Wednesday, 6 November 2013
పెళ్ళికి రెడీ అయిన హీరోయిన్
ఈ మద్య హీరోయిన్స్ అందరు వరుసగా పెళ్ళికి రెడీ అవుతున్నట్టు ఉన్నారు. లేటెస్ట్ గా ప్రియమణి, అనుష్క, నిషా అగర్వాల్.... వంటి తారలు పెళ్లిళ్లకు రెడీ అయిపోతున్నారు. ఇదే కోవలో ఇప్పుడు మరో అందాల హీరోయన్ భావన కూడా పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. 'మహాత్మ' సినిమాలో శ్రీకాంత్ పక్కన కథానాయికగా నటించిన ఈ మలయాళ ముద్దుగుమ్మకు ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు లేవు దాంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టుంది. ఇంట్లో వాళ్ళు కూడా పెళ్ళిసంబందాలు చూస్తున్నారని, త్వరలోనే ఈమె పెళ్ళి జరిగే అవకాశం ఉన్నట్టు చెన్నైలో వినిపిస్తుంది.
డిసెంబర్ నుండి గబ్బర్ సింగ్ 2 ?
అత్తారింటి దారేది బ్లాక్ బస్టర్ తరువాత పవన్ అభిమానుల దృష్టి అంతా ‘గబ్బర్ సింగ్-2’ పై పడింది. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనర్ పై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పవన్ చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆలస్యం జరుగుతోందని, ఈ సినిమా అఫీషియల్ లాంచ్ డిసెంబర్ 28 నుంచి ఉంటుందని, హీరోయిన్ తదితర సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో తెలియచేస్తామని దర్శకుడు తెలిపాడు. ఈ సినిమా టైటిల్ కూడా గబ్బర్ సింగ్ 2 నే ఉంటుందని తెలిసింది.వోల్వో ప్రమాదం: కెమికల్స్ వొట్టిదే, కల్వర్ట్ పైపు వల్లే
మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల జరగిన జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాద ఘటనపై విచారణ మంగళవారం పూర్తయింది. బస్సులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని క్లూస్ టీమ్ ధ్రువీకరించింది. బస్సు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీకొనటం వల్లే మంటలు చెలరేగినట్లు బృంద సభ్యులు మంగళవారమిక్కడ తెలిపారు.
జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు కల్వర్టును ఢీకొట్టి 45 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. గతనెల 30వన కొత్తకోట మండలం పాలెం గ్రామ శివారు ప్రాంతంలో ప్రమాదం జరిగిన నాటినుంచి పోలీసులు మంగళవారం వరకూ ఆధారాలను సేకరించారు. దర్యాప్తు చేసిన అంశాల ఆధారంగా క్లూస్ టీమ్ మహబూబ్‌నగర్ ఎస్పీకి ఓ నివేదికను సమర్పించారు.బస్సు వేగంగా కల్వర్టును ఢీకొట్టిందని, కల్వర్టు పైపు డీజిల్ ట్యాంక్‌లోకి చొచ్చుకుపోవడం వల్ల మంటలు చెలరేగాయని క్లూస్ టీమ్ తన నివేదికలో తెలిపింది. మంటలు లగేజీ విభాగానికి తాకడంతో ప్రమాదం తీవ్రతను సరిగా అంచనా వేయలేకపోయారని చెప్పారు. బస్సులో రసాయనాలు గానీ, పేలుడు పదార్థాలు గానీ లేవని క్లూస్ టీమ్ తేల్చింది. కాగా, ఇప్పటి వరకు బస్సు ప్రమాదంలో మరణించినవారి 34 మందిని గుర్తించారు. గుర్తు పట్టలేకుండా కాలిపోవడంతో డిఎన్ఎ పరీక్షలు నిర్వహించి, మృతులను గుర్తిస్తున్నారు. బస్సులో రసాయనాలు ఉండి ఉండవచ్చునని మంగళవారంనాడు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను క్లూస్ టీమ్ కొట్టిపారేసింది.
మహేష్ బాబును వాడుకుంటున్న ప్రియమణి!
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లోని సీన్లను, డైలాగులను, పాటలను వాడుకోవడం ఈ మధ్య కామన్ అయింది. తాజాగా ‘చండీ' చిత్రంలో మహేష్ బాబు ‘అతడు' చిత్రంలోని డైలాగును ఉన్నదున్నట్లు వాడేసారు. తాజాగా విడుదలైన చండీ టీజర్లో ‘సముద్రాన్ని చూడాలనుకో తప్పు లేదు...కానీ సునామీని చూడాలనుకోకు చచ్చిపోతావ్' అంటూ ప్రియమణి డైలాగ్ ఇరగదీసింది. ఇది బాగా పాపులర్ అయిన డైలాగు కావడంతో మహేష్ బాబు సినిమా డైలాగని ఇట్టే పసిగట్టేస్తున్నారు ప్రేక్షకులు. అయితే మరి ఈ డైలాగు కావాలని పెట్టారో? కాకతాళీయంగా జరిగిందో తెలియాల్సి ఉంది.
ఇక చండీ సినిమా వివరాల్లోకి వెళితే...ప్రియమణి టైటిల్ పాత్రలో కృష్ణంరాజు ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'చండీ'. 'వి.సముద్ర' దర్శకత్వంలో 'ఒమిక్స్ క్రియేషన్స్' పతాకంపై జి.జగన్నాథనాయుడు సమర్పణలో డాక్టర్ శీనుబాబు నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు వి.సముద్ర.. 'అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించాలన్న కృష్ణంరాజు ఆశయం మా చిత్రం ద్వారా నెరవేరినందుకు ఆనందంగా ఉంది.ఇద్దరు మాస్ నటులైన కృష్ణంరాజు, శరత్‌కుమార్‌ల అభినయం మధ్య కథానాయిక నిలబడటమంటే మాటలుకాదు. ప్రియమణి ఆ పోటీని కూడా తట్టుకుని తన పాత్రకు న్యాయం చేసింది' అని అన్నారు. నిర్మాత శీనుబాబు.. 'రెండు పెద్ద సినిమాల అనంతరం విడుదల చేద్దామనే వేచి చూశాం. యాక్షన్, మంచి మెసేజ్ ఇంచే చిత్రంగా 'చండీ' నిలుస్తుంది. ప్రస్తుత సమాజంలో మహిళలు ఎలా జీవించాలో అన్న అంశాన్ని ఇందులో ఆవిష్కరించాం'అని అన్నారు. మహిళలకు ఎంతో స్ఫూర్తినిచ్చేంతంగా ఈ చిత్రముంటుందని సహ నిర్మాత సత్య ముమ్మిడి తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: కరణం పి. బాబ్జీ, ఛాయాగ్రహణం: వాసు, సంగీతం: ఎస్ఆర్ శంకర్, చిన్నా అందించారు.
ఇబ్బంది పెడితే దేశం విడిచిపోతా : కమల్ హాసన్
కమల్ హాసన్ తెరకెక్కించిన ‘విశ్వరూపం' చిత్రం విడుదల సందర్భంగా తమిళనాడులో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో తెలిసిందే. ఆ ఘటనతో తీవ్ర మనస్తాపానికి చెందిన ఆయన అప్పట్లో సంచలన ప్రకటన చేసారు. ‘నన్ను మరిత ఇబ్బంది పెడితే వేరే రాష్ట్రానికో, వేరే దేశానికో వెళ్లి పోతా' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం విశ్వరూపానికి సీక్వెల్ గా ‘విశ్వరూపం 2' చిత్రం రాబోతోంది. ఈ చిత్రాన్ని కూడా కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మళ్లీ అలాంటి ఇబ్బందులు ఎదురయితే ఏం చేస్తారు? అనే ప్రశ్నకు కమల్ హాసన్ స్పందిస్తూ....‘నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. ఎంఎఫ్ హుస్సేన్ మాదిరి విదేశాల్లో స్థిరపడతాను. ఇది బెదిరింపు కాదు..రాజీనామా. ఎక్కడికి వెళ్లినా మాతృ దేశాన్ని మరిచిపోను' అని సమాధానం ఇచ్చారు.
విశ్వరూపం 2 సినిమా వివరాల్లోకి వెళితే...విశ్వరూపం చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. 'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. విశ్వరూపం'-2 చిత్రాన్ని ఆస్కార్ వి.రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది.దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం. ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు. తొలుత దీపావళికి విడుదల చేయాలనుకున్నారు కానీ... అదే సమయంలో అజిత్ నటించిన ‘ఆరంభం' చిత్రం విడుదలైంది. ఈ నేపథ్యంలో డిసెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట. మేజర్ వసీం ఆహ్మద్ కశ్మీరి పాత్రను కమల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ తల్లి పాత్రను బాలీవుడ్ నటి వహిదా రహ్మన్ పోషిస్తుండగా, రాహుల్ బోస్, పూజా కుమార్, శేఖర్ కపూర్, ఆండ్రియా జెర్మియాలు నటిస్తున్నారు.
Tuesday, 5 November 2013
అఖిల్ 'లవ్ గేమ్' అలా మొదలైందా..!?
కింగ్ నాగార్జున అందాల భామ అమల ముద్దుల కొడుకు... అఖిల్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే సినీ హీరోకి కావాల్సిన ట్రెయినింగ్ అంతా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్... అఖిల్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ సెన్సేషన్ సృష్టించాలనే లక్ష్యంతో ప్లాన్ తయారు చేసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అఖిల్ తో త్రివిక్రమ్ మూవీ కొందరు... రూమర్ అనే వాళ్ళు ఉన్నారు. ఇంతకూ అఖిల్ ఈ ఏడాది తెరంగేట్రం చేస్తే ఫస్ట్ మూవీలో హీరోయిన్ ఎవరు..? ఆమె హైదరాబాదీయా? లేక ఎప్పటిలాగానే మేడిన్ ముంబయా సరుకా? దీనిపై రకరకాల కథనాలు వస్తున్నాయి.
అఖిల్ సరసన అలనాటి ప్రముఖ హీరోయిన్ కూతురు హీరోయిన్ గా ఎంపిక చేయాలనే ఆలోచన సాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే... టీనేజ్ లో ఉన్న అఖిల్ కు ఇంతకు ముందే ఆ ముద్దుగుమ్మతో బాలివుడ్ క్రికెట్ మ్యాచ్ సమయంలో పరిచయం జరిగినట్టు తెలుస్తోంది. అదే తర్వాత దోస్తీగా మారినట్టు... అదే మూవీలో లవ్వాటకు సీన్ క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరూ పరిచయస్తులైతే... తెరపై లవ్ కెమిస్ర్టీ బాగా పండుతుందనేది మూవీ ఎక్సపర్ట్స్ ఆలోచన. అందుకే అఖిల్ జోడీగా అలనాటి హీరోయిన్ కూతురుని ఎంపిక చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే అఖిల్ లవ్ సీన్స్ రొమాంటిక్ గా ఉంటాయా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మాదిరిగా ఆ జంట తెలుగు తెరపై పదికాలాలపాటు సక్సెస్ జోడీ అవుతుందా? నాగ చైతన్య '100% లవ్' మాదిరిగా యూత్ ఫుల్ సబ్జెక్టా..? ఏమిటనేది అంతా సస్పెన్స్... అఖిల్ మూవీ వచ్చాకే లవ్ స్టోరీ కథ తెలుస్తుంది..!‘పల్నాడు’ లో ‘అత్తారింటికి దారేది ’ సీన్
అదేంటి విశాల్ తాజా చిత్రం ‘పల్నాడు' లో సూపర్ హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది ' ఉండటమేంటి..దానికి విజిల్స్ పడటం ఏంటీ అని డౌట్ పడుతున్నారా... అది నిజమే. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం రిలీజైన రోజు మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సినిమా డల్ గా నడుస్తున్న సమయంలోనూ జనం విజిల్స్ తో థియోటర్ మారు మ్రోగింది అంటే దానికి కారణం ఓ సన్నివేశంలో ‘అత్తారింటికి దారేది ' ని చూపెట్టడమే. ‘పల్నాడు' సెకండాఫ్ లో...విలన్ ...ఓ రాజకీయనాయకుడుని థియోటర్ లో కలుసుకునే సీన్ ఉంది.ఆ సీన్..జరిగే థియోటర్ లో...అత్తారింటికి దారేది చిత్రం ప్రదర్శింపబడుతూంటుంది. విలన్ ...పొలిటీషియన్ తో మాట్లాడేటప్పుడు... అత్తారింటికి దారేది సీన్స్... కనపడతాయి. అప్పటివరకూ డల్ గా ఉన్న థియోటర్ ఈ సీన్ తో ..పవన్ కనపించటంతో ఉషారు వచ్చింది. పందెం కోడి, భరణి, వాడు వీడు, వెంటాడు వేటాడు వంటి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశాల్ తొలిసారి విశాల్ ఫిలింఫ్యాక్టరీని స్థాపించి స్వయంగా నిర్మించిన ద్విభాషా చిత్రం ‘పల్నాడు'. ‘నా పేరు శివ' ఫేం సుశీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘గజరాజు' ఫేం లక్ష్మీమీనన్ హీరోయిన్. విశాల్ అంటే పదిమందిని ఒక్కడే తంతాడు. ఇదీ జనాల్లో ఉన్న ఇమేజ్. దానికి దూరంగా చేసిన తొలి ప్రయత్నమిది. దాదాపు పదేళ్ల తర్వాత నా ఇమేజ్‌కి పూర్తి ఆపోజిట్ పాత్రలో కనిపిస్తున్నా. కొట్టాలంటే భయపడే కుర్రాడిగా ఈసారి కనిపిస్తున్నా. నా కెరీర్లో మర్చిపోలేని పాత్ర ఇది అన్నారు విశాల్.
Subscribe to:
Posts (Atom)






