Saturday, 16 November 2013
మీడియా రంగంలో మరో సంచలనానికి రెడీ అవుతున్న చిరంజీవి !
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో ప్రతి ప్రముఖ రాజకీయ నాయకుడి వెనుక ఒకో ఛానల్ దన్నుగా పనిచేస్తోంది అన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఇప్పటి వరకు మా నెట్ వర్క్ ఎంటర్ టైన్మెంట్ చానల్ లో తనపట్టును నిలుపుకున్న మెగా పొలిటికల్ స్టార్ చిరంజీవి ఒక న్యూస్ ఛానల్ ఏర్పాటు వైపు అడుగులు వేస్తున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభుతో కలిసి ఒక న్యూస్ చానల్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాడు అని అంటున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజులలో తులసి సీడ్స్ రామచంద్ర గుంటూరు జిల్లలో ప్రస్తుత మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తో పోటి చేసి ఒడి పోయారు.చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం ఉన్న రామచంద్ర ప్రస్తుతం చిరంజీవితో కలిసి కాంగ్రెస్ పార్టీలో కోసగుతున్నారు. మద్రాస్ ఐ .ఐ . టి . లో మేకానికల్ ఇంజనీరింగ్ చేసిన రామచంద్రకు చిరంజీవితో కలిసే న్యూస్ ఛానల్ పెట్టాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందట. ప్రస్తుతం రాష్ట్రంలో 19 న్యూస్ చానెల్స్ ఉన్న నేపధ్యం లో ఈ న్యూస్ ఛానల్ ను చాలా వినూత్నంగా తీర్చిదిద్దాలని చిరంజీవి ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఛానల్ రాబోయే జనవరి 26 నుండి ప్రారంభం అవుతుందని టాక్. చిరంజీవి రాజకీయ భవిష్యత్ కు ఈ ఛానల్ ఎంత వరకు ఉపకరిస్తోందో చూడాలి.
Thursday, 14 November 2013
నా కూతురు ని తలచుకుంటేనే భయమేస్తోంది: సూర్య
చెన్నై : 'భవిష్యత్తు సమాజంలో నా కుమార్తెను వూహిస్తేనే భయమేస్తోంద'ని తమిళ స్టార్ హీరో సూర్య ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా తమిళంలో తెరకెక్కిన 'మాలిని 22 పాలయం' చిత్ర ఆడియో వేడుకలో ఆయన పాల్గొన్నారు.
ప్రస్తుత నేరాలను ప్రస్తావిస్తూ... భవిష్యత్తులో తన కుమార్తె పరిస్థితిని సమాజపరంగా ఊహిస్తేనే శరీరం భయంతో కంపించిపోతోందన్నారు. ఇప్పటి పరిస్థితుల ఆధారంగా మున్ముందు ఈ ప్రభావం మరెంత తీవ్రంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో చూపించిన విషయాలు సమాజంలోని నిజ దృశ్యాలుగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక 'మాలిని 22 పాలయం' చిత్రానికి నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో పాటు తమిళంలోనూ విడదుల చేస్తున్నారు. తమిళంలో ఈచిత్రాన్ని ‘22 మాలిని పాళయం కోట్టై' పేరుతో విడుదల చేయనున్నారు. ఇది మహిళలపై బలాత్కారం ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం అని తెలుస్తోంది. 2012లో మళయాలంలో వచ్చిన ‘22 ఫిమేల్ కొట్టాయం' చిత్రానికి ఇది రీమేక్. ప్రస్తుతం దేశంలో స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో....ఈ చిత్రం ఒక సందేశాత్మకంగా, మేలుకొలుపుగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నమైన కథాంశం కావడంతో ఇది తన కెరీర్‌కు ప్లస్సవుతుందని నిత్యామీనన్ ఆశిస్తోంది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది.
సచిన్ కోసం కామెంటేటర్‌గా మారిన మిస్టర్ పర్ఫెక్ట్!
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వీరాభిమానుల్లో ఒకరైన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సచిన ఆడుతున్న 200వ టెస్టు, చివరి టెస్టు మ్యాచ్ చూసేందుకు ఈ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంకు చేరుకున్నారు. కేవలం మ్యాచ్ చూడటం మాత్రమే కాదు....కామెంట్రీ బాక్సులో కూర్చుని కామెంటేటర్‌గా మారాడు అమీర్ ఖాన్. మైక్ అందుకున్న అమీర్ ఖాన్...ఇండియన్ క్రికెట్గాడ్ను పొగడ్తలతో ముంచెత్తాడు. త్వరలో ‘ధూమ్-3' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అమీర్ ఖాన్....ఇటీవల విడుదలైన తన సినిమా సాంగ్ ‘ధూమ్ మచాలే'ను సచిన్‌కు అంకితం చేసిన సంగతి తెలిసిందే. అమీర్ లాంటి స్టార్ కామెంటేటర్‌గా మారడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.చాలా ఏళ్ల నుంచి అమీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. సచిన్ గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ...సచిన్ కేవలం గొప్ప ఆటగాడు మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన తన ఆటతో దేశ కీర్తి ప్రతిష్టలు పెంచాడు. కోట్లాది మంది భారతీయులకు ఆదర్శంగా నిలిచాడు' వ్యాఖ్యానించారు. ‘సచిన్ లాంటి స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ అంటే క్రికెట్ అభిమానులకు వెలితిగా ఉండటం సహజమే. కానీ సచిన్ చివరి మ్యాచ్‌ను అభిమానులంతా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు' అని అమీర్ ఖాన్‌ను అన్నారు. సచిన్ లాస్ట్ ఇన్నింగ్స్ బెస్ట్‌గా ఉండాలని ఆకాక్షించాడు. సచిన్‌కు తాను అభిమానిని అని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోయాడు ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్!
హీరో నాని పై సెటైర్లు వేసిన చంద్రబాబు !
ఎప్పుడు చాలా సీరియస్ గా ఉండే తెలుగు దేశం అధినేత చంద్రబాబు తన పద్ధతి మార్చి నవ్వుతు నిన్న జరిగిన ‘ప్రతినిధి’ ఆడియో వేడుకలో అందరిపైన సెటైర్లు వేయడం నిన్న ఆ కర్యక్రమానికి వచ్చిన చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఇక వివరాలలోకి వెళితే హీరో నాని నిన్న జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు ఈ సినిమా దర్శకుడు ప్రవీణ్ మంచి స్నేహితుడని చెపుతూ తామిద్దరం గతంలో సనత్ నగర్ లో రైల్వే ట్రాక్ పక్కన కుర్చుని చాలా కబుర్లూ, కధలూ చెప్పుకున్నామని అంటూ అలాంటి స్నేహితుడు ప్రవీణ్ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్నాడు కాబట్టి అతదికోసమే ఈ ఆడియో వేడుకకు వచ్చానని చెపుతూ తన స్నేహితుడు ప్రవీణ్ ఫస్ట్ టైమ్ పెళ్ళి చేసుకోబోతున్నాడని వ్యాఖ్యానించాడు.దీనికి నానీ పక్కన కూర్చున్న చంద్రబాబునాయుడు నవ్వుతూ స్పందిస్తూ పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే అలాంటిది ఫస్ట్‌టైమ్ పెండ్లి చేసుకోబోతున్నాడని హీరో నాని అనడం ఆశ్చర్యంగా ఉందని నారాచంద్రబాబునాయుడు అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం కుటుంబ విలువలు అందరు గౌరవిస్తారని అని అంటూ అలాంటి విలువలను తాను గౌరవిస్తాను అని అంటు అమెరికాలో 18 ఏళ్ళకే ఇంటి నుంచి వెళ్ళిపోతారు. ఎప్పుడోగానీ, తల్లిదండ్రుల్ని చూడడానికి రారు. అక్కడ భార్య, భర్త విడివిడిగానూ ఉంటారు. 'అవర్ చిల్డ్రన్. యువర్ చిల్డ్రన్ ఈజ్ మై చిల్డ్రన్' అనేది అక్కడ పాలసీ. కానీ మనది విలువలగల దేశం. దాన్ని మనం కాపాడాలి అని అంటు తాను ఎప్పుడూ విలువలకు గౌరవం ఇస్తా అని చెపుతూ ప్రస్తుత యువతరం కూడా అలాగే ఉండాలని సూచిస్తూ ఫస్ట్ మేరేజ్, సెకండ్ మేరేజ్ అనే పదాలు వాడద్దని హీరో నానీకి చంద్రబాబు చురక అంటించారు దీనితో నాని ఆ మాటలు తత్తరపాటుతో అలా అన్నానని చంద్రబాబుకు వివరణ ఇచ్చు కున్నాడు. ఈ మాటలు విన్న వారంతా ఆనందంగా నవ్వుకున్నారు.
Subscribe to:
Posts (Atom)





















































