఆ సీటును వదులుకుంటారా అనేది కూడా చెప్పలేం. తెలుగుదేశం పార్టీ నుంచి కేశినేని నానికి ఇప్పటికే సీటు ఖరారైందని అంటున్నారు. అమలను పోటీకి దింపడం ద్వారా ఒకే వర్గానికి చెందిన నాయకుల మధ్య పోటీ రసవత్తరంగా జరుగుతుందని భావిస్తున్నారు.

Thursday, 30 January 2014

ఆశారాం బాపు సంపద రూ. 10 వేల కోట్లు


సూరత్: కుబేరుడికే కళ్లుతిరిగేలా.. కార్పొరేట్లకే ఈర్ష్య పుట్టేలా స్వామీజీ ఆశారాం బాపు ఆస్తులు కూడగట్టారు. అదంతా పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఇప్పుడు బయటకి వస్తోంది. ఇప్పటి వరకూ లెక్కించిన ఆయన సంపద విలువ దాదాపు రూ. 10 వేల కోట్లు ఉందని గురువారం పోలీసులు చెప్పారు. ఆయన ఆశ్రమంపై దాడి చేసిన సందర్భంలో లభించిన డాక్యుమెంట్లను పరిశీలించగా.. బ్యాంకు ఖాతాలు, షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్ల రూపంలో ఆశారాం సొమ్ము రూ. 9 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఉంటుందని సూరత్ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్తానా విలేకరులకు తెలిపారు. దీనిలో దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న భూముల విలువ కలపలేదన్నారు. మరిన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, అప్పుడు ఆయన సంపద విలువ మరింత పెరగవచ్చని సీపీ తెలిపారు. ఈ విషయంలో లోతైన విచారణ కోసం సీబీడీటీ, ఐటీ, ఈడీలకు విన్నవించామని ఆయన చెప్పారు. కొన్ని నెలల క్రితం అహ్మదాబాద్‌లోని ఆయన ఆశ్రమ భవనంలో సోదా చేసిన సందర్భంగా 40 పెద్ద సంచుల నిండుగా ఉన్న వేలాది డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వాటి ఆధారంగానే గుజరాత్‌లోని 45 ప్రాంతాల్లో ఆయనకు భూములున్నట్లు, అంతేగాక రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా భూములు సంపాదించినట్లు బయటపడిందని సీపీ రాకేష్ వెల్లడించారు. మరిన్ని చోట్ల ఆయన ఇంకా డాక్యుమెంట్లు దాచి పెట్టారా అనే విషయం పరిశీలించాల్సి ఉందన్నారు. కాగా, లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న 72 ఏళ్ల ఆశారాం బాపు జోధ్‌పూర్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా అలాంటి కేసులోనే జైలు పాలయ్యారు