నటి మీనా షూటింగ్ స్పాట్లో ఉన్నట్టుండి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మళయాలం మూవీ ‘ద్రిశ్యం' షూటింగులో ఆమె నటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, మీనా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఉన్నట్టుండి మీనా స్పృహ తప్పి పడిపోవడంతో యూనిట్ సభ్యులంతా కంగారు పడ్డారు. షూటింగుకు వచ్చినప్పటి ఆమె అనారోగ్యంగా కనిపించారని, అనారోగ్యాన్ని లెక్క చేయకుండా షూటింగులో పాల్గొనడం వల్లనే ఇలా జరిగిందని భావిస్తున్నారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఈ సంఘటనతో ‘ద్రిశ్యం' మూవీ షూటింగ్ నిలిపివేసారు. అనారోగ్యం నుంచి మీనా కోలుకున్న తర్వాత షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో మీనా, మోహన్ లాల్ భార్య పాత్రలో నటిస్తున్నారు. ‘ద్రిశ్యం' సినిమా షూటింగ్ ఆగిపోవడంతో నటుడు మోహన్ లాల్....తను నటిస్తున్న మరొక మళయాలం మూవీ ‘గీతాంజలి' పోస్టు ప్రొడక్షన్ పనుల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం మోహన్ లాల్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నార
Monday, 21 October 2013
సొమ్మసిల్లి పడిపోయిన నటి మీనా..
నటి మీనా షూటింగ్ స్పాట్లో ఉన్నట్టుండి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మళయాలం మూవీ ‘ద్రిశ్యం' షూటింగులో ఆమె నటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, మీనా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఉన్నట్టుండి మీనా స్పృహ తప్పి పడిపోవడంతో యూనిట్ సభ్యులంతా కంగారు పడ్డారు. షూటింగుకు వచ్చినప్పటి ఆమె అనారోగ్యంగా కనిపించారని, అనారోగ్యాన్ని లెక్క చేయకుండా షూటింగులో పాల్గొనడం వల్లనే ఇలా జరిగిందని భావిస్తున్నారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఈ సంఘటనతో ‘ద్రిశ్యం' మూవీ షూటింగ్ నిలిపివేసారు. అనారోగ్యం నుంచి మీనా కోలుకున్న తర్వాత షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో మీనా, మోహన్ లాల్ భార్య పాత్రలో నటిస్తున్నారు. ‘ద్రిశ్యం' సినిమా షూటింగ్ ఆగిపోవడంతో నటుడు మోహన్ లాల్....తను నటిస్తున్న మరొక మళయాలం మూవీ ‘గీతాంజలి' పోస్టు ప్రొడక్షన్ పనుల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం మోహన్ లాల్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నార
రాజకీయాల్లో పవన్ ప్రకంపనలు
పైలిన్ తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో అంతకు మించి ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. గత వారం రోజులుగా వెబ్ సైట్లలో పవన్ రాజకీయ రంగ ప్రవేశంపై కుప్పలు తెప్పలుగా వార్తలు రాగా, తాజాగా దినపత్రికలు, టివి చానళ్లలో ఆయన రాజకీయ రంగప్రవేశంపై వార్తా కథనాలు ప్రచురించి ప్రసారం చేసాయి. ప్రముఖ చానళ్లు నిర్వహించే న్యూస్ వాచ్ కార్యక్రమాల్లో ఇదే ప్రధానాంశం కావడం గమనార్హం.
అందరు అనుకుంటున్నదే, కొత్తదేమి లేదు, కాని ఇన్నాళ్లు అంతర్గతంగా గుసగుసలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ రాజకీయ అరగేంట్రం ఇప్పుడు బహిరంగంగా చర్చకు వచ్చిదంతే. అంతే కాదు క్రిష్ణా, గుంటూర్, ఖమ్మం వంటి జిల్లాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ లతో కూడిన ఫ్లెక్సీలు వెలియడం మరింత దుమారం లేపుతోంది.అంతే కాదు పవన్ పచ్చకండువా ధరించిన ఫోటోలు మరింత సంచలనాలకు కారణమవుతోంది. ఈ ఫోటో మార్ఫింగ్ చేసింది కావచ్చు, కాని ఇంత జరుగుతున్నా కూడా తను టిడిపి లోకి వెలుతున్నాను అని వస్తున్న వార్తలపై పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో ఇదంతా నిజమేనేమోనన్న వాదనకు బలం చేకూరి ప్రస్తుతం పవన్ టిడిపి దారిలో వెలుతున్నాడన్నది రాజకీయాల్లో పెను తుఫానుకు కారణమైంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కారణం ఆయన ఈ మద్యకాలంలో బాలక్రిష్ణతో చాలా సన్నిహితంగా ఉంటున్నాడు. పైగా కాంగ్రెస్ కు బద్ద వ్యతిరేకి పవన్ కళ్యాణ్. అంటే ఆయన రాజకీయాల్లోకి వస్తే కొత్తగా పార్టీనైనా పెట్టాలి, లేదా కాంగ్రెస్ కు బద్ద వ్యతిరేకి అయిన టిడిపి లో చేరి కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి తప్ప మరో మార్గం లేదు. అందుకే పవన్ టిడిపి లోకి వెలతాడు అన్న వాదనను ఎవరు తోసిపుచ్చడం లేదంటున్నారు. ‘రాజకీయ రంగంలో చంద్రబాబుకు ఓ లెక్కుంది, సినీ రంగంలో పవన్ కళ్యాణ్ కో పవరుంది, చంద్రబాబు లెక్కకు పవన్ కళ్యాణ్ పవర్ కు నందమూరి సింహం బాలయ్య తోడయితే ఎదురేముంది’ అంటూ రాసిన రాతలతో వెలసిన ఫ్లెక్సీలయితే ఇప్పుడు రాజకీయాల్లో ఓ సునామిని సృష్టిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. పైగా బాలక్రిష్ణ ఇంటికి వెల్లి పవన్ కళ్యాణ్ ఈమద్యనే కలవడం కూడా ఈ వార్తలకు బలాన్నిస్తోంది అంటున్నారు. సరే ఇది నిజమా... అబద్దమా, తెలియాలంటే పవన్ కళ్యాణ్ నోరు విప్పాల్సిందే.
పసిడి తవ్వకాలపై జోక్యం చేసుకోం: సుప్రీంకోర్టు
ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నవ్ జిల్లాలో ఆర్కియోలాజిస్ట్స్ చేపట్టిన తవ్వకాలపై జోక్యం చేసుకోబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వామి శోభన్ సర్కార్ కలను ఆధారం చేసుకుని నిధుల కోసం చేపట్టిన తవ్వకాలు అనేక విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. 19 శతాబ్దంలో పూడ్చిన వేయి టన్నుల బంగారం కోసం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టన తవ్వకాలను అధికారులు నిలిపివేశారు. అయితే జిల్లా అధికారులు తవ్వకాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. నిధుల కోసం చేపట్టిన తవ్వకాలు నేటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి.
ఓ సాధువు కల ఆధారంగా తవ్వకాలు చేపట్టడాన్ని విమర్శించిన నరేంద్ర మోడీ సోమవారం ఈ వ్యవహారంపై యూటర్న్ తీసుకున్నారు. శోభన్ సర్కార్ ను తాజాగా మోడీ ప్రశంసలతో ముంచెత్తారు.
దోడియా ఖేరా గ్రామంలో తవ్వకాలు చేపట్టిన అధికారులు కొన్ని సందేహాలు తలెత్తడంతో ఆపివేశారు. ఈ తవ్వకాలపై దాఖలైన అభ్యర్థనపై విచారించిన సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. భాయ్ కథ బయటపడింది

వర్మ దెబ్బకు క్షమాపణ చెప్పిన సెలబ్రిటి
ఆ మధ్య కాలంలో వర్మను పబ్లిగ్‌గా తిట్టగలిగే వారు ఎవరైన ఉన్నారంటే తనే కరణ్ జోహార్. కరణ్‌జోహార్‌కి రాంగోపాల్‌వర్మకి బాలీవుడ్‌లో ఎప్పటి నుండో గొడవలు జరుగుతూ ఉండేవి. వర్మ తీసిన ప్రతి మూవీను అట్టర్‌ప్లాప్ అని కరణ్ జోహార్ పబ్లిక్ స్టేట్‌మెంట్ ఇచ్చేవాడు. దీనికి వర్మ కౌంటర్ ఆన్ ది స్పాట్‌లో ఉండేది. 'నా మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవ్వు, డైరెక్షన్ గురించి తెలుకో' అంటూ ఈ విధమైన స్టేట్‌మెంట్స్ ఇద్దరి మధ్య కొనసాగుతుంటాయి. వీరిద్దరి టాపిక్ బాలీవుడ్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంది.రీసెంట్‌గా డైరెక్టర్ కరణ్‌జోహార్, రామ్‌గోపార్‌వర్మకు క్షమాపణలు చెప్పాడు. 'ఏదైన తప్పు జరిగితే క్షమించు' అని మెసేజ్ పెట్టాడు. వెంటనే కరణ్‌జోహార్ ప్రెస్ మీట్ పెట్టి, ఆ మెసేజ్‌ను మీడియా ముందు పెట్టాడు. 'నేను,వర్మ ఎప్పుడూ గొడవపడలేదు. మేమిద్దం ఎప్పుడూ కలిసి ఉంటాం, బాగానే మాట్లాడుకుంటాం. కాని మీడియానే మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నట్టు క్రియోట్ చేసింది. వాటిని బూతుద్దంలో చూపెడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నేను ఈ రోజు ఆర్.జి.వికి అపాలజి చెప్పాను. ఆ మెసేజ్ ఇదిగో' అంటూ మీడియాతో మాట్లాడాడు. దీంతో వర్మ,కరణ్‌జోహార్‌ల మధ్య ఎటువంటి బేధాబిప్రయాలు లేవవని బిటౌన్‌కు స్పష్టమైంది.
రాత్రి 9:30 ని.లకు కుట్రదారుల పేర్లను పవన్ చెప్పేస్తున్నాడు
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికిదారేది మూవీ రిలీజ్ కంటే ముందుగానే నెట్‌లో రిలీజ్ అయి సంచలనం అయింది. ఓ స్టార్‌డం హీరో మూవీకు ఈ విధంగా జరగటంతో యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ అయింది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు బ్లాక్‌డే అనే విషాదం ఏమైనా ఉంటే అది ఇదే అని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఈ వీడియో అనుకోకుండా బయటకు వచ్చింది కాదు అని, పైరసీ భూతం అస్సలు కానే కాదు అని అత్తారింటికిదారేది థ్యాంక్యు మీట్‌లో పవన్ బాహాటంగానే చెప్పాడు. ఇదంతా కుట్ర ప్రకారమే జరిగిందని, దానికి సంబంధించిన వ్యక్తులను అవసరమైతే తాటతీస్తాను అంటూ సభాముఖంగా పవన్ హెచ్చరించాడు .ఇదిలా ఉంటే ఈ రోజు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓ ఎలట్రానిక్ మీడియాకు ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వూ ఇస్తున్నాడు. ఆ టెలివిజన్‌లో రాత్రి 9.30 నిముషాలకు లైవ్ ఇంటర్వూ స్టార్ట్ అవుతుంది. 'ఇప్పటికే అత్తారింటికిదారేది మూవీకు సంబంధించిన పైరసీను అరికట్టడంలో ఆ మీడియా చాలా ముందు ఉంది, దానికి థ్యాంక్స్' అంటూ పవన్ కూడ చెప్పాడు. ఈ రోజు అదే మీడియాలో పవన్ కళ్యాణ్ లైఫ్ ఇంటర్వూ ఉండటంతో ఇందులో ఎన్నో విషయాలు బయటపడే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ ఇంటర్వూ సమయం కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అంజలిని భయ పెడుతున్న చీకటి కోణం..
తెలుగు తెర సీతమ్మ అంజలి కెరియర్ ప్రస్తుతం చాల సమస్యలు మధ్య కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ‘సీతమ్మ వాకిట్లో సినిమా సూపర్ హిట్ అయినా ఆ ఇమేజ్ ను అంజలి ఏ మాత్రం కేష్ చేసుకోలేకపోయింది. వరుస పెట్టి ఆమె పై వస్తున్న రూమర్లు దానితో పాటు ఆమె వింత ప్రవర్తన అంజలి పై నెగిటివ్ ఇమేజ్ ను ఏర్పరచడమే కాకుండా, ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ లో వెంకటేష్ తో కలిసి నటిస్తున్న ‘మసాల’ తప్పించి మరే సినిమా ప్రస్తుతం ఆమె చేతిలో లేవు. ఈ నేపధ్యంలో అంజలి జీవితం పై సినిమా తీయబోతున్న కోలీవుడ్ దర్శకుడు ఈ సినిమాకు సంబంధించి తన ప్రయత్నాలను వేగవంతం చేయడమే కాకుండా అంజలి జీవితం గురించి రాజోలు దగ్గరనుంచి చెన్నై వరకు చాలా లోతుగా వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తున్న వార్తలు అంజలిని విపరీతంగా కలవర పెడుతున్నాయని వార్తలు వస్తున్నాయి.అంజలి పిన్ని, బాబాయ్ లతో కలిసి చెన్నై లో ఆమె సినిమా వేషాల కోసం పడిన పాట్లు ఆ సందర్భంలో ఒక కోలీవుడ్ దర్శకుడి చేతిలో అంజలీ పావుగా మారడం ఆ తరువాత ఆమె పిన్ని బాబాయ్ లతో మనస్పర్ధలు రావడంతో పాటు అంజలి జీవితానికి సంబంధించిన అనేక చీకటికోణాలు ఈ సినిమా స్క్రిప్ట్ లో ఉంటాయని సిల్క్ స్మిత జీవితం ఆధారంగా నిర్మింపబడిన డర్టీ పిక్చర్ ఏవిధంగా సంచలనం సృష్టించిందో ఆ స్థాయిలో ఈ సినిమాను నిర్మించాలని కోలీవుడ్ యువ దర్శకుడు చేస్తున్న ప్రయత్నాలకు షాక్ కు గురైన అంజలి ఈ సినిమాను నిర్మించ కుండా ఆపు చేద్దామని తన సాయసక్తులా ప్రయత్నిస్తున్నా అంజలి ప్రయత్నాలకు విఘాతం ఏర్పడడంతో, అంజలి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతోందనీ, అనే వార్తలు వస్తున్నాయి.
అంతేకాకుండా తన జీవితం పై సినిమా తీస్తున్న ఆ యువ కోలీవుడ్ దర్శకుడి ప్రయత్నాలు ఆపడానికి అంజలి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడి సహాయం తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అంజలిని భయపెడుతున్న ఆ చీకటి కోణం నుండి బయట పడుతుందో లేదో చూడాలి.
అక్కినేనికి శస్త్రచికిత్స...
మొన్న శనివారం తనకు కేన్సర్ వచ్చింది అని మీడియా సమావేశంలో ప్రకటించిన అక్కినేని ఒక్కరోజు కూడా గడవ కుండానే చికిత్స నిమిత్తం అదేరోజు రాత్రి సికిందరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు అని తెలుస్తోంది. ప్రత్యేకంగా ఇద్దరు వైద్యులతో కూడిన బృందం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. శనివారం రాత్రి పేగు చివర మలవిసర్జన ద్వారం వద్ద శస్త్రచికిత్స చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కినేనిని ఐసీయూలో ఉంచి చికిత్స అందజేస్తున్నామని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్ డాక్టర్లు తెలియ చేస్తున్నారు.ఆస్పత్రి వద్ద అక్కినేని నాగార్జున, వెంకట్ ఇంకా ఇతర కుటుంబ సభ్యులు అక్కినేనికి తోడుగా ఉన్నారు.ఆయన ఆరోగ్యంపై ఈరోజు సాయంత్రానికి మరింత పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అక్కినేని తన మనో నిబ్బరంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల ఆశీస్సులతో ఈ అనారోగ్యం నుండి తేరుకుని తిరిగి ‘మనం’ సెట్లో సందడి చేయాలనీ ప్రతి తెలుగు హృదయం మనసారా ఆదేవుడిని కోరుకుంటోoది.
Subscribe to:
Posts (Atom)