Wednesday, 2 October 2013

ఫ్లాష్ న్యూస్ : ఏపి సిఎం గా ఆనం లేదా రఘువీరా



ఫ్లాష్ న్యూస్ : ఏపి కి ముఖ్యమంత్రిగా ఆనం రాంనారాయణ రెడ్డి, లేదా రఘువీరా రెడ్డిలలో ఒకరు కావచ్చని విశ్వసనీయ సమాచారం. ఆనం ఇంట్లో బొత్స, చిరంజీవి, రఘువీరా రెడ్డి అండ్ బృందం సమావేశం కావడం, బొత్స వెంటనే ఢిల్లీ వెల్లి పెద్దలను కలవడం, వెనువెంటనే ఈ వార్తలు గుప్పుమనడంతో ఇందులో కొంత నిజముందని రాజకీయ వర్గాలు నమ్ముతున్నాయి. కారణం సిఎం గా కిరణ్ కుమార్ రెడ్డి ఊస్టింగ్ ఖాయం అంటున్నారు. అలాంటప్పుడు అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పాస్ కావాలంటే ప్రభుత్వం ఉండాలి, కాబట్టి మరో ముఖ్యమంత్రిని పెట్టాలి, తెలంగాణ ప్రాంతం నేతను పెడితే తెలంగాణ బిల్లు పాస్ చేయించుకోవడం కోసమే హైకమాండ్ ఈ కుట్ర పన్నిందని, అందుకే కిరణ్ కుమార్ ను తొలగించిందని కిరణ్ వర్గీయులే కాదు ప్రత్యర్థి పార్టీలు కూడా ఆరోపించే అవకాశం ఉంటుంది.

 అంతే కాదు కిరణ్ సామాజిక వర్గాన్ని కాదని మరో సామాజిక వర్గం నేతలు అంటే బొత్స, చిరంజీవి వంటి వారిని పెడితే కూడా సంకేతాలు మరో రకంగా జారీ అవుతాయని కూడా అధిష్టానం భావిస్తోందట. అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన నెల్లూరు ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి లేదా అనంతపూర్ జిల్లాకు చెందిన రఘువీరా రెడ్డిలలో ఒకరిని సిఎం గా నియమించాలన్న ఆలోచనకు అధిష్టానం వచ్చిందని సమాచారం. ఇది వీలు కాని పక్షంలో రాష్ట్రపతి పాలనైనా విధిస్తారని కిరణ్ ను మాత్రం సిఎం గా కొనసాగించరని స్పష్టం అవుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో.

రాంచరణ్ ను అసహ్యించుకున్న క్రిష్ణా



మెగా హీరోలంటే అందరికి ఇష్టమే, కాని ఇప్పుడు ఎందరికో అసహ్యం కూడా. కారణం చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ క్రమేపి ఈ దుస్థితికి చేరింది అంటున్నారు. అయితే సినిమా వాళ్లలో కూడా సీనియర్లు అసహ్యించుకునే స్థితికి వెల్లడమే విడ్డూరం అంటూ టాలీవుడ్ లో టాక్.

ఇది నిజమా, అబద్దమా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. విషయమేమిటంటే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ క్రిష్ణా రాంచరణ్ ను అసహ్యించుకున్నాడట, ఆయనతో నేను సినిమా తీయడమేమిటి, అస్సలు కుదరదు అంటూ డైరెక్టర్ క్రిష్ణ వంశీకి చెప్పేసాడట. క్రిష్ణ వంశీ... క్రిష్ణా, వెంకటేష్, రాంచరణ్ లతో మల్టీ స్టారర్ సినిమా తీస్తున్నాడన్న విషయం టాలీవుడ్ లో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అప్పట్లో ఓసారి ఈ సినిమాలో రాంచరణ్ తో నటించడానికి వెంకటేష్ నో చెప్పాడని వార్తలు వినిపించాయి. ఇప్పుడు పెద్ద మనిషి క్రిష్ణ కూడా ఆ మాట చెప్పాడంటే చెర్రీ పరిస్థితి చెత్తచెత్త అయినట్టే అంటూ టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి.

పవన్ కల్యాన్ ను కలిపేసుకున్న టీడీపీ ఫ్యాన్స్!


ఈ మధ్య తెలుగు సినిమా స్టార్లను ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీ ఫ్లెక్సీలకు ఎక్కించేస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు, ప్రభా స్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులను వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు తమ పోస్టర్లపైకి ఎక్కించేశారు. ఈ హీరో లు తమవారేనని అంటున్నారు జగన్ అభిమానులు. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కల్యాన్ ను సొంతం చేసుకుంది టీడీపీ!

 తాజాగా అత్తారింటికి దారేదీ సినిమా విడుదల సందర్భంగా ప్రత్యేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు తెలుగుదేశం అభిమానులు. ఈ ఫ్లెక్సీలపై టీడీపీ అధినేత చంద్రబాబు బొమ్మ, నందమూరి బాలకృష్ణ బొమ్మ, పవన్ కల్యాన్ బొమ్మలున్నాయి. ఈ విధంగా పవన్ ను టీడీపీ కార్యకర్తలు తమవాడిని చేసుకున్నారు! ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. గతంలోనే పవన్ కల్యాన్ టీడీపీలో చేరబోతున్నాడనే వార్తలు వచ్చాయి. పవన్ టీడీపీలో చేరడం ఖాయమని, ఆయన మచిలీ పట్నం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే వాటికి బ్రేక్ పడి చాలా కాలమే అయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం కార్యకర్తలు.. పవన్ కల్యాన్ గురించి చర్చకు తెరతీశారు! మరి దీనిపై మెగాఫ్యామిలీ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో!

'దూసుకెళ్తా'లో రవితేజ పాత్ర ఏంటి?


వీరు పోట్ల దర్శకత్వంలో మంచు విష్ణు నటిస్తోన్న దూసుకెళ్తా చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఎప్పుడూ లేనిది ఈసారి విష్ణు సినిమా మీద అంచనాలు కాస్త బాగానే ఉన్నాయి. షూటింగ్ స్టిల్స్, ట్రెయిలర్ వంటివి ఇంటరెస్ట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవడమే అందుక్కారణం. దూసుకెళ్తా సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మంచు ఫ్యామిలీ. కథ దగ్గర్నుంచి పబ్లిసిటీ కార్యక్రమాల వరకూ ప్రతిదానిలోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. విష్ణు కూడా సిక్స్ ప్యాక్ పెంచాడు. డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ ని అదరగొట్టేశాడు. ఆ స్టిల్స్ చూస్తే, నిజంగానే ఆ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అనిపిస్తోంది. ఇక ట్రెయిలర్లో బ్రహ్మానందం కామెడీ చూస్తుంటే, పొట్టలు పగిలిపోవడం ఖాయమని అర్థమవుతోంది. వీటికి తోడు స్లిమ్ గా అయిపోయిన హన్సిక నాజూకు అందాలు ప్రేక్షక హృదయాలను కవ్విస్తున్నాయి.

ఇవన్నీ కలిసి దూసుకెళ్తా మీద అంచనాలు పెంచేశాయి. అయితే వీటన్నిటితో పాటు ఈ చిత్రానికి మరో ఆకర్షణ ఉంది. అది... రవితేజ వాయిస్ ఓవర్. విష్ణు చిన్నతనంలో వచ్చే సన్నివేశాలకు కాస్త వెటకారంగా, హాస్యం పుట్టేలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం ఉందట. అందులో రవితేజను మించినవాళ్లు లేరు కాబట్టి అతడితోనే చెప్పించాలని డిసైడ్ అయ్యారట. మన మాస్ మహరాజా కూడా అందుకే సంతోషంగా ఎస్ అన్నాడట. గతంలో మర్యాద రామన్న చిత్రంలో సైకిల్ కు డబ్బింగ్ చెప్పి అదరగొట్టాడు కదా. ఇందులో అందకంటే అదిరిపోద్ది అంటున్నాడు వీరు పోట్ల!

సునీల్ విశ్వరూపం ముగిసిన‌ట్టే


కమెడియ‌న్‌గా సునీల్ కామెడీ ఓ స‌రికొత్త గిలిగింత‌ల‌ను పెట్టింది ప్రేక్షకుల‌ని. త‌రువాత సునీల్‌కు టైం క‌లిసొచ్చి హీరోగా కూడ చెలామ‌ణి అవుతున్నాడు. అందాల‌రాముడు,పూల‌రంగ‌డు,త‌ఢాఖ ఇలా వ‌రుసగా బాక్సాపీస్ వ‌ద్ద మినిమం క‌లెక్షన్స్‌ను కొల్లగొడుతున్న ఈ హీరో, ఎట్ ప్రెజెండ్ నాలుగు,అయిదు మూవీల‌లో హీరోగా బిజిబిజిగా ఉన్నాడు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే సునీల్ హీరోగా ఇన్వెస్ట్ చేయ‌టానికి ప్రొడ్యూజ‌ర్లు కూడ రెడీగా ఉన్నారు. ఎన్ని ఉన్నా, రిలీజ్ అయిన మూవీల స‌క్సెస్‌తోనే అప్‌క‌మింగ్ మూవీల మార్కెట్ ఆధార‌ప‌డి ఉంటుంది. త్వర‌లోనే అశ్వినిద‌త్‌,మెహ‌ర్‌ర‌మేష్ కాంబినేష‌న్‌లో సునీల్ హీరోగా ఓ మూవీ రెడీ అవుతుంది.

 అలాగే తనికెళ్ళభ‌ర‌ణి ద‌ర్శక‌త్వంలో భ‌క్తక‌న్నప్పగా సునీల్ న‌టించ‌డానికి రెడీ అయిపోయాడు. భ‌క్తి పాత్రలు చేయ‌టాన‌కి చాలా మంది హీరోలే భ‌య‌ప‌డిపోతారు. కాని సునీల్ హీరోగా నిల‌దొక్కుకుంటున్న ఈ త‌రుణంలో ఇటువంటి సాహ‌సాలు చేయడం క‌రెక్ట్ కాద‌ని టాలీవుడ్ అంటుంది. ఏ హీరోకూ మెహార్‌ర‌మేష్‌కి డేట్స్ ఇవ్వటానికి సాహసించలేక‌పోతుంటే, సునీల్ మాత్రం చాలా ఈజీగా మెహార్‌తో జోడి క‌డుతున్నాడు. ఒక్క సారి ప్లాప్ ప‌డితే సునీల్ మార్కెట్లో డౌన్‌ అయిన‌ట్టే, ఇక అక్కడ‌నుండి బ‌య‌ట‌కు రావ‌డం అనేది చాలా క‌ష్టం. అందుకే మంచి కాంబినేష‌న్స్‌ను సెల‌క్ట్ చేసుకునేట‌ప్పుడు చాలా జాగ్రత్తప‌డాలని సునీల్‌కు స‌న్నిహితులు హిత‌బోధ చేస్తున్నారంట‌. వింటే హీరోగా కొంత కాలాం ఉంటాడు, లేకపోతే ఎంతో కాలం ఉండ‌డు అని అంటున్నారు.

దాసరి ఉచ్చులో పవన్ !!


దర్శకరత్న దాసరికీ చిరంజీవికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవి కుటుంబం తో తీవ్రంగా విభేదించే దాసరి ఒక బహిరంగ వేదికలో పవన్ కళ్యాణ్ ను పొగడ బోతున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఆదివారం శిల్పకళా వేదికలో జరగబోయే ‘అత్తారింటికి దారేది’ యూనిట్ కృతజ్ఞతా సభలో దాసరినారాయణ రావు కూడా పాల్గొన బోతున్నాడని తెలుస్తోంది.ఈ విషయమై ఈ సినిమా యూనిట్ వారు దాసరిని కూడా ఆహ్వానించారని దానికి దాసరి ఓకె అన్నారని ఫిలింనగర్ టాక్.

నిన్న దాసరి ఈ సినిమాను ప్రసాద్ లేబరటరీలో కొంతమంది ప్రముఖులతో కలిసి చూసారని సినిమా చుసిన వెంటనే తన ఆనందాన్ని ఆపుకోలేక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసును పొగడ్తలతో ముంచెత్తి వేసారని అంటున్నారు. అత్తారింటి సినిమా విజయాన్ని ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమ తమ సొంత విజయంగా భావిస్తూ పెద్ద తారల దగ్గర నుంచి చిన్న తరాల వరకు ఈసినిమాను తమ భుజాల పై ఎక్కించుకుని మోస్తున్నారు అన్న విషయం వాస్తవం. ఎప్పుడూ గ్రూపులు గా విడిపోయి ఒకరిపై ఒకరు సటైర్లు వేసుకునే టాలీవుడ్ సెలెబ్రెటీలు ఈ ‘అత్తారింటి’ విజయాన్ని తమ విజయంగా భావిస్తూ మాట్లాడుతున్నారు. ఈ పరిస్థుతుల నేపధ్యంలో తనకు నచ్చితే ఆకాశానికి ఎత్తేయడం, నచ్చకపోతే ఆ వ్యక్తి పై భయంకరమైన సెటైర్లు వేసే దాసరి వచ్చే ఆదివారం పవన్ కళ్యాణ్ ను ఏ ఎత్తులో ఆకాశానికి ఎత్తేస్తాడో అంటూ మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ విజయోత్సవ సభకు చిరంజీవి రామ్ చరణ్, అల్లుఅర్జనులలో ఎవరైనా వస్తారా లేకుంటే అన్నీ తానై పవన్ కళ్యాణ్ మెగా హీరోగా ఆ ఫంక్షన్ లో ప్రొజెక్ట్ అవుతాడా అనే అనుమానాలు ఫిలింనగర్ లో వినపడుతున్నాయి. దాసరి పవన్ కళ్యాణ్ ల నూతన ప్రేమానురాగాల స్నేహం టాలీవుడ్ లోని వర్గాల సమీకరణ మార్పుకు సంకేతం కానుందా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎదిఎమైనా వచ్చే ఆదివారం జరుగబోయే పవన్ ‘అత్తారిల్లు’ విజయోత్సవ సభలో చాలా ఆ శక్తికర విషయాలు ఉండేలా కనిపిస్తున్నాయి...

ధూమ్-3 సెకండ్ లుక్?



విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ధూమ్-౩. దీనికి సంబంధించి రెండో పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అమీర్ ఖాన్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషిస్తూ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాడు. అమీర్ ఖాన్ బైక్ పై చేసిన స్టంట్స్ ఆసక్తికరంగా ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన లభించడంతో సెకెండ్ లుక్ ను కూడా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు.

సమ్మెలోనే ఉద్యోగులు.. రెండో నెలా జీతాల్లేవు?


రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో సమ్మె చేస్తున్న మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రెండోనెల కూడా వేతనాలు రాలేదు. దీంతో చిరు, మధ్యతరగతి ఉద్యోగుల కుంటుంబాలు గడవడం కష్టంగా మారింది. ఈనెల దసరా పండుగ కూడా ఉండడంతో జీతాల అకౌంట్‌ ఉన్న బ్యాంకులను ఆశ్రయించి వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చిన్న, మధ్య తరగతికి చెందిన లక్షన్నర మంది ఉద్యోగులు తమ వేతనాల అకౌంట్‌ ఉన్న బ్యాంకులను ఆశ్రయించి 18 శాతం వడ్డీపై ఒక నెల వేతనాలను వ్యక్తిగత రుణంగా తీసుకున్నట్లు సీమాంధ్ర ఉద్యోగƒ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాల అకౌంట్లు తమ వద్ద ఉండటంతో బ్యాంకులు కూడా నెల వేతనాన్ని వ్యక్తిగత రుణంగా మంజూరు చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు.

 పది లేదా 12 వాయిదాల్లో తిరిగి చెల్లించేలా ఈ రుణాలను ఉద్యోగులు పొందుతున్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల ఉద్యోగులు జీతాలు తీసుకోకుండా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 13 నుంచి సీమాంధ్ర జిల్లాల్లోని ఉద్యోగులందరూ సమ్మెలో పాలుపంచుకుంటున్నారు. జిల్లాల్లో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ వంటి ఉన్నతస్థాయి అధికారులు మాత్రమే పనిచేస్తున్నారు. జిల్లా ట్రెజరీ డిప్యుటీ డెరైక్టర్లు కూడా గతనెల 23 నుంచి సమ్మెలోకి వెళ్లడంతో 13 జిల్లాల ఖజానా కార్యాలయాల్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.

 జీతాల కోసం ఖజానా కార్యాలయాలకు బిల్లులను కూడా సమర్పించలేదు. ఆగస్టు 13 నుంచి సమ్మెలో ఉన్నందున నో వర్‌‌క నో పే అమలుచేసినప్పటికీ అంతకుముందు పనిచేసిన 12 రోజులకు కూడా సీమాంధ్ర ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఇందుకు కారణం ఉద్యోగులెవరూ బిల్లులను సమర్పించకపోవడమే. అయితే, ఈ జిల్లాల్లో పెన్షనర్లకు మాత్రం పింఛన్‌ సొమ్ములు అందేలా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు తగిన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ జిల్లాల్లోని పెన్షనర్లకు ఒకట్రెండు రోజుల్లో పింఛన్‌ సొమ్ము అందనుంది. ఇక విధుల్లో ఉన్న సీమాంధ్ర జిల్లాల్లోని పోలీసు, న్యాయ విభాగాలకు చెందిన ఉద్యోగులు, అధికారులకు హైదరాబాద్‌లోని ప్రధాన ఖజానా కార్యాలయం ద్వారా జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.