తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలోని వలుక్కచేరి బాణాసంచా కర్మాగారంలో శుక్రవారం జరిగిన పేలుళ్లలో 8 మంది కార్మికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది కార్మికులు గాయపడ్డారు. కార్మికులు తమ విధులు నిర్వహిస్తున్న సమయంలో బాణాసంచా కర్మాగారంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు సమయంలో భారీ మంటలు వెలువడ్డాయి. కాగా పేలుడు ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాట్నా పేలుళ్ల నిందితుల్లో ఒకరు మృతి పాట్నా: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గత ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో చేపట్టిన హుంకార్ ర్యాలీ సందర్భంగా సంభవించిన బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు అయినిల్ అలియాస్ తారిఖ్ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పాట్నా రైల్వేస్టేషన్లో ఆదివారం ఉదయం బాంబు అమరుస్తున్న సమయంలో పేలడంతో తారిఖ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన తారిఖ్‌ను పోలీసులు పాట్నాలోని ఇందిరాగాంధీ మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చికిత్స చేయించారు. చికిత్స పొందుతున్న తారిఖ్ శుక్రవారం ఉదయం మృతి చెందారు. కాగా గాంధీ మైదాన్ ప్రాంతాల్లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా, 83మంది గాయాలపాలయ్యారు.
Friday, 1 November 2013
బాణాసంచా కర్మాగారంలో పేలుడు, 8మంది మృతి
తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలోని వలుక్కచేరి బాణాసంచా కర్మాగారంలో శుక్రవారం జరిగిన పేలుళ్లలో 8 మంది కార్మికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది కార్మికులు గాయపడ్డారు. కార్మికులు తమ విధులు నిర్వహిస్తున్న సమయంలో బాణాసంచా కర్మాగారంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు సమయంలో భారీ మంటలు వెలువడ్డాయి. కాగా పేలుడు ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాట్నా పేలుళ్ల నిందితుల్లో ఒకరు మృతి పాట్నా: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గత ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో చేపట్టిన హుంకార్ ర్యాలీ సందర్భంగా సంభవించిన బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు అయినిల్ అలియాస్ తారిఖ్ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పాట్నా రైల్వేస్టేషన్లో ఆదివారం ఉదయం బాంబు అమరుస్తున్న సమయంలో పేలడంతో తారిఖ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన తారిఖ్‌ను పోలీసులు పాట్నాలోని ఇందిరాగాంధీ మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చికిత్స చేయించారు. చికిత్స పొందుతున్న తారిఖ్ శుక్రవారం ఉదయం మృతి చెందారు. కాగా గాంధీ మైదాన్ ప్రాంతాల్లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా, 83మంది గాయాలపాలయ్యారు.
హీరో సూర్య రిజెక్ట్ చేసిన కథతో నాగ్
కొద్ది రోజుల క్రితం హీరో సూర్య ప్రెస్ మీట్ పెట్టి మరీ...తనకు కథ నచ్చకే ..పూజతో ప్రారంభమైన తన చిత్రం షూటింగ్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆ దర్శకుడు మరెవరో కాదు గౌతమ్ మీనన్. అయితే ఇప్పుడా కథ నాగార్జున వద్దకు చేరుకుందని సమాచారం. గతంలో తన కుమారుడు నాగ చైతన్య కి హిట్ ఇచ్చిన గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నాగార్జున ఈ సినిమా చేయబోతున్నారనే టాక్ వినపడుతోంది. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తారని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కుదుర్చుకున్న ఒప్పంద ప్రకారం బెల్లంకొండ సురేష్ సంస్థలో గౌతమ్‌మీనన్ ఓ సినిమా చేయాల్సివుందని, అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని...పస్తుతం గౌతమ్‌మీనన్ డేట్స్ ఖాళీగా వుండటంతో నాగార్జునతో సినిమా చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరో ప్రక్కన నాగ చైతన్య కు ‘తడాఖా' వంటి హిట్ ఇచ్చిన డాలి తోనూ నాగార్జున చేయనున్నారని తెలుస్తోంది. దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించే చిత్రానికి నాగార్జున ఇదివరకే అంగీకారం తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుందని చెప్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల్లో ఏది ముందు పట్టాలు ఎక్కుతుందో తెలియాలి. భాయ్ డిజాస్టర్ టాక్ తో నాగార్జున ...కథలపై చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ‘భాయ్' చిత్రాన్ని ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూట్ చేసిన నాగార్జున నష్టపోయారని చెప్పకతప్పదు. అయితే తొలిప్రయత్నం విఫలమైనా ఏ మాత్రం బెదురు లేకుండా ముందుకు సాగుతున్నారు నాగార్జున. తాజాగా రూపొందుతున్న అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ ‘మనం' చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట నాగార్జున.
‘హీల్-ఎ-చైల్డ్’ ఫౌండేషన్ కోసం....మహేష్ బాబు
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం కొర్పొరేట్ బ్రాండ్లకు మాత్రమే కాదు....సమాజానికి సేవ చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలకు ప్రచారం చేస్తూ తనలోని సేవా భావాన్ని చాటుతున్నాడు. గతంలో మహేష్ బాబు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరోదించడానికి చేపట్టిన ‘MARD' ప్రచార కార్యక్రమంలో పాలు పంచుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా మహేష్ బాబు ‘హీల్-ఎ-చైల్డ్' అనే స్వచ్చంద సంస్థకు గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు. ఆ సంస్థకు సంబంధించిన టీషర్ట ధరించి మహేష్ బాబు ఈ సంస్థను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సంస్థ చిన్నారుల క్షేమం కోసం పని చేస్తుంది.హీల్-ఎ-చైల్డ్' సంస్థను ప్రమోట్ చేయడంపై మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేసారు. నాలుగేళ్లుగా ఈ సంస్థ చిన్నారుల ఆరోగ్యం గురించి ఎంతో సీరియస్‌గా పని చేస్తుందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. అనారోగ్యం పాలైన పేద చిన్నారులకు చికిత్స అందించడంలో ఈ సంస్థ ఆర్థిక సహాయం చేస్తుంది. మహేష్ బాబు భార్య నమత్ర ఇటీవల ఈ సంస్థ కార్యాలయాన్ని సందర్శించి పనితీరును పరిశీలించారు. సంస్థ చేయబోయే కార్యక్రమాల గురించి ఆరా తీసారు. ఇలాంటి ఒక మంచి సంస్థకు ప్రతిఒక్కరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని నమ్రత చెప్పుకొచ్చారు.
Thursday, 31 October 2013
అలీ 369...టీవీషో దర్శనమివ్వనున్న పవన్ కళ్యాణ్?
బుల్లితెర ప్రేక్షకులకు శుభ వార్త. ఇప్పటి వరకు కేవలం సినిమాల్లోనే చూసిన పవన్ కళ్యాణ్‌ను తొలిసారి బుల్లితెర కార్యక్రమాల్లో చూడబోతున్నాం. ఈటీవీలో ప్రముఖ కమెడియన్ అలీ నిర్వహిస్తున్న ప్రముఖ ‘అలీ 369' షోలో పవన్ కళ్యాణ్ దర్శనం ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీపావళి పండగను పురస్కరించుకుని నవంబర్ 3న ప్రసారం అయ్యే షోలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ‘అత్తారింటికి దారేది' చిత్రం ప్రమోషన్లో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ షోలో దర్శనం ఇవ్వబోతున్నట్లు సమాచారం. సినిమాను ఇంత పెద్ద పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుల్లో కమెడియన్ అలీ ఒకరు. పవన్ ప్రతి సినిమాలోనూ అలీకి తప్పకుండా ఓ క్యారెక్టర్ ఉంటుంది. అలీ నిర్వహిస్తున్న టీవీ షో కావడంతో పవన్ కళ్యాణ్ రావడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తొలిసారిగా బుల్లితెరపై కనిపిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్‌కు సినిమా ప్రచార కార్యక్రమాలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనే అలవాటు మొదటి నుండీ లేదు. అయితే ‘అత్తారింటికి దారేది' సినిమా తర్వాత పవన్ తన అలవాట్లను మార్చుకున్నారు. సినిమా పైరసీకి గురి కావడం, అదే సమయంలో భారీ విజయం సాధించడం పవన్‌లో మార్పు తెచ్చినట్లు స్పష్టం అవుతోంది.
న్యూయార్క్ టైమ్స్ టాప్ 10 లో పవన్ కళ్యాణ్ !!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ హిమాలయ శిఖరం లా టాలీవుడ్ లో ఎవరికీ అందనంత స్థాయికి రోజురోజుకూ ఎదిగిపోతోంది అని చెప్పడానికి మరో లేటెస్ట్ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ఇండియన్ సినిమాకు సంబంధించి ’10 మోస్ట్ డిజైరబుల్ యాక్టర్స్ ఇన్ ఇండియా’ అనే అంశం పై జరిపిన ఆన్ లైన్ సర్వేలో పవన్ కళ్యాణ్ భారతదేశానికి సంబంధించిన వివిధ భాషలకు సంబంధించిన నటులలో పవన్ 5వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ తర్వాత మహేష్ బాబు 6వ స్థానం దక్కించుకోవడం విశేషం. పవన్ కళ్యాణ్ కంటే ముందు మొదటి నాలుగు స్థానాల్లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, తర్వాత సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్లు నిలిచారు. తమిళ హీరో విజయ్ 7వ స్థానంలో, అమీర్ ఖాన్ 8వ స్థానంలో, 9వ స్థానంలో రణబీర్ కపూర్, 10వ స్థానాన్ని అజయ్ దేవగన్ దక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ అంతటా పవనిజమ్ హోరులో యువతరం హడావిడి చ చేస్తున్న నేటి ప్రస్తుత పరిస్థుతులలో న్యూయార్క్ టైమ్స్ తాజాగా వెల్లడించిన ఈ ఆన్ లైన్ సర్వే ఫలితాలు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాయి. ఈ టాప్ టెన్ లో రజనీకాంత్, కమలహాసన్ లు లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ వార్త పవర్ స్టార్ పవన్ అభిమానులకు నిజమైన దీపావళి పండుగ.Wednesday, 30 October 2013
నటి కాజోల్ ఇంట్లో దొంగతనం: నిందితుల పట్టివేత
బాలీవుడ్ నటి కాజోల్ నివాసంలో దొంగతనం జరిగింది. కాజోల్కు సంబంధించిన 17 బంగారు గాజులను దొంగిలించిన ఇద్దరు పని మనుషులను ముంబై పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గత మూడు సంవత్సరాల నుంచి కాజోల్ నివాసంలో పనిచేస్తున్న వారు కొన్ని రోజుల క్రితం ఇంట్లోని బంగారు ఆభరణాల దొంగతనానికి పాల్పడ్డారు. జుహు పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని జుహులో ఉన్న భవనంలో కాజోల్, ఆమె భర్త అజయ్ దేవగణ్ నివాసముంటున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నివాసంలో 12మంది పని మనుషులు ఉన్నట్లు తెలిపారు. దీపావళి పండగ సందర్భంగా తమ ఇంటిని శుభ్రం చేసేందుకు మరో ముగ్గురు పని మనుషులను అక్టోబర్ 15న తీసుకున్నారు. కాగా అక్టోబర్ 23న కాజోల్ తనకు సంబంధించిన రూ. 5లక్షల విలువైన బంగారు గాజులు పోయినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎవరైతే కొత్తగా తన నివాసంలో పని మనుషులుగా వచ్చారో వారిపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అక్టోబర్ 23న తన పడకగదిలోని ఒక పెట్టెలో ఆ గాజులను భద్రపర్చినట్లు పోలీసులకు కాజోల్ తెలిపింది. తదుపరి రోజు అందులోనే ఉన్నట్లు గుర్తించానని, అక్టోబర్ 22న అవి అదృశ్యమైనట్లు కనుగొన్నట్లు ఆమె తెలిపింది. తమ విచారణలో కాజోల్ నివాసంలో గతమూడు సంవత్సారాలుగు పని చేస్తున్న సంతోష్ పాండే, గాయత్రి దేవేంద్రన్‌లు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. బంగారు గాజులు, ఇతర ఆభరణాలను దొంగిలించిన నిందితులు సెరిసగం పంచుకున్నారని, కొంతకాలం తర్వాత అమ్మేయాలనుకున్న నిందితులు బంగారు గాజులను మురికి కాలువలో దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితులను మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నిందితులను పోలీసులు కస్టడీకి తరలించారు.
పవర్ స్టార్ దారినే ఎంచుకున్న ఉపేంద్ర !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేలిబ్రేటీగా మారిపోయాక మన తెలుగు హీరోలకే కాదు, దక్షణ భారతదేశ సినిమా రంగం ప్రముఖులకు కూడా ఆరాధ్య దైవంగా మారిపోయాడు. టాలీవుడ్ లో పవన్ కు ఎటువంటి ఇమేజ్ ఉందో కన్నడ సినిమా రంగంలో ఉపేంద్రకు కూడా ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. అనేక వెరైటీ సినిమాలు నటించిన కెరియర్ గ్రాఫ్ ఉపేంద్రది, కన్నడ ప్రేక్షకులు ఇతని నటనను విపరీతంగా ఇష్టపడతారు. ఉపేంద్ర నటించిన చాల సినిమాలు తెలులో కూడా డబ్ అయి విజయవంతం సాధించాయి. గత కొద్దికాలం గా కన్నడ సినిమా రంగంలో సైలెంట్ గా ఉన్న ఉపేంద్ర ఈ మధ్య కన్నడంలో విడుదల అయిన ‘టోపీవాలా’ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపెట్టాడు. నల్ల ధనం కధా వస్తువుతో ఈ సినిమా నిర్మింపబడింది. ఈసినిమాను ప్రస్తుతం తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ ‘టోపీవాలా’ సినిమాకు తెలుగు ప్రేక్షకుల అభిరుచిని బట్టీ ఏ టైటిల్ పెట్టాలి అని దర్శకుడు ఎం.జి. శ్రీనివాస్ ఆలోచిస్తూ ఉంటే కన్నడ హీరో ఉపేంద్ర ఈ మధ్య విడుదలై సంచలనం సృస్టించిన ‘పవన్ అత్తారింటికి దారేది’ టైటిల్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు ‘స్విస్ బ్యాంక్ కు దారేది’ అనే టైటిల్ ను పెడితే తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు అని ఉపేంద్ర ఈ సినిమా నిర్మాతలకు సూచించాడట. ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అవుతుంది అని అంటున్నారు. పవన్ ‘అత్తారిల్లు’ లా ఉపేంద్ర కు స్విస్ బ్యాంక్ కు దారేది ఏ దారికి తీసుకేడుతుందో చూడాలి...
Subscribe to:
Posts (Atom)

