Wednesday, 2 October 2013

మేమంతా మీ వెంటే.. జగన్‌ విడుదలపై అమెరికాలో సంబరాలు



వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు 16 నెలల తర్వాత బెయిల్‌పై విడుదల కావడంతో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. సెయింట్‌ లూయీస్‌లో వైఎస్సార్‌ యువసేన ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సంబరాలు జరిగాయి. అక్కడి స్థానిక మహత్మాగాంధీ సెంటర్‌లో వైఎస్‌ అభిమాని పమ్మి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం భారీ ర్యాలీ తీశారు.

 అనంతరం వైఎస్సార్‌ యువసేన యూఎస్‌ఏ కమిటీ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సేయింట్‌ లూయీస్‌లో సభను ఉద్దేశించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రƒ శేఖర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఫోన్‌ ద్వారా ప్రసంగించారు. తాము ఆది నుంచి జగన్‌ వెంటే ఉంటున్నామని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ భారీ విజయాన్ని సాధిస్తుందని మేకపాటి ధీమా వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యం సాధించే వరకు మద్దతు ఇలాగే కొనసాగాలని గడికోట ఆకాక్షించారు. ఈ సభలో పలువురు సాఫ్‌‌టవేర్‌ ఉద్యోగులు మాట్లాడారు. సాఫ్‌‌టవేర్‌ నిపుణుడు షేక్‌ కబీర్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌ వల్లే రాష్ట్రంలోని మైనార్టీల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. కిరణ్‌ మలుపు, సి.రంగ , శ్రీకాంత్‌ జొన్నల తదితర ఉద్యోగులు వైఎస్సార్‌ సంక్షేమ పథకాలను ప్రస్తావించారు.

 ప్రముఖ వైద్యుడు గొండిపల్లి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఒక డాక్టర్‌గా వైఎస్‌ అందించిన సేవలను కొనియాడారు. జగన్‌లో వైఎస్‌లోని కమిట్‌మెంట్‌, అంకితభావం, శ్రమించేతత్వం, విజన్‌ ఉందన్నారు. వైఎస్సార్‌ యువసేన యూఎస్‌ఏ కమిటీ బొంతు నాగిరెడ్డి మాట్లాడుతూ... ఈ సంబరాలు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సాధించబోయే విజయాలకు ముందస్తు సంకేతమన్నారు. స్థానిక వ్యాపారవేత్త చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ కుటుంబానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌ తాటిపర్తి, బి.దినేష్‌, రవి ఉప్పలపాటి, విజయనాగ ఇందుకూరి, రామకృష్ణ దగ్గుమతి, సాయి తారపరెడ్డి, శివరామరాజు, మురళిరాజు గొట్టిముక్కల, లింగారెడ్డి గన్నపనేని, శ్రీను దగ్గుమతి, వెంకట్‌ కాట్రగడ్డ, నంద పుప్పల, వంశీరెడ్డి మోపూరు, చందు తారపరెడ్డి, కిరణ్‌ మలుపూరు, రవికాంత్‌, విజయకుమార్‌రెడ్డి, వేదనపతిలతో పాటు వందలాది పాలుపంచుకున్నారు. మహిళలు, పిల్లలు, జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలుపుతూ కేక్‌ కట్‌ చేశారు.

కళ్యాణ్ పేరు బాగా అచ్చొచ్చింది...


ఇందులో నా పేరు కళ్యాణ్. నాకు ఎంతో అచ్చొచ్చిన పేరది. ‘ఇష్క్’ ఆడియోకి పవన్‌కళ్యాణ్‌గారొచ్చారు. సినిమా పెద్ద హిట్. ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో కళ్యాణ్‌గారి పాట పెట్టుకున్నాం. ఆ సినిమా పెద్ద హిట్. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు వర్కవుట్ అవుతుందనిపించింది. అందుకే ఈ సినిమాకు ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’ అనే టైటిల్ ఖరారు చేశాం’’ అని నితిన్ అన్నారు. ఆయన కథానాయకునిగా రూపొందుతోన్న చిత్రం ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’. ప్రేంసాయి దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సోమసుందరం, రేష్మ నిర్మాతలు. తమిళ అగ్ర దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ సమర్పిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నితిన్ మాట్లాడుతూ -‘‘మనకున్న సెన్సిబుల్ దర్శకుల్లో గౌతమ్‌మీనన్ ఒకరు. ఆయన డెరైక్షన్‌లో నటించలేకపోయినా... ఆయన సంస్థలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది’’ అని చెప్పారు. ‘‘లవ్, రొమాన్స్ కలగలిపిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. త్వరలో పాటలను, నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని గౌతమ్‌మీనన్ తెలిపారు. నితిన్‌కి ఇది హ్యాటిక్ హిట్ అవుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేరనేతల ఆర్డినెన్స్ ఉపసంహరణకు కోర్ కమిటీ నిర్ణయం


న్యూఢిల్లీ, అక్టోబర్ 2 : నేర నేతల ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించింది. బుధవారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో భేటీ అయిని కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై భాగ్యస్వామ్య పక్షాలతోనూ కాంగ్రెస్ చర్చలు జరుపనుంది.

మెట్రో రైల్ మోడల్ కోచ్‌ను ఆవిష్కరించిన సీఎం కిరణ్‌ -


హైదరాబాద్, అక్టోబర్ 2 : నెక్లెస్‌రోడ్‌లోని పీవీఘాట్ వద్ద మెట్రో రైల్ మోడల్ కోచ్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం ఉదయం ఆవిష్కరించారు. దీనిని రేపటి(గురువారం) నుంచి ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మోడల్ కోచ్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

వితంతు వేషంలో ఎంపీ శివప్రసాద్ నిరసన


తిరుపతి, అక్టోబర్ 2 : సమైక్యాంధ్రకు మద్దతుగా వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూ సమైక్యవాదుల్లో ఉత్సాహం రేపుతున్న టీడీపీ ఎంపీ శివప్రసాద్ బుధవారం వితంతు వేషంలో నిరసన తెలిపారు. ఈ వేషయంలోనే వెళ్లి గాంధీజీకి నివాళులర్పించారు. అనంతరం విభజనవాదులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు సీమాం«ద్రులతో వియ్యం అందారని గుర్తు చేశారు. సీమాంధ్రకు చెందిన కోడళ్లు, అల్లుళ్లు కావాలని కాని సమైక్యం ఎందుకు వద్దని శివప్రసాద్ ప్రశ్నించారు.

త్రివిక్రమ్‌ని చీల్చి చెండాడిన‌ ఛాన‌ల్?


మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రైట‌ర్‌గా కెరియ‌ర్‌ను స్టార్ట్ చేసి డైరెక్టర్‌గా మారి టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ఎన్నో ఫ్యామిలి ఎంట‌ర్‌టైనింగ్ మూవీల‌ను, బాక్సాపీస్‌ను షేక్ చేయ‌గ‌ల చిత్రాల‌ను అందించాడు. అలాంటిది త్రివిక్రమ్ కెపాసిటి మీదే టెస్టింగ్ జ‌రిగింది ఓ ఛాన‌ల్‌లో. రోజు రోజుకి ఎల‌క్ట్రానిక్ మీడియాలో ఎటువంటి పోటీ జ‌రుగుతుందో తెలుసుకోవ‌డం క‌ష్టంగా ఉంది. టి.ఆర్‌.పిల పరుగుతో ఈ పోటీ అనేది మితిమీరుతుంది, దారి త‌ప్పుతుద‌ని మాత్రం చెప్పవ‌చ్చు. ముఖ్యంగా త్రివిక్రమ్‌,ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్ వ‌చ్చిన లేటెస్ట్ మూవీ అత్తారింటికి దారేది. ఈ మూవీ స‌క్సెస్‌ను ప్రేక్షకుల‌తో పంచుకోవ‌డానికి త్రివిక్రమ్, స‌మంత ఓ లీడింగ్ న్యూస్ ఛాన‌ల్‌కి వెళ్ళింది.

 వెంట‌నే మ‌రో లీడింగ్ ఛాన‌ల్ త్రివిక్రమ్‌కి క‌బురుపెట్టింది. మా ఛాన‌ల్‌కి రండి అని. కాని త్రివిక్రమ్ మ‌రోసారి వ‌స్తాను అని చెప్పడంతో వెంట‌నే అదే రోజు త్రివిక్రమ్ మీద నెగిటివ్ స్టోరిను ఆ ఛాన‌ల్ ప్లే చేసింది. ప‌వ‌న్ లేకుండా ఈ మూవీ ఇంత స‌క్సెస్ అయ్యేదా, ఇందులో డైరెక్టర్ గొప్పద‌నం ఏంటి, జ‌ల్సా,ఖ‌లేజా,అత‌డు మూవీల‌ను ప్లాప్ చేసిన త్రివిక్రమ్‌కు స్టార్ హీరో లేకుండా హిట్టు సాధ్యమా అంటూ చెప్పుకోని రీతిలో నెగిటివ్ స్టోరీను వేశారు. ఆ ప్రొగ్రామ్‌ను చూస్తున్న ఎవ‌రైనా ఆ మాట‌ల‌ను న‌మ్మలేని విధంగా ఉన్నాయి. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఆ స్టోరి వెనుక ఉన్న అస‌లు క‌థ‌ను తెలుకొని ఆ ఛాన‌ల్‌కు వెళ్ళవ‌ద్దని కొంత మంది సెల‌బ్రిట‌ల‌కు స‌మాచారం అందించార‌ని తెలిసింది.

పవన్ క్షమాపణలను బయటపెట్టిన అలీ


పవన్ చెప్పిన క్షమాపణల వెనుక ఉన్న అసలు విషయాన్ని హాస్యనటుడు అలీ బయటపెట్టాడు. పవన్ మంచి మితృలన్న సంగతి అందరికి తెలిసిందే, అంతే కాదు పవన్ కూడా అలీని సోదరుడుగా భావిస్తాడు, ఈవిషయాన్ని పవన్ ఎన్నోసార్లు చెప్పాడు కూడా, అంతే కాదు పవన్ తల్లికూడా పవన్ సినిమాలన్నింటిలో అలీ తప్పనిసరిగా ఉండాలని చెప్పిందట.

 అలాంటి అలీ ఇటీవల పెట్టిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విలేఖరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ సినిమా నటీనటులందరికి క్షమాపణలు చెప్పాడని చెప్పారు. కారణం ఈ సినిమా క్లయిమాక్స్ పర్ఫెక్ట్ గా రావడం లేదంటూ ఈ సీన్ తో సంబందం లేని నటీనటులను, టెక్నీషియన్స్ ను కూడా పవన్ కోపగించుకున్నాడట. అయితే ఆ సీన్ తర్వాత బయటకు వచ్చిన పవన్ అందరికి సారీ చెప్పాడు అని దాని వెనుక ఉన్న అసలు విషయాన్ని అలీ బయటపెట్టాడు అంటున్నారు.

లెజెండ్‌గా బాలకృష్ణ?


నటునిగా భిన్నమైన పాత్రలు పోషించి, స్టార్‌గా పలు రికార్డులు సృష్టించి, హీరోగా వంద చిత్రాలను పూర్తి చేసుకుంటూ... సినీ పరిశ్రమలోని లెజండ్స్‌లో ఒకరిగా నిలిచారు బాలకృష్ణ. అందుకే... ఆయన్ను తెరపై కూడా ‘లెజెండ్’గా చూపించబోతున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి ‘లెజెండ్’ అనే పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.


 ‘సింహా’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. దానికి తగ్గట్టే ప్రతిష్టాత్మకంగా బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు ఉండొచ్చని వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో... బాలకృష్ణ రాజకీయ జీవితానికి ఉపయోగపడే విధంగా ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన కథా కథనాలు, పాత్ర చిత్రణ కూడా బాలయ్య పొలిటికల్ ఎంట్రీకి హెల్ప్ అయ్యేలా ఉంటాయని సమాచారం.


 ‘సింహా’ని మించే స్థాయిలో అత్యంత శక్తిమంతంగా బోయపాటి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని వినికిడి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడా స్టూడియోలో జరుగుతోంది. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. బాలయ్య చిత్రానికి దేవిశ్రీ స్వరాలందించడం ఇదే ప్రథమం. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.